1345- 'మెరిటోక్రసీ '- నీ చిరునామా ఎక్కడ?
...సత్య నాదెళ్ళను మైక్రోసాఫ్ట్ సీ.ఈ.ఓ.గా నియమిస్తున్న తరుణంలోనే అమెరికా ఆధ్యక్షుడు ఒబామా మరో ప్రవాస భారతీయుడు డా|| మూర్తిని అమెరికా చీఫ్ సర్జన్ గా నియమించారు.
డా|| మూర్తి వయసు కేవలం 36 సంవత్సరాలు. అమెరికాలో అత్యంత ఉన్నత స్థానం, వైద్యరంగంలో సాధించారు, కర్ణాటకాకు చెందిన డా|| మూర్తి.
అమెరికాని మనం ఎన్నో రకాలుగ విమర్శించినా వారు అనుసరించే 'మెరిటోక్రసీ ' విధానాన్ని మాత్రం మనం అభినందించాల్సిందే.
విదేశాలలో ఇటువంటి విజయ గాధలు మనం మున్ముందు అనేకం వినబోతున్నాం. వారి మెరిట్ ని ఉపయోగించలేకపోయినందుకు భారతదేశం సిగ్గుపడాలా! లేక ఎక్కడో ఒకచోట తమ మెరిట్ కి గుర్తింపు తెచ్చుకున్నందుకు అభినందించాలా?
(డా|| దుగ్గరాజు శ్రీనివాస రావు, స్వాతి వార పత్రిక)
_____________________________
Labels: computers, Education, Events, India, Knowledge, Life, Self development
0 Comments:
Post a Comment
<< Home