అరసున్న [ ( ], బండి ' ఱ 'లు ఎందుకు?
అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. ద్రావిడభాషాలక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు గానీ వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న, ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతొంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:
అరు( గు = వీది అరుగు
అరుగు = వెళ్ళు, పోవు
అఱుగు = జీర్ణించు
ఏ( డు = సంవత్సరం
ఏడు = 7 సంఖ్య
కరి = ఏనుగు
కఱి = నల్లని
కా( Oపు = కులము
కాపు = కావలి
కా( చు = వెచ్చచేయు
కాచు = రక్షించు
కారు = ఋతువుకాలము
కాఱు = కారుట (స్రవించు)
చీ( కు = చప్పరించు
చీకు = నిస్సారము, గ్రుడ్డి
తఱు( గు = తగ్గుట, క్షయం
తఱుగు = తరగటం(ఖండించటం)
తరి = తరుచు
తఱి = తఱచు
తీరు = పద్ధతి
తీఱు = నశించు, పూర్తి(తీరింది)
దా( క = వరకు
దాక = కుండ, పాత్ర
నా( డు = కాలము
నాడు = దేశము, ప్రాంతము
నెరి = వక్రత
నెఱి = అందమైన
నీరు = పానీయం
నీఱు = బూడిద
పే( ట = నగరములో భాగము
పేట = హారంలో వరుస
పో( గు - దారము పో( గు
పోగు = కుప్ప
బోటి = స్త్రీ
బో( టి = వంటి [నీబో( టి]
వా( డి = వా( డిగాగల
వాడి = ఉపయోగించి
వేరు = చెట్టు వేరు
వేఋ = మరొకవిధము
మడు( గు,మడుగు మొదలైనవీ ఉన్నాయి.
[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి గారి "సాహిత్య కబుర్లు" , "తెలుగు వెలుగు" ల నుండి.]
Labels: Telugu literature
5 Comments:
ఇలాంటివే మరెన్నో విజ్ఞానదాయ విషయాలు రాయాలని ఆశిస్తూ..తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతము
2:51 am
ee dwaaNA SAstri gAru meeku telusaa guru gAru. eeyana pEru ee madhya ekkaDO cAlA sArlu vinnaTTu gurtu
7:32 am
మంచి విషయము మరొక సారి గుర్తు చేసారు...
ఇవే కాకుండా ఋ, ౠ, ఞ్, ఙ్ లు కాలగర్భములో కొట్టుకొని పోయాయి...
ధన్యవాదములు
అనిల్ చీమలమఱ్ఱి
aceanil.blogspot.com
3:06 pm
తలబరువు లేకుండా
తలకెక్కే విధంగా చెప్పే ద్వా.నా.శాస్త్రి
''సమకాలము వారలు'2 మెచ్చునట్లు రాయటం చాలా కష్టం అన్న విషయంలో ఎవరికీ ఏవిధమైన సందేహం లేదు. అయితే కొందరుంటారు- 'సమకాలం వారి'చేత ప్రశంసలు ఇబ్బడి ముబ్బడిగా పొందుతుంటారు. ఒక పత్రికని కాదు... వస్తోన్న అన్ని పత్రికల్లోనూ వారి రచనలు కనిపిస్తుంటాయి. సాటి రచయితలు, సాహిత్యాభిమానులు వారి పట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తారు. సభలు, సదస్సులు ఎక్కడ జరిగినా వారికి ప్రత్యేక స్తానం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే దేశంలో, రాష్ట్రంలో అత్యున్నతస్థాయి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు... సాహిత్యానికి సంబంధించిన అధ్యయనానికి చివరికి వారినే ఆశ్రయిస్తుంటారు. ఆ విధంగా వారు పత్రికా పాఠకులకు, సాహిత్యాభిమానులకు, పరీక్షార్థులకు, పుస్తకాల చదువరులకు, సభలకు హాజరయ్యే సభికులకు, కార్యకర్తలకు, ఆకాశవాణి శ్రోతలకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రేక్షకులకు అందరికీ చిరపరిచితులుగా ఉంటారు. ఇటువంటి వారుంటారా అని ఆశ్చర్యం కలగవచ్చు! లేకేం... ఉన్నారు... వారే ద్వాదశి నాగేశ్వర శాస్త్రి. ఈ పేరెప్పుడూ విన్లేదనీ అనిపించవచ్చు. నిజమేఆయన తన పేరును ద్వానాశాస్త్రి అనే రాసుకొంటారు!
జాషువా అనగానే 'గబ్బిలం' గుర్తుకొస్తుంది. గుర్తుకు రావాలి కూడా. జాషువా గుండెచప్పుళ్లు ఈ కావ్యాంలో నిక్షిప్తమయ్యాయి. జాషువా వ్యక్తిత్వానికి ఈ కావ్యాం నిలువుటద్దం. ఆయన భావజాలానికి చిహ్న పతాక గబ్బిలం. జాషువాకి దళిత దృక్పథంలేదు. ఆయన దళిత కవి కాడు. గబ్బిలం ప్రధానోద్దేశం దేశారాధనే కాని... దళిత వేదన కాదు- ద్వా.నా.శాస్త్రి ఈ వ్యాఖ్యానం చర్చకు దారితీసింది. అంతేకాదు. కుసుమ ధర్మన్న కవి గరిమెళ్ల సత్యనారాయణ 1921లో రాసిన 'మాకొద్దీ తెల్లదొరతనము దేవా' బాణీలో 'మాకొద్దీ నల్లదొరతనము, దేవ...' అంటూ రాసి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అసలైన దళితగేయం అదీ, తొలి తెలుగు దళితకవి కుసుమ ధర్మన్నే! తన పరిశోధన ద్వారా ఒక వాస్తవాన్ని వెలికితీసి దాన్ని అందరిచేత ఔనని నిరూపించిన ఘనత కూడా ద్వానా శాస్త్రిదే.
తెలుగు సాహిత్యంలో మహామహులనదగిన ఇరవయ్యో శతాబ్దపు సాహితీవేత్తలకి సంబంధించిన అరుదైన ఛాయాచిత్రాలను ఇరవైఏళ్ల శోధనతో వెలికితీసి వాటిని ముద్రించి సాహిత్యాభిమానులకు కన్నుల పండువు చేయడం ద్వానాశాస్త్రి ఒక్కరికే సాధ్యమైంది. నన్నయ్యకాలం నుంచీ నేటి వరకు తెలుగుభాష ఎలా మారుతూ వస్తోందో, విశ్వవిద్యాలయాల్లో అధివసించే పీఠాధిపతులకు, పరిశోధించే విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆ సమాచారాన్ని సామాన్య పాఠకులకు అవగతమయ్యేలా ''మన తెలుగు తెలుసుకుందాం'' పేరుతో నాగేశ్వరశాస్త్రే తేటతెల్లం చేయగలిగారు. అందుకే ఆచార్య సి.నారాయణరెడ్డి ''తలబరువు లేకుండా, తలకెక్కే విధంగా చెప్పార''ని కితాబునిచ్చారు. అంతేకాదు ఏ పుస్తక విమర్శలో అయినా ''ఎక్కడ మరకలుంటే అక్కడ చురకలేస్తార''నీ సినారె ద్వానాశాస్త్రి స్వభావాన్ని చమత్కరించారు. తెలుగు సాహిత్య చరిత్రని ఆయా కాలాల్లో ఎందరో ప్రముఖులు తమదైన పద్ధతిలో సంక్షిప్తీకరించి భావితరాలకు అందించారు. ఇటీవల ఆరుద్ర, జి.నాగయ్య నడచిన బాటలో నడిచి ద్వానాశాస్త్రి వెయ్యేళ్ల తెలుగు సాహిత్యచరిత్రని ఎనిమిది వందల పుటల్లో అందించి భాషా సాహిత్యసేవలో అందరికన్నా ముందు నిలిచారు. నిజానికి శాస్త్రి రాసిన ముప్పైకి పైగా రచనల్లో తెలుగు సాహిత్య చరిత్ర ఒక్కటి చాలు ఆయన కీర్తిని శాశ్వతం చేయడానికి!
ద్వానాశాస్త్రి ఎదిగేకొద్దీ ఒదిగి నిలిచే ఒదిగి నిలిచే వ్యక్తిత్వం ఉన్న కవి, పరిశోధకుడు, రచయిత, విమర్శకుడు. ''ఉదంతు శతమాదిత్యాః, ఉదయంతు శతమిందవః, నవినా విదుషాం వాక్వైః, నశ్యత్యాం భ్యంతరం తమః''- నూరుగురు సూర్యులు ఉదయించు గాక, నూరుగురు చంద్రులూ ఉదయించుగాక, ఒక విద్వాంసుని వ్యాక్యాలవల్ల తప్ప లోపలి చీకట్లు చెదరిపోవు'' అన్న ప్రాచీనుల అభిమతాన్ని విశ్వసించే రచయిత. మనిషి లోపలి చీకటిని పారదోలేపనిలోనే శాస్త్రి ముప్పై కావ్యాలు రాశారు. శాస్త్రి తన గురువులైన బండ్లమూడి సత్యనారాయణ, ఆచార్య తూమాటి దొణప్ప, ఆచార్య చేకూరి రామారావు, ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావులకు నమస్సులర్పించందే కావ్యారచనకైనా, ప్రసంగమైనా ప్రారంభించని సుగుణ, వినయశీలి. ఓచోట దొణప్ప స్వయంగా- ''మా అంతే వాసులలో శాస్త్రి ముఖ్యుడు. అతని గృహనామాన్నీ, ఉక్తి చారుతనూ, యుక్తి చతురతనూ, నిత్య శూరులలో శాస్త్రి ఒకడని చమత్కరిస్తూ ఉంటాను'' అన్నారంటే అది అతిశయోక్తి కాదనిపిస్తుంది! నిజంగానే నాగేశ్వరశాస్త్రి నిత్యశూరుడు!! ప్రాచ్య పాశ్చాత్య విమర్శనామర్యాదలను ఆకళింపు చేసుకొన్న విమర్శకుడు. చెప్పేదేదో సరికొత్తగా చెప్పాలనే నిత్యమూ పరితపించే జిజ్ఞాసి.
కృష్ణా జిల్లా, లింగాలలో 1948 జూన్ పదిహేనో తేదీ లక్ష్మీ ప్రసన్న, కృష్ణమూర్తి దంపతులకు జన్మించిన ద్వానాశాస్త్రి- ''శిష్యవరుల పేళ్లను చెప్పుటకును గురులు/సిగ్గిలు దుష్కాలమరుగుదెంచె/ నేను మాత్రము ధన్యుడ, నిన్నుబోలు శిష్యులున్నారు...'' అని గురువుల నుంచే ప్రశంసలందుకొన్న విద్యార్థి. ఏలూరు శ్రీ సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.ఎస్సీ చదివాక ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎం.ఎ., తెలుగు పూర్తి చేశారు. ''మారేపల్లి రామచంద్రశాస్త్రి కవిత్వం''పై ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం సమర్పించారు. మారేపల్లి అంటే శ్రీశ్రీ, ఆరుద్ర, పురిపండావారికి ఛందస్సు నేర్పిన గురువు! తెలుగు విశ్వవిద్యాలయంలో ''సాహిత్యసంస్థలు''పై పరిశోధన చేశారు. దానికి స్వర్ణపతకం పొందిన శాస్త్రి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంలో పి.జి. డిప్లమా పొందారు. అమలాపురంలో శ్రీ కోససీమ భానోజీ రామర్సు కళాశాలలో 1972నుంచి 2004 వరకు తెలుగు శాఖలో రీడర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఐ.ఎ.ఎస్., గ్రూప్ వన్, టు, జూనియర్ లెక్చరర్లు, తెలుగుపండిట్ ఉద్యోగాలకు తెలుగు తీసుకొనే అభ్యర్థులకు శిక్షణ నివ్వడంలో మునిగి ఉన్నారు. పోటీ పరీక్షలు రాసేవారికి, సాహిత్యాన్ని సాధ్యమైనంత సులభంగా, అర్థమయ్యేలా చెప్పడం ఆయన లక్ష్యం! దీన్ని ఆయన సాధించారనడానికి నిదర్శనం ఆయన్ని ఆశ్రయిస్తున్న అభ్యర్థి బృందమే! ''సాహిత్యం ఇప్పటివరకూ కొందరికే పరిమితమై ఉండేది... దాన్ని అందరికీ అందుబాటులోకి తేవడమే నా లక్ష్యం'' అనే శాస్త్రి కవిగా సమాధిలో స్వగతాలు, ద్వానా కవితలు, సాహిత్య నానీలు, బుష్ కాకి (దీర్ఘ కవిత) వంటి కవితా సంపుటాలు ప్రచురించారు. వాఞ్మయలహరి, సాహిత్య సాహిత్యం, ద్రావిడ సాహిత్య సేతువు, వ్యాస ద్వాదశి, అక్షర చిత్రాలు, శతజయంతి సాహితీ మూర్తులు, వ్యాసలహరి, విమర్శ ప్రస్థానం, కవిగారి జీవితం- రచనలు, గోపి కవితానుశీలనం, సాహిత్య కబుర్లు, తొలి దళితకవి కుసుమ ధర్మన్న కవి వంటి ఎన్నో వ్యాస సంపుటాలు ప్రచురించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ, తెలుగు అకాడమీ వంటి సంస్థలు ప్రచురించిన గ్రంథాలలో విస్తృతంగా రాశారు. యుజిసి నేషనల్ విజిటింగ్ ఫెలోషిప్ పొందిన శాస్త్రి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, ముంబాయి ఆంధ్ర మహాసభ, ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్ సత్కారం... వంటివి పాతిక పైన్నే పొందారు... గతానికి వర్తమానానికి వారథి శాస్త్రి. సాహిత్యం పట్ల కోరిక, ఓపిక, తీరిక ఉన్న వ్యక్తి. విమర్శలోనూ, కవిత్వంలోనూ సవ్యసాచి.
- చీకోలు సుందరయ్య
http://www.eenadu.net/sahithyam/display.asp?url=pratibhavantulu83.htm
2:46 pm
Thank you for sharing valuable information.
8:12 pm
Post a Comment
<< Home