Friday, June 16, 2017
Saturday, January 07, 2017
2137~ Motivating lined from Mahakavi Sri Sri
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
'స్నేహితుడొకడు మోసం చేశాడని,'
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
అలాగే ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని
ఆ సముద్రపు కెరటాలే
ఎగిసి ఎగిసి పడుతుంటే...
తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా
చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన
ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది
ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని
నీలో కసికసిగా ప్రవహిస్తుందే
ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి
వీల్లేదు..,
లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన
ఆ మానసిక భాదల
సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు
మొదలుపెట్టు...
నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే
బద్దకాన్ని వదిలేయ్... ,
నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే
సమాదానం వెతుక్కో... ,
నీ నీడ నిన్ను
వదిలేయకముందే వెలుగులోకి
వచ్చేయ్..,
మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే
చరిత్రను రాయగలవని
తెలుసుకో..
*చదివితే ఇవి పదాలు
మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాలు.
-SriSri
Labels: Life/telugu, Quotes/ Telugu, Self development/Telugu, Telugu literature
Monday, January 02, 2017
2126~ ఈ మెసేజ్ Save చేసుకోండి..
•దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్ చెయ్యాలన్నారు.
అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.
సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు?
జీవితమూ ఇంతే అన్నారు.
•సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.
తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు
•ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.
•తూటా కంటే శక్తివంతమైనది మాట! ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు.
•మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..
•నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
•నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని…
•స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను, భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి.
•చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు.
• కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.
•ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.
•ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.అదే తేడా…
గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు.
నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.
•స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.
Labels: Life/telugu, Management, Self development/Telugu
Thursday, May 28, 2015
Wednesday, March 11, 2015
Monday, March 09, 2015
Friday, March 06, 2015
Wednesday, January 14, 2015
1770- Management lessons from Gabbar Singh ...
Gabbar was a management guru as is reflected in some of the timeless management lessons he delivered thru the movie Sholay
Courage and enterprise are important factors for laying the successful foundation of a growth oriented business.
2. "Kitne admi the ..."
Its important to know the competition and its size ..he understood that even a small team can make a difference.
3. "Arey o sambha kitna inam rakhe hai sarkar hum par ..."
promoting one's own brand very important and to Be reiterated always.
4. "6 goli aur aadmi 3 ..."
Create an illusion where his people had a chance of survival ..he kills them in the next scene ...
moral - perform or perish.
5. "Le ab goli kha ..."
Sometimes in the interest of the organisation u have to take hard decisions .... So sometimes have to 'fire' some employees.
6. "Jab tak tere pair chalenge uski saans chalegi .."
.classic carrot and stick approach .
..tere pair ruke toh yeh bandook chalegi !!
7 . "Yeh ramgadh waale apni beti ko kaun chaki ka aata khilate hai re .."
market research is important to understand value propositions !!
Labels: Cinema/ Hindi, Life, Management, Quotes, Self development/Telugu
Tuesday, December 09, 2014
Thursday, November 27, 2014
Thursday, November 13, 2014
Monday, July 21, 2014
Sunday, July 06, 2014
1549- సర్వ ధర్మ పరాయణం (సువర్ణ , రజత , ప్లాటినం సూత్రాలు)
పరాయణం అంటే సర్వోత్తమమైన ఆశ్రయం, గమ్యం అని అర్థం. అయనం అంటే ఆధారం, ఆశ్రయం, నివాసం, ద్వారం అని అర్థాలున్నాయి. పర-అయనం అంటే ఉత్కృష్టమైన గమ్యం, ఆశ్రయం! సర్వ ధర్మాలకు పరాయణమై, సర్వ ధర్మ మార్గాల్లో అత్యుత్తమమైన మార్గం అని చెప్పే ధర్మం ఒకటి ఉంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ఇది మహాభారతం శాంతిపర్వంలో సుస్పష్టంగా కనిపిస్తుంది.
మహా భారత యుద్ధం పూర్తయిన తరవాత, భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన వసిష్ఠ శిష్యుడు, ధర్మశాస్త్ర విశారదుడు. సర్వ విద్యలకూ ఆయన ఆశ్రయం. రేపు ఉత్తరాయణం రాగానే ప్రాణత్యాగం చేయాలని ఎదురుచూస్తున్నాడు. ధర్మరాజు బంధుమిత్ర పరివార సమేతంగా తాతగారి దగ్గరకు వెళ్ళి సుదీర్ఘమైన, అత్యద్భుతమైన ధర్మచర్చలు చేస్తాడు. ఈ చర్చల సారాంశంగా భీష్ముడు ధర్మరాజుకు ఒక్క ధర్మం బోధిస్తాడు. అది బాగా లోక ప్రసిద్ధమే అయినా తరచుగా మననం చేసుకోదగిన ధర్మం.'ధర్మ సర్వస్వ నైజ స్వరూపం' కరతలామలకంగా ఒక్క మాటలో చెబుతాను, విను' అని భీష్ముడు ఈ అతి ముఖ్యమైన ధర్మాన్ని బోధిస్తాడు. ఇతరులు ఏమేమి చేస్తే తన మనసుకు కష్టంగా ఉంటుందో, తాను ఇతరులకు అవి చేయకుండా ఉండటం గొప్ప ధర్మమార్గాల్లో అన్నిటికన్నా విశిష్టమైంది. ఇది సర్వధర్మాల సంగ్రహ రూపం.
ఒక విచిత్రమేమిటంటే ఈ ధర్మం ప్రపంచంలో ఉన్న ప్రధాన మత సంప్రదాయాలు అన్నింటిలోనూ కనిపిస్తుంది. బౌద్ధ, జైన, యూదు, పార్సీ, క్రైస్తవ, మహమ్మదీయ మతాల మత గ్రంథాలన్నింటిలోనూ ఈ సూత్రం కనిపిస్తుంది. అన్ని మత సంప్రదాయాల్లో దాదాపు ఒకే రూపంలో కనిపించే ఒకే ఒక్క ధర్మసూత్రమూ ఇదే.
'ఏ వ్యవస్థలోనూ ఇతరులను నొప్పించటమనేది న్యాయమూ ధర్మమూ కాజాలదు' అన్నాడు సోక్రటీస్. అది సత్యమే కదా?
'నువ్వు ఇతరులకు ఏం చేశావో, వాళ్లు నీకు అదే చేస్తారు, సిద్ధపడు!' అని హెచ్చరిస్తాడు సెనెకా అనే వేదాంతి.
'నీకు అప్రియంగా నువ్వు భావించేదాన్ని, ఇతరుల మీద రుద్దకు' అంటాడు కన్‌ఫ్యూషియస్ అనే చైనా దేశపు విజ్ఞాని.
'నేను ఎలాంటివాడినో ఇతరులూ సరిగా అలాంటివారే. వాళ్లు ఎలాంటివారో నేనూ సరిగ్గా అలాంటివాడినే' అనే సూత్రం గౌతమ బుద్ధుడి బోధల్లో కనిపిస్తుంది. 'అవతలివాళ్లను నీతో పోల్చుకొని వారూ నీ వంటివారే అని గమనించు. చంపవద్దు, హింసించవద్దు' అంటుంది 'ధమ్మపద' అనే బౌద్ధ మత గ్రంథం.
'ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకొంటావో వాళ్లకు నువ్వూ అదే చెయ్యి' అనేది బైబిల్ బోధించే ముఖ్యమైన ధర్మ సూత్రాల్లో ఒకటి. 'నీతోటివాడిని నీలాగే ప్రేమించు!' అని బోధిస్తుంది పాత నిబంధనల పుస్తకం.
'స్వర్గానికి వెళ్లేందుకు తేలిక మార్గం ఏదైనా తనకు బోధించ'మని ఒక శిష్యుడు మహమ్మద్ ప్రవక్తను అడిగితే, 'ఇతరులు నీకు ఏం చేస్తే బాగుంటుందో, అది నువ్వు ఇతరులకు చెయ్యి, వాళ్లు నీకు చేసేవాటిలో నీకు నచ్చనివి నువ్వు వాళ్లకు చెయ్యకు!' అన్నాడట.
ఇలా అన్నీ మతాల బోధనల్లోనూ కనిపించే ధర్మసూత్రం కనుక దీన్ని 'సువర్ణ సూత్రం'(గోల్డెన్ రూల్) అన్నారు. 'ఇతరులు నీకేది చేస్తే నీకు బాగుంటుందో, అది వాళ్లకు నువ్వు చేయి' అనేది ఈ సూత్రం సకారాత్మక రూపం.
చెయ్యవలసిన విధిని చెబుతున్నది. ఇది సువర్ణ సూత్రం. భారతంలో చెప్పినట్టు, 'ఇతరులు ఏం చేస్తే నీకు అప్రియంగా ఉంటుందో, అది వాళ్లపట్ల నువ్వు చెయ్యకు' అనేది నకారాత్మక రూపం. చేయకూడని పనిని నిషేధరూపంలో చెబుతుంది. దీన్ని 'రజత సూత్రం'(సిల్వర్ రూల్) అనటం కద్దు.
ఈ సువర్ణ సూత్రంతో విభేదించే ప్రముఖులూ ఉన్నారు. జార్జి బెర్నార్డ్ షా ఇలా చమత్కరిస్తాడు- 'ఇతరులు నీకేం చేస్తే నీకు బాగుంటుందో, అది నువ్వు వాళ్లకు చెయ్యటం ఎప్పుడూ వివేకవంతమైన మార్గం కాదు సుమా! నీకు నచ్చింది వాళ్లకు నచ్చాలని ఎక్కడుంది?'
'నిరాశావాదులు, పిడివాదులు తమకున్న విలువలు, నమ్మకాలతో ఈ సూత్రాన్ని పాటించకపోతేనే ఇతరులకు మేలు. అందుకే ఈ సువర్ణ, రజత సూత్రాలకు తోడుగా 'ప్లాటినం సూత్రం' అన్న పేరుతో ఒక కొనసాగింపు ఉంది. 'నీకేది బాగుంటుదో అది ఇతరులకు చేయడం కాదు. వాళ్లకేది బాగుంటుందో చక్కగా ఆలోచించి, అది వాళ్లకు చేయి!'
________________________________
Labels: Life/telugu, Quotes/ Telugu, Religion/telugu, Self development/Telugu
Friday, July 04, 2014
Sunday, October 20, 2013
1276-ఎలుగెత్తి పిలిచే వెలుగు
ఆశించటం, అది సాధించేందుకు తపించిపోవటం, పోటీపడీ పోరు సాగించీ విజయానందం అందుకోవటం... జీవితం! ఆ ఆరాటంలో, పోరాటంలో ఉన్న సాధనాలన్నీ వినియోగించి, అన్ని సాయుధబలగాల్నీ మోహరించి వడివడిగా ముందుకు సాగే మనిషికి నాళం కృష్ణారావు కవి దర్శించిన 'పట్టుదల బూని చేయుమా పనులనెల్ల/ కాలమే సమకూర్పగలదు ఫలము' అన్నదే అనుభవానికొస్తుంది. పరిశీలన, అనుశీలన కలగలిసిన వ్యూహరచనతో ఇతర గుణగణాలూ జతకడితే, విజయాలు పరంపరగా సిద్ధించి మానవుణ్ని మాననీయుణ్ని చేస్తాయి. ఏనుగు లక్ష్మణకవి విపులీకరించిన 'ఆపదలందు ధైర్యగుణ, మంచిత సంపదలందు దాల్మియున్/ భూ సభాంతరాళమున బుష్కల వాక్చతురత్వ, మాజి బా/హా పటుశక్తియున్, యశమునం దనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధి' ప్రకృతిసిద్ధ లక్షణాలే కాక మానవాళి పాలిట ఆయుధాలూ సాధనాలూ. రాజనందనుడైన సిద్ధార్థుడు నాడు శ్రుతులు, స్మృతులు, సంహితలతో పాటు నిఖిల శాస్త్రాల పాండిత్యాన్ని గడించాడు. అఖిల అస్త్రశస్త్ర రహస్యాలు, తంత్రవాదనల సారాంశాలు, యంత్రవాదాల లోలోని మర్మాలూ గ్రహించి సర్వజ్ఞుడయ్యాడు. 'ఉపాయపూర్వకమగు విపులయత్నము సర్వార్థ సాధకము' అన్నట్లు బాణ ప్రయోగ కళాదక్షుడిగా, ఖడ్గచాలనాది విద్యాపారీణుడిగా వీరాధివీరత్వాన్నీ సొంతంచేసుకున్నాడు. అటుతరవాత భోగభాగ్యాల్ని వదిలి, భార్యాబిడ్డల్నీ వీడి శాశ్వత జ్ఞానసాధన దిశగా తరలివెళ్లిన అతడి మేధోసంబంధ ఆయుధం- తత్వచింతనే!
పూర్వాపరాల ఆలోచన, ప్రత్యేకమైన అభిరుచి, అవిశ్రాంత కృషి కారణంగానే ఫలితం ప్రాప్తిస్తుంది. 'ధనమునకు దానమును, తప/మున కాచారమును, రాజ్యమున కాజ్ఞయు, జీ/వనమునకు యశము, విద్యకు/వినయంబును, నీతులకు వివేకము ఫలముల్' అని పలికిన సుభాషితకర్త అంతరార్థమూ సాధనాల ప్రాధాన్యమే. దానవులతో కలిసి క్షీరసాగర మథనం చేసిన దేవతలు భయాలకు లొంగలేదు, ప్రలోభాలకు దాసులు కాలేదు. అమృతభాండం లభించేవరకూ ప్రయత్నం మానలేదు. కనుకనే కృతనిశ్చయం వదలని నిపుణమతులయ్యారు. నగములు కంపించేలా గగనానికెగసి ప్రత్యర్థుల్ని భయకంపితుల్ని చేసిన గరుత్మంతుడిది రెక్కల బలం. యమధర్మరాజును వెంటాడి, పతి ప్రాణాల్ని తిరిగి దక్కించుకొన్న సావిత్రిది అపార ధైర్యం. 'ధర్మదేవతా, సూర్యచంద్రాదులార/ పంచభూతమ్ములార, దిక్పాలులార/ నన్ను రక్షింపరే నాథునకు వచించి' అంటూ నిండుసభలో సత్యపోరాటం సాగించి గెలిచిన శకుంతలది నిరుపమాన సాహసం. తనయుడు అర్జునుణ్ని ద్వాపరంలో ఆయుధంగా, సాధనంగా మలచింది తల్లి కుంతీదేవి. 'పరమశివుణ్ని ఆరాధించి పాశుపతం సంపాదించు, కదనభూమిలో విజృంభించి విరోధుల్ని నిరోధించు' అని ఆశీర్వదించి పంపింది. 'వెలుగు నిన్ను ఎలుగెత్తి పిలుస్తుంది, చీకటి నీకు దూరంగా నిలుస్తుంది' అంటూ త్రేతాయుగంలో కుమారుడు హనుమను దీవించి జాగృతపరచింది అంజన. 'నీ మాతను వీరమాతను చేయి, నీ జాతికి నవజీవం పోయి' అని కృతయుగంలో ప్రబోధించి బిడ్డను కార్యనిర్వహణ దీక్షాదక్షుణ్ని చేసింది వినత. కర్తవ్యాన్ని విస్మరించి కురుక్షేత్రంలో చేష్టలుడిగి కూర్చున్న ప్రియతముణ్ని 'లెమ్ము ధనుంజయా! విధి బలీయము, న్యాయము గెల్చు, నిల్చు స/త్యమ్ము, నశించు స్వార్థము, సదా యుగధర్మమిదే గదోయి' అని తట్టిలేపిన కృష్ణపరమాత్ముడిదీ కార్యసాధన తత్వమే. 'అంగత్రాణ కృపాణ బాణధరులై యంగమ్ము లుప్పొంగ, దు/స్సంగ స్వార్థ మదేభ కుంభములపై సంగ్రామ రంగమ్మునన్/ సింగమ్ముల్ వలె దూకి' పాండవవీరులు విజృంభించటానికి ఆ చైతన్య సమరభేరే కారణం. సకల శుభాలు, విజయ పరంపరలు ప్రసాదించే దుర్గమ్మ హస్తాలనిండా ఆయుధాలే కనిపిస్తాయి. సదాశయానికి వినియోగించే ప్రతి సాధనమూ ఆయుధమే. అక్షరం, ఆత్మవిశ్వాసం, గుండెబలం, విద్య, వినమ్రత, సమయస్ఫూర్తి... అన్నీ ఆయుధాలే, సాధనాలే. అందుకే 'బలిమి జేయరాని పని యెట్టిదైన/ ఉపాయబలము చేత జేయవచ్చు' అన్నారు 'చిత్రభారతం' కర్త.
సాహసం పథమైనప్పుడు, పట్టుదల ప్రధానమై పౌరుషమే ఆయుధంగా మారుతుంది. 'పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు/ పట్టెనేని బిగియ పట్టవలయు' అని హితవుచెప్పిన వేమన 'పట్టరాని పట్టు పట్టియుండినవాడు/ పుడమిలోన కీర్తి పొందలేడు' అంటూ హెచ్చరికా చేశాడు. ఆయుధ ప్రయోగానికైనా, సాధనాల వినియోగానికైనా పట్టువిడుపులు ఉండాలన్నది మానవ జీవన మంతటా నిండాల్సిన అంతస్సూత్రం. జ్ఞానసాధనమైన మెదడుతో పురోగమిస్తున్న విశ్వం 'శ్రమయేవ జయతే' సిద్ధాంతాన్నీ విశ్వసిస్తోంది. విశ్లేషించి చూస్తే, సంజీవదేవ్ అన్నట్లు 'తెలివిలేని శ్రమ కానీ శ్రమలేని తెలివికానీ అంతగా ఉపయోగపడవు. తెలివి, శ్రమ... రెండూ కలిసినప్పుడే ఏ పనిలోనైనా సఫలత'. కార్యసాఫల్యానికి కావాల్సింది సమాచరణ. వెనుక కాచుకుంటూ, ముందు చూసుకుంటూ సజావుగా పని సాగించటంలోనే జీవిత పరమార్థముంది. జగజ్జనని దుర్గను విజయదశమి అరుణోదయ వేళలో ఆరాధించిన జిజియా- బాలశివాజీకి చేసిన ఉద్బోధా అదే. మహాకాళి మృగేంద్ర వాహనమెక్కి కదిలి దనుజ మర్దన జరిపిన మహత్తర దినమే దశమి. 'పంచతంత్రం' కర్త తేల్చిచెప్పినట్లు 'లోకంలో సమర్థులకు అసాధ్యమన్నదే ఉండదు'. పనినే ఆయుధం, సాధనం చేసుకొని ప్రతివ్యక్తీ కదిలినప్పుడు ఆశాజ్యోతి జ్వలిస్తుంది, సాధన నిలుస్తుంది, తపస్సు ఫలిస్తుంది !
(ఈనాడు ,13:10:2013)
____________________
Labels: Life/telugu, Religion/personality/telugu, Self development/Telugu, Telugu/ culture
Friday, June 28, 2013
1229 - నవ్వు అరవై విధాల మేలు
హాసాన్ని ఈశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. 'కారము వాడి చూపులగు, నాకారము శ్వేతచంద్రికగు, సం/స్కారము మందహాసములు, ప్రా/కారము ప్రేమ సన్నిధి గదా!' ఆదిదేవుని ఈ సంస్తుతే ఇందుకొక అందమైన ఉదాహరణ. రావణ వధ అనంతరం అయోధ్యలో ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. సభ పరమ గంభీరంగా ఉంది. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి కిలకిలల నవ్వు! ఎవరికి వారు ఆ నవ్వుకు తమకు తోచిన భాష్యం చెప్పుకోవడం తదనంతర కథా పరిణామం. నవ్వును నిర్వచించటం, సృష్టించిన విధాత మేధకైనా మించిన పని అని చెప్పటమే ఈ కథ ఆంతర్యం. ఆంధ్ర భాగవతం నరకాసుర వధ ఘట్టంలో 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటారు పోతన. భామ మందహాసం అదే. హరిని అరిని ఆ నారి చూసే తీరులోనే భేదం అంతా. గిరిజాసుతుడి రూపాన్ని పాపం చవితి చంద్రుడు ఏ భావంతో తేరిపార చూశాడో... నిందల పాలయ్యాడు. హాసానికి, పరిహాసానికి మధ్య పలుచని మేలి తెర మూలకంగానే భారతంలోనూ సాధ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాల పాలైంది. 'నవ్వకుమీ సభ లోపల/ నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/ నవ్వకుమీ పరసతితో/ నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అని హాసపరిమితుల మీద మనకొక శతక పద్యమూ ఉంది. 'కారణము లేక నవ్వును... ప్రేరణమును లేని ప్రేమ... వృథరా!' అని శతకకారుడు ఏ కారణంతో అన్నాడో కాని- వాస్తవానికి 'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు' అంటున్నాయి నవీనశాస్త్ర పరిశోధనలు.
'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని పాతకాలం మాట. శృంగారాది రసాల సరసన పీట వేసి హాస్యానికి ఉత్తమ గౌరవమిచ్చారు ఆలంకారికులు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్భోచితంగా సంభాషణలు సాగించినా, అసందర్భంగా సంభాషణల మధ్య తలదూర్చినా, శబ్దాలు విరిచినా, పదాలు అడ్డదిడ్డంగా కూర్చినా, చేష్టలు వికృతంగా అనుకరించినా, అకటా వికటంగా ప్రవర్తించినా... ఇంకా సవాలక్ష ఏవో వంకర టింకర విన్యాసాలు ప్రదర్శించైనా, మందహాసం నుంచి అట్టహాసం దాకా రకరకాల స్థాయీభేదాలతో నవ్వులను రాబట్టవచ్చు. తిక్కన సోమయాజి భారతంలో- పిన్న నవ్వు, చిరు నవ్వు, అల్లన నవ్వు, అలతి నవ్వు, మందస్మితం, హర్ష మందస్మితం, ఉద్గత మందస్మితం, జనిత మందస్మితం, అనాద మందస్మితం అని చిన్న నవ్వులు తొమ్మిది. కలకల నవ్వు, పెలుచ నవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటూ పెద్ద నవ్వులు మూడు. కన్నుల నవ్వు, కన్నుల నిప్పురాలు నవ్వు, ఎలనవ్వు, కినుక మునుంగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు, కటిక నవ్వు, కినుక నవ్వు అని మిగతా మరో ఎనిమిది... మొత్తం ఇరవై రకాల నవ్వులతో వివిధ పాత్రల రసపోషణ రసప్లావితంగా చేసి 'ఓహో' అనిపించారు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభోగాల గురించి కాళిదాసు మొదలు దేవరాయల వరకు, శ్రీనాథుడు లగాయతు చిన్నయసూరి దాకా అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ కోకొల్లలు. ఆ సాహిత్యం సమస్తాన్ని రామాయణ, భారత, భాగవతాదులకన్నా మిన్నగా శతసహస్రాధికమైన శ్రద్ధాసక్తులతో మనం పారాయణ చేశాం. 'ప్రపంచ నవ్వుల దినం' (మే మాసపు మొదటి ఆదివారం) ప్రత్యేకత అంతా... సుమతీ శతక కర్త చెప్పిన ఆ 'కారణం లేని నవ్వు' మహత్తుపై మరింత సదవగాహన పెంచుకోవడమే!
ఉరుకుల పరుగుల జీవితాలు, ముంచుకొచ్చిన మీదట కానీ తెలిసిరాని నివారణ లేని పెనురోగాలు... ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్న వైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధులకు ఎన్నో అధ్యయనాలు, మరెన్నో పరిష్కారాలు. అందరికీ అందే ద్రాక్షపళ్లేనా అవి? వీలున్నంత దాకా మందుల జోక్యం లేకుండా జీవనశైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతోంది క్రమంగా. నవ్వు నాలుగు విధాల చేటన్న మాట సరి కాదు సరికదా- ఆరోగ్యానికి అరవై రకాల మేలు. చాలా అధ్యయనాల్లో ఉల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం, సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగ గురువు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించిన హాస చికిత్సా విధానం నవ్వుల దినోత్సవ నేపథ్యం. ఎలాంటి కారణం లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు... ఉద్రిక్తతల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి కలుగుతాయి. నవ్వు రక్తవాహికలను విశాలం చేస్తుంది. ఒత్తిడి కారక హార్మోన్ల ఉత్పత్తి మందగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకొంటుంది. వందలాది లాభాల్లో ఇవి కొన్నే. నిస్పృహకు, నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తి నవ్వు పది నిమిషాల వ్యాయామ లాభానికి సమానం. ముఖ సౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక సాధనం. సూదంటు రాయిలాగా మంచివారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానిదే. కారణాలు అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపక నవ్వగలగడం... ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను వెలిగించుకోగలగడం (మే మాసపు మొదటి ఆదివారం)హాస దినోత్సవ సంబరాల వెనకున్న స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తిమంతమైన మంత్రం మన పెదాల మీద ఉంది. అదే నవ్వుల క్లబ్ హాస నినాదం... హా...హా...హా!
(ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)
________________________________________
Labels: Events, HEALTH, Humour/ Telugu, Life, Self development/Telugu
1227 - దాన బ్రహ్మ

లోకంలో అన్నింటికంటే సముదాత్తం, ఉత్తమోత్తమం మానవ జీవితమే. దాన దయాగుణాల కారణంగానే దానికి సార్థకత, ధన్యత. 'ఫలములనిచ్చును వృక్షము/ సలిలములిచ్చును నదులును చక్కగ నెపుడున్/ ఫలితము కోరక జనులకు/ కలకాలము మేలొనర్తురు గద సాధుజనుల్' అన్న సంప్రదాయ కవి మనోగతమూ అదే. తోటివారికి సూర్యచంద్రుల్లా కళాకాంతీ ప్రసాదించే మనిషే మనిషని రుగ్వేదమంటే, దానమే సకల గుణసంపన్నమన్నాయి ఉపనిషత్తులు. అభయదానం ఆదర్శప్రాయమని భగవద్గీత బోధిస్తే, దానం చేయాలన్న సద్బుద్ధే అన్నివిధాలా వృద్ధిదాయకమంది మహాభారతం. తాళ్లపాక తిమ్మక్క చెప్పినట్టు 'ధర్మమేదియు ప్రాణదానముతోను తులతూగదు'. కవి తిమ్మయ చాటినట్టు 'ప్రాణదానము సేయ బహు పుణ్యమిచ్చు'. మహా ఫలప్రదానంగా తిక్కన, సర్వ ప్రీతికరంగా నన్నయ ప్రస్తుతించిన దానశక్తికి ప్రతీకలుగా ఎందరు లేరు? అన్న, ధన, విద్య, వస్త్ర, భూదానాదులు అనేకమున్నా- పరహితమే పరమార్థ సాధనకు పునాది అని భావించి చేసే అవయవ దానాలే అమృత గుళికలు. ప్రతి మనిషీ తన కోసమేకాక ఇతరుల మేలు కోసమూ తపిస్తే, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలన్న ఆర్తికి క్రియారూపమిస్తే, సినారె అన్నట్టు- 'అవధి లేని అనుభూతి' అది. కళ్లు, గుండె భాగాలు, మూత్రపిండాలు, వూపిరితిత్తులు, కాలేయం... శరీరంలోని ఏ భాగాన్నయినా తన మరణానంతరం ఇతర అవసరార్థులకు ఇవ్వాలన్న సంకల్పమే మనిషి జన్మకు అమరత్వ సిద్ధినిస్తుంది. మృతశరీర అవయవాల మార్పిడి అంటే మరొకరికి ప్రాణంపోయడం. మనిషే అద్భుత సృష్టి అనుకుంటే, ప్రతిసృష్టికీ ఆ వ్యక్తే మూలం కావడం ఎంత ఘనాఘనం! లయానంతరం ఆ ప్రాణి మరో ప్రాణికి ప్రాణమివ్వడం ఎంతెంత పరమాద్భుత దానం! శిబి, బలి, దధీచి, కర్ణుడు, రంతిదేవుడు వంటి ధర్మనిరతులు, దానశీలురు, యశోధనులు పుట్టిన భరతసీమ మనది. సాటిలేని ఆ సత్యసంధత తరతరాలకీ చెదరనిది, దీటురాని ఆ భారతీయత సకల మానవాళికీ పరంపరానుగత వరసిద్ధి. కవి స్వరం పలికినట్టు 'నిరంతర సౌరభాలొలికే గులాబీపువ్వు' దాత జీవనం. 'రమణీయ ఫాలసీమ భాసిల్లే లేతనవ్వు' ఆ భావనం.
ఎంత నిండుగా పారే ఏరైనా, తన నీటిని తానే తాగదు. ముందు వెనకా చుట్టుపక్కలా ఉన్న అన్నింటినీ చూసే కన్ను, తన ఉనికిని తాను చూడదు.ఆ తీరులోనే, ఇతరులు హాయిగా బతకాలన్న ఆర్ద్రత కలిగిన మనిషి 'నేనూ- నాదీ' అన్న స్వార్థధోరణితో ముడుచుకుపోయి బతకలేడు. లోకాన ఎవరికైనా జననం, మరణం, గమనం, గమ్యం ఒకటే. ఆకులు రాలిన చోట కొత్తచిగురును కోరే మది మాత్రమే నరసింహకవి వాక్కులా 'ఉన్న వనరులన్ని ఉపయోగముననున్న/ చిత్తశుద్ధి పనులు చేయుచున్న/వెనుకనున్న ఘనత కునుకు తీయకయున్న/ ప్రగతి కురియు హర్షవర్షమట్లు' స్థితిని సొంతం చేసుకుంటుంది. ఆపద్బంధువులా ఆదుకునేందుకు ముందుకొచ్చిన మంచి మనసును చూసి చెమ్మగిల్లని కళ్లుంటాయా? ప్రార్థించే పెదవులకన్నా సేవచేసే చేతులు ఎంత మిన్నో గ్రహించిన ఆ కృతజ్ఞతకు నోట మాటలంటూ వస్తాయా?
అవయవాల దానం మరికొన్ని జీవితాల్ని వెలుగులమయం చేసిన సందర్భాలకు ఈమధ్య భాగ్యనగరమే వేదికగా భాసించింది. వైద్యశాలలో మృత్యుముఖాన ఉన్న ఒక వ్యక్తినుంచి అవయవాల్ని జీవనదానమిచ్చేందుకు ముందుకొచ్చారా కుటుంబీకులు. ఫలితంగా అతడి మరణం తదుపరి, ఏడుగురికి ప్రాణప్రదానం సంభవమైంది. మరో వ్యక్తీ అదే స్థితిలో మరణించి, తన అనంతరం ఐదుగురికి జీవితాన్ని పంచారు. అదంతా 'స్వస్థ సమాజ' సాధన దిశగా మానవత సగర్వంగా ఎగరేసిన నవ పతాక. మానవుల పరిపూర్ణ వికాసానికి కీలకం ఆరోగ్యమంది చరక సంహిత. అన్ని సంపదలకీ తలమానికం ఆరోగ్యభాగ్యమేనని చాటిచెప్పింది బుద్ధచరిత. ఆ వైభవమంతటినీ లేనివారికి పంచిపెట్టే 'దానబ్రహ్మ' మనిషే కావడం అనంత మాననీయం, అత్యంత మహనీయం.
(ఈనాడు , సంపాదకీయం ,07:04:2013)
____________________________________
Labels: HEALTH, Knowledge, Life/telugu, Science, Self development/Telugu, Technology





























