తెనుగు, తెలుగు లేక తెలుంగు
______________________________________________________________
1)"తెలుగునకు........'తేనె అగు ' 'త్రికళింగ ' 'తెల్ల అగు ' 'తెన్ '(దక్షిణము) మున్నగు నర్థవివరణము లున్నవి."
-(పుట6) ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము, గ్రంథకర్త: కే.వేంకటనారాయణరావు ('కవిత్వవేది '), బీ.ఏ., యల్.టి., చెన్నపురి: వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే ప్రకటితము.1967.
2)"...'తెలుగు లేక తెలుంగు ' శబ్దం 'త్రికలింగ ' లేక 'త్రిలింగ ' శబ్దములనుండి వచ్చిందని కొందరి ఊహ. త్రిలింగములనగా శ్రీశైలం, సింహాచలం, కాలేశ్వరం (వేములవాడ) ఈ మూడు క్షేత్రముల మధ్యనున్న ప్రదేశములో నివసించేవారు 'త్రిలింగులు ' లేక 'తెలుంగు 'లని వీరి ఉద్దేశం కావచ్చు. తర్వాత 'తెనుగు ' అనే పదానికి 'తేనె + అగు ' అనగా తేనె వలె మధురంగా ఉండేటటువంటిది. కనుక 'తెనుగు ' అయిందని మరికొందరి ఊహ. ఏమైనా ఇవన్నీ ప్రాచీనకాలం నుంచి ప్రచారంలో ఉన్న పేర్లే."
-(పుటలు20 & 21) డా.కె.ఆర్.కె.మోహన్: తెలుగు సాహిత్య చరిత్ర (పిల్లల కోసం ), శ్రీముఖ పబ్లికేషన్స్-హైదెరాబాద్,2004.
3)"శ్రీ పర్వత, కాళేశ్వర, ద్రాక్షారామముల మధ్య ప్రదేశము త్రిలింగ దేశమ్నియు, క్రమక్రమముగ తెలుగు దేశ మయ్యెనని అందురు. 'తెల్ ' అను నది యొడ్డున నివాసముండి ఈ దేశమునకు వచ్చుటచేత తెలుగు వారైనారని యొక వాదము. తెనుగు, తేనె+అగు అను శబ్దముల కలయిక. తేనెవంటి భాషయని దీని యర్థము.'తెళి +అగు=తెలుగు. తెళి అనగా తెలివి,తేట అను నర్థముతో వాడబడిన ద్రావిడ ధాతువు."
-(పుటలు 4 & 5), సమగ్ర తెలుగు భాషా సాహిత్య సంగ్రహము, రచన: మార్ల, తిరుమల పబ్లికేషన్స్,హైదరాబాద్.
________________________________________________________
For details please see- http://wowmusings.blogspot.com/2006/02/telugu-language-introduction-for-non.html
and
http://wowmusings.blogspot.com/2006/11/blog-post.html
__________________________________________________________
Labels: Telugu literature
0 Comments:
Post a Comment
<< Home