ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు. వారి అన్యోన్య దాంపత్యం లోకి బి.పి. అనే
రోగం ప్రవేశించింది. ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆ భర్త డాక్టర్ ని
సంప్రదిస్తే ... పరీక్షలు చేసిన డాక్టర్ అతనికి హై బి.పి ఉన్న కారణంగా ఆహార
నీయమాలు పాటించాలని, ఉప్పు అసలు వాడకూడదు అని చెప్పాడు. అ రోజు నుండి అతని
భార్య ఎంతో ప్రేమగా అతనికి కావాల్సిన అన్నీ సమకూరుస్తూ , అతనికి కావాల్సిన
విధంగా ఉప్పు లేకుండా వంట చేస్తూ ఉండేది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ
ఒకనాటి ఉదయాన్నే అతను బాత్ రూం లో
అచేతనంగా పడి ఉన్నాడు . హుటా హుటిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా
పరీక్షించిన డాక్టర్ ..... హై బిపి వలన అతను ఆలా పడిపోయాడని చెప్పారు .
రెగ్యులర్ గా మందులు వాడుతున్నా , ఆహార నీయమాలు పాటిస్తున్నా అతనికి అంత
ఉదయాన్నే అంత బి.పి ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. చాలా పరిశోధనల
తర్వాత డాక్టర్ కనిపెట్టిన విషయం ఏంటంటే
.
.
.
.
వాళ్ళ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది!
________________
________________
No comments:
Post a Comment