1322 - ప్రేమకు నాలుగు పునాదులు!
ప్రేమించడం అంటే కేవలం ఇష్టపడటమే కాదు. నమ్మకం, బాంధవ్యం, నిబద్ధత, గౌరవం అనే నాలుగు మానసిక భావనలపై ఆధారపడి ఉంటుంది ప్రేమ. ఇంటి నిర్మాణానికి పునాదులు ఎంత ముఖ్యమో.. ప్రేమకు ఆ నాలుగు అంశాలూ అంతే అవసరం. స్టెయిన్‌బర్గ్ అనే మానసిక తత్వవేత్త 'ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గదు' అంటాడు. ఉపరితలం ఎంత నునుపుగా ఉన్నా భూతద్దంలో నుంచి చూస్తే ఎన్నో ఎత్తువంపులు కనిపిస్తాయి. అలాగే వ్యక్తుల ప్రవర్తనని తరచి చూస్తే ఏవో అనుమానాలు పుట్టుకొస్తాయి.
(డా|| కె.నిరంజన్ రెడ్డి, క్లినికల్ సైకాలజిస్ట్, ఈనాడు, 04:01:2014)
Labels: Life, Self development
0 Comments:
Post a Comment
<< Home