నెట్ 'సమ్'పాదన
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కొన్ని ఫొటోలు... ఇంట్లో పాతసామానూ... ఎందుకూ పనికిరాని ఈ మెయిళ్లు... కాదేదీ నెట్ సంపాదనకనర్హం. మచ్చుకు కొన్ని మార్గాలు...
బ్లాగింగ్...
మీకు మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. కంప్యూటర్‌ను సమర్థంగా పనిచేయించే టిప్స్, ట్రిక్స్ బోలెడన్ని తెలుసు. మీకు తెలిసిన దాన్ని బ్లాగులో అందరికీ అర్థమయ్యేలా రాయగలరు. కంప్యూటర్లకు సంబంధించినవే కానక్కర్లేదు. రియల్‌ఎస్టేట్ మీదయినా... వెబ్‌సైట్ల మీదయినా... బాగా రాయగలగడవెుక్కటే అర్హత. ఈ క్వాలిఫికేషన్ చాలు!
మిమ్మల్నీ మీ బ్లాగునూ అద్దెకు తీసుకునేందుకు చాలా కంపెనీలే సిద్ధమవుతాయి.
ఉదాహరణకు www.payu2blog.com, payperpost.com, blogs“ertise.com, blogiti“e.com... పేమెంట్ అంతా అమెరికన్ డాలర్లలోనే. దీన్ని 'పెయిడ్ బ్లాగింగ్ (paid blogging) అంటారు.
కాకపోతే ఒకచిక్కు. ఒకసారి దీనికి కమిటైతే ఆ తర్వాత సైట్ నిర్వాహకులు కోరే అంశాల మీదే బ్లాగ్ పోస్టులు రాయాల్సి ఉంటుంది. మనసుకు తృప్తినివ్వని ఇలాంటి పన్లన్నీ ఎందుకంటారా... అయితే ఇంకో చిట్కా. మీ బ్లాగులో యాడ్స్ ఉంచటానికి అనుమతిస్తే చాలు. ఎవరైనా ఆ లింకును క్లిక్‌చేసిన ప్రతిసారీ మీ అకౌంట్లో సొమ్ము జమ అవుతుంటుంది. ఎవరో యాడ్ ఇస్తారు... ఇంకెవరో దాన్ని క్లిక్ చేస్తారు... సొమ్ము మాత్రం మీకు! బాగుంది కదూ!
చెత్తనుంచి...
మనకు పనికిరాని వస్తువు ఈ భూప్రపంచమ్మీద ఇంకెవరికీ పనికిరాదనుకోవడం అమాయకత్వం. ఉదాహరణకు... ఇంట్లో తాతలనాటి వస్తువులు కొన్నుంటాయి. వాటివల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అలాంటివాటిని స్టోర్‌రూముల్లో మగ్గబెట్టే బదులు ఎంచక్కా ఓ ఫొటో తీసి www.ebay.inవంటి సైట్లలో పెట్టండి. ఆ వస్తువు కావలసిన వాళ్లు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కళ్లకద్దుకొని మరీ కొనుక్కుంటారు.
క్లిక్‌టుడే
చేతిలో డిజిటల్ కెమెరా ఉందా... బుర్రలో సృజనాత్మకత ఉందా! అయితే చలో, మీ ఫొటోను కొనుక్కునే సైట్లు చాలానే ఉన్నాయి. www.istock.com, dreamstime.com, shutterstock.com లాంటి మైక్రోస్టాక్ ఫొటోసైట్లతో పాటు ఇంకా చాలా సైట్లు మీ ఫొటోలకు ధరచెల్లించి కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.
టాలెంట్...
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, అక్కౌంటెన్సీ... ఏ రంగమన్నది కాదు ప్రశ్న. అందులో మీరెంత నిష్ణాతులన్నదే పాయింటు. మీరు ఫ్రీలాన్సింగ్ చేయడానికి సిద్ధమైతే చాలు. మీ సేవలను వినియోగించుకోవడానికి చాలా కంపెనీలే ఉన్నాయి. అలాంటి ఫ్రీలాన్సర్లనూ కంపెనీలనూ కలిపే ప్లాట్‌ఫాం లాంటి www.guru.com
'సదా మీ సేవలో' అంటున్నాయి.
'సర్వే'ధనా...
'ఫలానా సర్వేలో ఇలా తేలింది...
ఇంకో సర్వేలో అలా తేలింది' అని వార్తలొస్తుంటాయి కానీ ఎక్కడ జరిగాయో చాలాసందర్భాల్లో తెలీదు. ఆ తరహా సైకాలజీ, మార్కెటింగ్ తదితర సర్వేల్లో మీరూ పాల్గొనవచ్చు. వాళ్లడిగే సుత్తిప్రశ్నలకు సమాధానాలిస్తే చాలు. ఒక్కో సర్వే పూర్తవడానికి పావుగంట ఇరవై నిమిషాలు పడుతుందంతే! www.treasuretrooper.com, acop.com... వంటి సైట్ల మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచండి మరి.
చదివినంతనే...
ఈ మెయిల్స్ చదివితే చాలు, మీ ఖాతాలో డాలర్లు పోగేస్తామంటాయి కొన్ని సైట్లు. అవన్నీ వాణిజ్యప్రకటనలకు సంబంధించిన మెయిళ్లు మరి. ఉదాహరణకు www.e-mailpaysu.com, cashread.com... ఒక్కో మెయిల్ చదివి అందులో ఉండే లింకును క్లిక్‌చేసి సంబంధిత సైట్‌ను చూస్తే చాలు, చదివింపులు అందజేసే కంపెనీలున్నాయి. కాకపోతే ఇందుకోసమే ప్రత్యేకంగా ఒక మెయిల్ ఐడీని సృష్టించుకోవాల్సి ఉంటుంది. స్పామ్ ఫిల్టర్లని తీసేసి అన్ని మెయిళ్లనూ ఆహ్వానించాల్సి ఉంటుంది.
వాడండి... చెప్పండి...
మార్కెట్లోకి కొత్తగా ఏదైనా ఉత్పత్తి రాగానే వెబ్‌సైట్ల నిండా సమీక్షలు వెల్లువెత్తుతాయి. బాగుందనో బాగాలేదనో అస్సలు ఉపయోగంలేదనో అట్టర్‌ఫెయిల్యూరనో... ఎవరు రాస్తారు వాటిని? ఎవరు రాస్తే ఏంటి... అయినా ఎవరో రాసింది ఎందుకు చదవాలి... www.reviewstream.com లాంటి సైట్లు మనకు బంగారం లాంటి అవకాశాన్ని కల్పిస్తుండగా..! మనమే సమీక్ష రాస్తే పోలా?మన రివ్యూ ప్రచురితమైందా... ఎంతోకొంత జేబులో పడ్డట్టే.
లలలాం... లలలాం... లక్కీచాన్సు కదా!
...ఇంతేనా, అన్న నుంచుంటే మాస్
అన్న కూచుంటే మాస్ అన్నట్టు, మీరు నెట్‌లో ఆట ఆడినా డబ్బులే అందమైన బొమ్మగీసినా డబ్బులే! పదండి మరి నెట్‌ప్రపంచంలో విహరించండి. 'సమ్'పాదన వెుదలెట్టండి.
(ఈనాడు ఆదివారం, సచిత్రకథనాలు, 13:07:2008)
_______________________________________
Labels: Blogging
0 Comments:
Post a Comment
<< Home