సరైన నిర్ణయానికి 10-10-10
జీవితాన్ని మలుపుతిప్పే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎన్నో విధాల ఆలోచిస్తాం. కొత్తగా ఓ పని మొదలుపెట్టాక కూడా కొందరు... గతంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనా? కాదా? అని వూగిసలాడుతుంటారు. అలాంటి వారికి తనదైన సలహాను చెబుతున్నారు సుజి వెల్చ్. తుది నిర్ణయాలకు సంబంధించి ఈమె సూచించిన ఓ అంశం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పలువురి మెప్పు పొందింది. ఆ సూత్రాన్నే '10-10-10' అనే పుస్తకంలో ఆమె పొందుపరిచారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. మనం తీసుకునే నిర్ణయం ప్రభావం, తర్వాతి 10 నిమిషాలు, 10 నెలలు, 10 ఏళ్ళలో ఎలా ఉండబోతుందన్నది ఆలోచిస్తే చాలన్నది ఆమె చెప్పిన సిద్ధాంతం.
''మన జీవితంలో పదేళ్ళు ముందుకు వెళ్ళి చూసుకోగలిగినప్పుడు ఇవాళ్టి నిర్ణయానికి ఓ ప్రత్యేకత ఏర్పడుతుంది. అప్పుడేదో అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల నా పరిస్థితి ఇలా దిగజారింది.. అని బాధపడాల్సిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో మన నిర్ణయాలు మన ఆత్మీయులు, బంధువుల మీద కూడా ప్రభావితం చూపుతాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. '10-10-10' విధానంతో మనలోని సానుకూల, ప్రతికూల దృక్పథాలు, ముందున్న అవకాశాలు.. పరిసరాలు అన్నీ సుస్పష్టంగా అవగతమవుతాయి. ఇవన్నీ మంచి వైపే నడిపిస్తాయి'' అని అంటున్న వెల్చ్ జీవితం పాత్రికేయురాలిగా ప్రారంభమైంది.
(ఈనాడు, వసుంధర, ౦౩:౦౬:౨౦౧౦)
[Suzy Welch (née Spring) (born 1959), formerly Suzy Wetlaufer, is a best-selling author, television commentator and noted business journalist. Her latest book, the New York Times best seller, 10-10-10: A Life Transforming Idea, presents a decision-making strategy for success at work and in parenting, love, and friendship.]
___________________________
Labels: Books, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home