బ్లాగు చూశారా!
ామెడీ పేరడీలు, యాత్రా విహారాలు
కామెడీ పేరడీలు, యాత్రా విహారాలు, టెక్నాలజీ గుసగుసలు ఇలా ఎన్నెన్నో praveengarlapati.blogspot.com లో అలరిస్తాయి. బ్లాగులో ప్రవేశించగానే తెలుగు బ్లాగు పుస్తకం అంటూ లింకు కనిపిస్తుంది. ఎంటరైపోతే ఎన్నో కొత్తబ్లాగులపై విశ్లేషణలు ఆకట్టుకుంటాయి. హాస్యం, రాజకీయం ఇలా ఎన్నో అంశాలపై చక్కని వ్యాసాలు నవ్వుల జల్లులు కురిపిస్తాయి. వై.ఎస్., చంద్రబాబు టీంల మధ్య క్రికెట్ మ్యాచ్‌పై హాస్యపు చురకలు, 'ఆయ్ మేమంటే ఇంత చులకనా' అని సాఫ్ట్‌వేర్ జనాల వెతలు కడుపుబ్బ నవ్విస్తాయి. తెలుగు భాషకు సంబంధించి నెట్‌లోని ఉపకరణాలు, సాఫ్ట్‌వేర్‌లకు లింకులున్నాయి. వాటిపై చక్కని విశ్లేషణలూ చూడొచ్చు. సాంకేతికపరమైన విషయాలపై తెలుగు వ్యాసాలు ఈ బ్లాగులో ప్రత్యేకం. కొత్తగా విడుదలైన గూగుల్ క్రోమ్, అలాగే ఫైర్‌ఫాక్స్ వంటి నెట్ సర్వర్లపై, ఎన్నో కొత్త సాఫ్ట్‌వేర్‌లపై తన విజ్ఞానాన్ని తేటతెల్లం చేశారు. మైక్రో బ్లాగింగ్ అంటూ కుచించుకుపోతున్న సమాచారంపై విశ్లేషించారు. ఇవే కాదండీ! సినిమా సమీక్షలు, చిన్న చిన్న కథలపై రచయిత అభిప్రాయాలు చదవొచ్చు. ఇటీవల కొత్తగా వచ్చిన సినిమాలు, జపనీస్, పాకిస్తానీ, ఇంగ్లిషు ఇలా చాలా సినిమాల సమీక్షలు అలరిస్తాయి. తెలుగు హీరోల నృత్యాలపై తనదైన శైలిలో వర్ణిస్తూ యూట్యూబ్ వీడియోల్ని జతపరిచారు. రచయిత వెళ్లిన ప్రదేశాల గురించి మంచి ఫొటోలతో ట్రావెలాగుడు, ట్రెక్కింగ్ అంటూ ఆకట్టుకుంటారు. హిమాలయాల్లో ట్రెక్కింగు సీరిస్ తెలుగు బ్లాగు లోకంలో కొత్త అనుభూతి. తన అనుభవాలనూ, ఆలోచనలను అందరితోనూ పంచుకుంటున్న ఈ బ్లాగు రచయిత చక్కని హాస్యపు గుళికలు రాస్తూ మెప్పిస్తున్నారు.
(ఈనాడు, ఈతరం, 25:10:2008)
_____________________________
Labels: Blogging
0 Comments:
Post a Comment
<< Home