'సైటు' కొట్టిచూడు
ఇంటర్నెట్ ఈ ప్రపంచాన్నే కుగ్రామం చేసేసింది. మనకు తెలీని ఎన్నో విషయాల్ని మన ముందుకు తెచ్చింది. ఆటా పాటా విందూ వినోదం వ్యక్తులూ సంస్థలూ... ఇలా ఎన్నో చూడొచ్చు, తెలుసుకోవచ్చు. ఇలాంటి ఆసక్తికర అంశాలు అందించే వెబ్‌సైట్లు కొన్ని లక్షలున్నాయి నెట్‌లో. అయితే వాటిలో ఉపయోగపడేవి మాత్రం కొన్నే! ఆ కొన్నింటిలో కొన్ని...
రకరకాల ఫాంట్లు ఇంగ్లిషులో పెళ్లి శుభలేఖ కొట్టించాలంటే మనకు అందుబాటులో ఉన్నవి మహాఅయితే వందా నూటయాభై ఫాంట్లు. కానీ www.dafont.com గురించి తెలిసిన వారు మాత్రం చిత్రవిచిత్రమైన అక్షరమాలలు ఉపయోగించగలరు. ఎందుకంటే ఈ సైట్‌లో 7,500 ఫాంట్లు లభ్యమవుతాయి మరి. |
ఏ పనికి ఎన్ని క్యాలరీలు? అట్నుంచి నరుక్కు రావడం అంటే ఏంటో పీటర్ క్రిస్టెన్‌సెన్‌కు బాగా తెలుసు. అందుకే www.caloriesperhour.com సైట్ పెట్టి హిట్ల మీద హిట్లు సంపాదిస్తున్నాడు. మరేం లేదండీ, ఏ పదార్థం తింటే ఎన్నిక్యాలరీలు వస్తాయి అనేది తరచూ పత్రికల్లో వస్తూనే ఉంటుంది. మరి ఏ పని చేస్తే ఎంత శక్తి ఖర్చవుతుందనే వివరాలు మాత్రం అంతగా కనబడవు. ఆ లోటు తీర్చే చోటే ఈ సైట్. నిపుణులతో పరిశోధనలు చేయించి మరీ ఏ పనికి ఎన్ని క్యాలరీలు కరుగుతాయో లెక్కకట్టించి ఈ సైట్‌లో పెడుతున్నాడు పీటర్. నిర్దిష్టంగా బరువు తగ్గాలనుకునేవారు తమ ప్రస్తుత బరువు, రోజువారీ చేసే పనుల వివరాలు ఈ సైట్‌లో పెడితే చాలు. రోజూ ఎన్ని క్యాలరీలు ఖర్చవుతున్నాయి, ఇంకా తగ్గాలంటే ఏ వ్యాయామాలు చేయాలో చెప్తారు. కాకపోతే బరువును పౌండ్లలోనే(ఒక పౌండు=0.45kiloగ్రాములు) సూచించాలి. |
పుస్తక నిలయం www.secondhandbooksindia.com.అన్ని పుస్తకాలూ షాపుల్లో దొరకవు. కొన్ని అరుదైన, పాత పుస్తకాలుచాలా తక్కువ మంది దగ్గరే ఉంటాయి. అలాంటి పుస్తకాలు కావాలంటే ఈ సైట్‌లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఒకవేళ ఉంటే మీ పంట పండినట్టే. బోలెడంత ఖరీదుపెట్టి కొత్తపుస్తకాలు కొనేబదులు కొద్దిరోజులాగితే సరిపోతుందనుకునే వారికీ ఈ సైట్ ఉపయోగకరమే. కొంచెం తక్కువ ధరలో పుస్తకాలు తెప్పించుకోవచ్చు. మీ దగ్గర ఉన్న పాతపుస్తకాలకూ వెలకట్టి అమ్మేసి సొమ్ము చేసుకోవచ్చు. పేమెంట్ కూడా ఐసీఐసీఐ, ఐఎన్‌జి వైశ్యా వంటి బ్యాంకుల ద్వారా చేయవచ్చు. ఇలాంటిదే మరొకసైట్ ఉంది. అది www.buyselloldbooks.com.మీ దగ్గర ఉన్న పుస్తకాలను అమ్మదలచుకుంటే ఈ సైట్‌లో పెట్టొచ్చు. కొనాలనుకున్నవారి సౌలభ్యం కోసం ఫోన్‌నెంబర్ ఇవ్వొచ్చు. ఇవ్వకపోయినా సైట్‌ద్వారా కాంటాక్ట్ చేసే సౌకర్యం ఉంటుంది. వెుత్తమ్మీద, పాతపుస్తకాలు కొనేవాళ్లకూ అమ్మేవాళ్లకూ ఒక ప్లాట్‌ఫాం లాంటిదీ సైట్. |
ాయిస్‌వైబ్స్ విను వినిపించు... లైఫ్ అందించు, వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా! ...ఎఫ్‌ఎం రేడియోలు మన జీవితంలో భాగమైపోయి చాలాకాలమే అయింది. ప్రవాసాంధ్రులూ ప్రవాస హైదరాబాదీలకూ ఆ ఆనందం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందండోయ్!www.voicevibes.net పేరుతో రాజ్ అనే తెలుగోడు నిర్వహిస్తున్న వెబ్‌సైట్ ఇది. ఈ సైట్ పెన్ చేస్తే చాలు... భాగ్యనగరంలో బాగా పాపులరయిన మూడు ఎఫ్‌ఎమ్ స్టేషన్లకు ట్యూనయిపోవచ్చు ఎంచక్కా. |
ఉచితంలో రకాలు సెల్ నుంచి సెల్‌కు ఎస్సెమ్మెస్ పంపడం పురానా జమానా. పైగా అందుకు కొంత ఖర్చవుతుంది కూడా. ఆ పని ఉచితంగా చేసిపెట్టే వెబ్‌సైట్లు చాలానే వచ్చేశాయి. అందులోనూ రకరకాలు. ఫన్నీ, లవ్, గ్రీటింగ్ ఎస్సెమ్సెస్‌లు... అన్నీ(ఇన్‌స్టెంట్ మెసేజ్‌లు) రెడీగా ఉండే సైట్లు కొన్నయితే, నెట్ ద్వారా పంపుతున్నా ఏదో మన ఫోన్ నుంచే పంపిస్తున్నట్టు భ్రమింపజేసేవి మరికొన్ని. కొన్ని సైట్లయితే రిమైండర్లు పెట్టుకొని మరీ మనసైనవారికి సందేశం పంపుకొండి అంటూ ఆహ్వానం పలుకుతున్నాయి. పెళ్లిరోజునో భార్య పుట్టినరోజునో మర్చిపోయే 'మగా'నుభావులకు భలే సౌలభ్యం ఈ సైట్లు. ఇంకా ఇలాంటివే చాలా ఉన్నాయి. 'send free sms'అని గూగుల్ సెర్చ్‌లో టైప్‌చేసి వెదికితే వందలకొద్దీ సైట్లు! వెతికినకొద్దీ మరెన్నో ఫీచర్లు! |
|
మధుమేహ రోగులు చేయాల్సిన వ్యాయామాలూ, టై కట్టుకునే పద్ధతులూ, రకరకాల హెయిర్‌స్త్టెల్స్... ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వీడియో సాయంతో నేర్పించే సైట్ ఉంటే ఎంత బాగుణ్ణు అనుకుంటున్నారా..! అయితే www.wonderhowto.com సైట్‌ను సందర్శించాల్సిందే. ఒక్క హెయిర్‌స్త్టెల్స్ విభాగంలోనే 784 రకాలుగా జడవేసుకునే పద్ధతుల్ని చూడొచ్చు. ప్రపంచంలో ఉన్న అన్నిరకాల ముద్దులూ పెట్టుకొనే పద్ధతులూ లాంటి హాట్‌హాట్ వీడియోలైతే ఇందులో కోకొల్లలు. |
(EEnadu, 28;12:2008)
____________________________________________
Labels: websites
2 Comments:
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-కిరణ్
11:21 pm
Thanks a lot !
11:44 pm
Post a Comment
<< Home