శ్రీశ్రీ జయంతి, ఏప్రిల్ 30వ తేదీన
"తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా"
"స్వాతంత్ర్యం ఒక చాల సున్నితమైన పూవు,
చాల వాడైన కత్తి, విలువైన వజ్రం"
"(1930 దాకా)తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచి దాన్ని నేను నడిపిస్తున్నాను."
"ప్రపంచమొక పద్మ వ్యూహం,కవిత్వమొక తీరని దాహం"
"ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే ఆధునిక జీవితమే అర్థం కాలేదన్న మాట"
"నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే కుటుంబం
వెదజల్లుతా దిగ్దిగంతం, అభ్యుదయ సుగంధం"
"వ్యక్తి ఏకవచనం, శక్తి బహువచనం"
"వెనుక దగా ముందు దగా
కుడియెడమల దగా దగా"
"తెల్లవాడు నిన్ను నాడు భగత్సింగు అన్నాడు
నల్లవాడు నువ్వు నేడు నక్సలైటువన్నాడు
ఎల్లవారు నిన్ను రేపు వేగుచుక్క అంటారు"
"ఊగరా ఊగరా ఊగరా! ఉరికొయ్య అందుకొని ఊగరా"
"మంటలచే మాట్లాడించి, రక్తంచేత రాగాలాపన చేయిస్తాను"
"నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను"
"పదండి ముందుకు
పదండి తోసుకు
పోదాం పోదాం పైపైకి"
"మరో ప్రపంచం మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది"
"యముని మహిషపు లోహఘంటలు
మబ్బుచాటున ఖణేల్మన్నాయి"
"కాదేది కవితకనర్హం"
"ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం"
"నైలు నదీ నాగరికతలో
సామాన్యుని జీవనమెట్టిది?
తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అదిమోసిన బోయీ లెవ్వరు?"
"ఘర్మ జలానికి దర్మ జలానికి ఖరీదు కట్టే షరాబు లేడు"
"అంతేలే, పేదల గుండెలు
అశ్రువులే నిండిన కుండలు
శ్మశానమున శశికాంతులతో
చలిబారిన వెలిరాబండలు"
"జీబ్రాకి,ఆల్జీబ్రా చిహ్నాల
లాంకోటూ, పాంకోళ్ళు తొడిగి
సాహిత్య పౌరోహిత్యం యిస్తే
వెర్రి కాదు సర్-రియలిజంరా సోదరా"
"నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి నా జాతి జనులు పాడుకొనే మత్రంగా మ్రోగించాలని"
____________________________________________________________________
Labels: Telugu literature
0 Comments:
Post a Comment
<< Home