బూరా మరియిక లేరా!
ప్రముఖ భాషా పరిశోధకులు,నిఘంటు నిర్మాణ నిపుణులు,బహుముఖ ప్రజ్ఞాశాలి- బూదరాజు రాధాక్రుష్ణగారు (బూ.రా) తమ 74వ ఏట, 04:06:2006న కీర్తిశేషులైనారు.
వీరి క్రుషి ఫలితంగా తెలుగు వాడుకలో నైపుణ్యాన్ని, మంచి తెలుగు రాయాలన్న శ్రద్దనూ కలిగించే ఎన్నో సంప్రదింపు గ్రంథాలు వెలువడ్డాయి.
ఇంగ్లీషులో అలోచించి తెలుగు పదాలకు తడుముకొనే నా లాంటి వారి ఉపయోగంకోసమన్నట్టే ఉన్న 'ఈనాడు వ్యవహారకోశం'(ప్రస్తుతం అది 'ఆధునిక వ్యవహార కోశం') వారి సంకలనమే.
నేను విరివిగా సంప్రదించే ఇంకొక సంకలనం 'మరువరాని మాటలు '(A Dictionary of quotations from telugu literature).దీని కర్తలూ వీరే.
నేను తరచూ వాడే మరి కొన్ని సంప్రదింపు గ్రంథాలు- 'ఈనాడు భాషా స్వరూపం', 'మంచి జర్నలిష్టు కావాలంటే','తెలుగు సంగతులు ','పురాతన నామకోశం','మాటలూ-మార్పులూ ','మాటల మూటలు ', 'మాటల వాడుక ', తెలుగు జాతీయాలు ','వ్యావహారిక భాషావికాసం ' - ఇవన్నీ వీరి విరచితాలే.
'ఈనాడు ' రామోజిరావుగారు ఆవేదన వ్యక్తం చేసినట్లే "తెలుగు భాష పరిరక్షణపట్ల అందరిలోను స్ప్రుహ పెరుగుతున్న ఈ తరుణంలో బూదరాజు వంటి భాషా పండితుదు మరణించడం తీరని లోటు"
బూరా గారి భారీ భాషా క్రుషికి ఇదే నివాళి!
(http://www.eenadu.net/archives/archive-5-6-2006/panelhtml.asp?qrystr=htm/panel3.htm
http://www.avkf.org/BookLink/view_authors.php?cat_id=125)
____________________________________________________________________
Labels: Personality, Telugu literature/personality
0 Comments:
Post a Comment
<< Home