వీరి వీరి గుమ్మడి పండు.........
కమల్‌హాసన్ అసలు పేరు పార్థసారధి అని ఈ మధ్యే తెలిసింది. అందరికీ ఆయన కమల్ అయినా... అమ్మకు మాత్రం పార్థూనే. కొడుకుని ఆమె కమల్‌హాసన్ అని ఎప్పుడూ పిలవలేదు. మోహన్‌బాబుని ఇప్పటికీ 'భక్తా' అని పాత పేరుతోనే పిలిచే సన్నిహితులున్నారు. తమిళ హీరో విక్రమ్ అసలు పేరు జాన్ కెనడీ. ముద్దుగా కెన్నీ అంటారు. టీచర్లు, క్లాస్‌మేట్స్ ఇప్పటికీ ఆ పేరుతోనే పిలుస్తారు. ఇక జగపతిబాబు అసలు పేరు జగపతి చౌదరి. మిత్రులు చౌ, చౌదరి అనే అంటారు. ఇక కృష్ణభగవాన్ పేరు... పాపారావు చౌదరి. ముద్దు పేరు కిట్టబాబు. ఆయన్ని కిట్టబాబు అనే మిత్రులు చాలామంది ఉన్నారు. ఇక - డానియల్ రాజయ్య అంటే 'ఆయనెవరు?' అని మనం అనేస్తాం. అది ఇళయరాజా సొంత పేరు. గోపాలరత్నం సుబ్రహ్మణ్య అయ్యర్... అని ఇంత పేరు పలకలేక మణిరత్నం అని మార్చుకొన్నారు. తమిళ కథానాయకులు సూర్య, విక్రమ్, ధనుష్‌ల పేర్లు కూడా అసలు కావు. సినిమాల్లోకి వచ్చాక మార్చుకొన్నవే. మన హీరోలు రవితేజ, సునీల్, నాని... వీళ్లూ ఆ జాబితాలో ఉన్నారు. కథానాయికల విషయానికొస్తే చాలామందివి కొసరు పేర్లే.
మురళి మోహన్ (మాగంటి రాజబాబు ), గిరిబాబు (ఎర్రా శేషారావు), స్నేహ (సుహాసిని), నయనతార (డయానా మరియం కురియన్), భారతీరాజా (చిన్న స్వామి ), చంద్ర సిద్ధార్థ్ ( చిట్టాబత చంద్రశేఖర్)
Labels: Cinema
0 Comments:
Post a Comment
<< Home