ప్రసిద్ధ తెలుగు నవలాకారుల కొన్ని సుప్రసిద్ధ రచనలు
[ఆచార్య కె.సర్వోత్తమ రావు "వాఙ్మయదర్శిని”, డాక్టర్ ద్వా. నా. శాస్త్రి గారి "తెలుగు వెలుగు” ల నుండి.]
నవల, వైవిధ్యానికి వైశిష్ట్యానికి చిహ్నంగా నిలిచే సాహితీ ప్రక్రియ. ఇది ఆంగ్ల భాషా ప్రభావం వల్ల బాగా వ్యాప్తికి వచ్చిన ప్రక్రియ. దీనిని ఆంగ్లంలొ “నావల్”, కన్నడంలో “కాదంబరి”, హిందీలో “ఉపన్యాస్” అంటారు. ఆదిలో నవలను- నవీన ప్రబంధం (నరహరి గోపాల కృష్ణమ సెట్టి), వచన ప్రబంధం (కందుకూరి) అన్నారు.. గవర్నర్ జెనెరల్-లార్డ్ మేయో ప్రకటన మేరకు నరహరి గోపాల కృష్ణమ సెట్టి రాసిన శ్రీ రంగరాజ చరిత్ర (సోనాబాయి పరిణయం) తెలుగులో మొదటి నవల (1872). ఈ నవల అంతగా వ్యాప్తిలోకి రాలేదు. కానీ కందుకూరి వీరేశలింగం పంతులు రచన రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక)కు బాగా ప్రాచుర్యం లభించింది (1878). ఈ ప్రక్రియకు “నవల" అని నామకరణం చేసినవారు కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి.
నవలా ప్రక్రియ- ఛారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, నైతిక, తాత్త్విక అంశాల్ని, జీవితకోణాలన్నిటినీ చిత్రించగల విశిష్ట సాహితీ ప్రక్రియ. నవలలో కథ ఉంటుంది;నాటక, కవితా లక్షణాలూ ఉంటాయి. నవల సమకాలీన జీవితానికి ప్రతిబింబం. జీవితానుభవాల్ని వివరంగా చర్చించి పాఠకులకి జీవితంపై ఒక దౄక్పథాన్ని కలిగిస్తుంది నవల.
అందుకే –
“Novel is a pocket theatre.”
“It is the only out let to a large experience.”
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - -
తొలి…..
తొలి సాంఘిక నవల- కందుకూరి వీరేశలింగం పంతులు రచన -“రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక)”
తొలి హాస్య నవల- చిలకమర్తి లక్ష్మీనరసిహంవారి:-“గణపతి”
తొలి అనువాద నవల- కొక్కొండ వేంకటరత్నం పంతులుగారి-“మహాశ్స్వేత”
తొలి చారిత్రక నవల- చిలకమర్తి లక్ష్మీనరసిహం:గారి – “హేమలత”
తొలి డిటెక్టివ్ నవల- దేవరాజు వెంకటకృష్ణారావుగారి- “వాడే వేఏడు”
తొలి మాండలిక నవల- దాశరధి రంగాచార్య గారి-చిల్లరదేవుళ్ళు,
తొలి నవలా రచయిత్రి- సుదక్షిణాపరిణయం రాసిన జయంతి సూరమ్మ:
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
తెలుగు నవలాకారుల కొన్ని రచనలు
అట్లూరి హజరా:
-జీవన మలుపులు
అడివి బాపిరాజు:
-నారాయణ రావు, కోనంగి, గోనగన్నారెడ్డి, హిమబిందు, నరుడు, నా పడమటి ప్రయాణం, జాజిమల్లి, అడవి శాంతిశ్రీ
అరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి:
-చక్రభ్రమణం, చక్రవాకం, చక్రనేమి, ప్రేమనగర్, ధర్మచక్రం, సంసార చక్రం
ఆదివిష్ణు:
రాక్షసీ, నీ పేరు రాజకీయమా?
అర్.యస్. సుదర్శనం:
-అనుబంధాలు, అసురసంధ్య, మళ్ళీవసంతం, సంసారవృక్షం
ఆర్. వసుంధరా దేవి:
-రెడ్డమ్మ గుండు
ఆలేటి నాగమణి:
పుత్లి
ఇచ్చాపురపు జగన్నాథ రావు:
-సుఖమూ- సుందరీ
ఇల్లిందల సరస్వతీ దేవి:
-జీవిత వలయాలు, పెళ్ళికూతుళ్ళు
ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు:
-మాలపల్లి (సంగవిజయం), తిక్కన, నాయకురాలు
ఉప్పల లక్ష్మణ రావు:
-అతదు-ఆమె, దిటవు గుండెలు, తొలి ఉపాధ్యాయుడు, తల్లిభూదేవి, బతుకు పుస్తకం
ఎ.వి.నరసిహం:
-పాతాళ భైరవి
ఎన్.భారతీదేవి:
-ఇది ప్రేమంటారా? ఇది పిచ్చంటారా?
ఎన్.ఆర్.నంది:
-నైమిశారణ్యం, దృష్టి
ఓల్గా:
-స్వేచ్ఛ, ఆకాశంలోసగం, సహజ, మానవి, కన్నీటికెరటాల వెన్నెల, ప్రయోగం
కందుకూరి వీరేశలింగం పంతులు:
రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక), సత్యవతీ చరిత్రము, సత్యారాజా పూర్వ దేశయాత్ర
కాకర్ల వెంకట నరసింహం:
-రఘునాథారాయలు, కనకాభిషేకం
కప్పగంతుల మల్లికార్జునరావు:
ది నీడిల్
కురుమద్దాలి విజయలక్ష్మి:
ఆటవెలది
కె.ఎన్.వైపతంజలి:
-ఖాకీవనం, గోపాత్రుడు
కె. రామలక్ష్మి:
-కరుణకధ, కొత్తపొద్దు, ప్రేమించు ప్రేమకై, నన్ను వెళ్ళిపోనీరా, రావుడు, ఆశకు సంకెళ్ళు, కోరిక తీరిన వేళ
కేతవరపు వెంకట శాస్త్రి:
-లక్ష్మీప్రసాదం, ఆనందబాయి, అగ్రహారం, మదాలస, రాయచూరు ముట్టడి, రాయచూరు కేథు విశ్వనాథ రెడ్డి
-వేళ్ళు, బోధి
కేశవరెడ్డి:
-శ్మశానం దున్నేరు, సిటీ బ్యూటిఫుల్, అతడు అడివిని జయించాడు, ఇంక్రెడిబుల్ గాడెస్, మూగవాని పిల్లనగ్రోవి
కొండముది శ్రీరామచంద్రమూర్తి:
-తలుపు తెరవకండి, కలియుగ స్త్రీ, యజ్ఞ సమిధలు
కొక్కొండ వేంకటరత్నం పంతులు:
-మహాశ్స్వేత
కొడవటిగంటి కుటుంబరావు (http://kodavatiganti.iwarp.com) :
-చదువు, తార, కురూపి, లేచిపోయిన మనిషి, ఇప్పుడు వీస్తున్న గాలి, కులంలేని పిల్ల, ప్రేమించిన మనిషి, కొత్త కోడలు, కొత్త అల్లుడు, పంచకల్యాణి, అనుభవం, మారుపేర్లు, ఆడజన్మ
కొమ్మనాపల్లి గణపతిరావు:
-అసురవేదం, శిలాశాసనం, ది జద్జిమెంట్, మృత్యుంజయుడు, హంసగీతం, ఆసావేరి, రోషనారి, నాని, పడిలేచే కడలి తరంగం, నిశాంత సంగ్రామం, ది రైటర్
కొమ్మూరి వేణుగోపాలరావు:
-పెంకుటిల్లు, అర్దచంద్ర, న్యాయానికి అటూ-ఇటూ, శారద, గోరింటాకు, హౌస్ సర్జన్, కదిలే మేఘం, జాలిలేని జాబిలి, కాపాడే కత్తి
కొర్లపాటి శ్రీరామ మూర్తి:
-చిత్రశాల, చెంఘిజ్ ఖాన్
కొలిపాక రమామణి:
-వెన్నెలలో పిల్లనగ్రోవి, గడ్డిపోచలు
ఖండవల్లి రామచంద్రుడు:
లక్ష్మీ సుందర విజయం, ధర్మవతీ విలాసం
గంటి వెంకటరమణ:
గెలుపు, విడిన మబ్బులు
గిరిజశ్రీ భగవాన్:
సాహసం సేయరా డింభకా
గుడిపాటి వెంకటచలం:
-మైదానం, జీవితాదర్శం, శశిరేఖ, అరుణ, అమీనా, దైవమిచ్చిన భార్య, వివాహం, బ్రాహ్మణీకం, సావిత్రి, మా కర్మమిట్లా కాలింది, కన్నీటి కాలువ
గొల్లపూడి మారుతీ రావు:
చీకటిలో చీలికలు, వెన్నెల కాటేసింది
గోపీచంద్:
-పరివర్తన0, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు, మాకూ స్వగతాలు వున్నాయి, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, యమపాశం, గడియ పడని తలపులు
చల్లాసుబ్రహ్మణ్యం:
-నక్షత్ర సమరం, అరణ్య నేత్రం, వసంత రాత్రి, పవిత్రపాపి, ఓ అమ్మాయి కథ, విధాత, టెలిఫోన్ టెలిఫోన్
చాగంటి తులసి:
యాత్ర
చిట్టిబాబు:
-అన్నమాంబిక
చిలకమర్తి లక్ష్మీనరసిహం:
-గణపతి, రామచంద్రవిజయం, హేమలత, అహల్యాబాయి, కర్పూర మంజరి
చివుకుల పిచ్చయ్య శాస్త్రి:
పద్మిని
చివుకుల పురుషోత్తం:
- రెండో పురుషార్థం, మూడో పురుషార్ధం,నాలుగో పురుషార్థం, ఏది పాపం, సావిత్రి, జీవన స్వప్నం
చెరబండ రాజు:
ప్రస్థానం
జయంతి సూరమ్మ:
సుదక్షిణాపరిణయం
జాతశ్రీ:
-సింగరేణి మండుతోంది, బలి పశువు
జి.వి. కృష్ణారావు:
-పాపికొండలు, కీలుబొమ్మలు
జొన్నలగడ్డ లలితాదేవి:
-అనంగరేఖ
డాక్టర్ శ్రీదేవి:
-కాలాతీతవ్యక్తులు
తాళ్ళూరి నాగేశ్వరరావు:
-కొత్త ఇల్లు
తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు:
-ధర్మ నిర్ణయం, తిక్కన సోమయాజి
తురగా జానకీరాణి:
-కొడిగట్టిన దీపాలు
దాశరధి రంగాచార్య:
-చిల్లరదేవుళ్ళు, జనపదం, మోదుగపూలు, సీతాచరితం
ద్వివేదుల విశాలాక్షి:
-గోమతి, వారధి, గ్రహణం విడిచింది
దేశ్ పాండే:
-అడవి
ధూళిపాళ శ్రీరామమూర్తి:
-భువన విజయం
దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి:
-విజయనగర సామ్రాజ్యం
నండూరి పార్థసారథి:
-కార్ఖానాఖ్యం
నరహరి గోపాల కృష్ణమ సెట్టి:
శ్రీ రంగరాజ చరిత్ర (సోనాబాయి పరిణయం)
నవీన్:
-చీకటి రోజులు, ముళ్ళపొదలు, అంపశయ్య, కాలరేఖలు
నామిని సుబ్రమణ్యం నాయుడు:
-ముని కన్నడి సేద్యం, పాలపొదుగు, పచ్చ నాకు సాక్షిగా
నేలటూరి వెంకటరమణయ్య:
మథుమావతి, చత్రగ్రాహి
నోరి నరసింహ శాస్త్రి:
-రుద్రమదేవి, మల్లారెడ్డి, ధూర్జటి, నారాయణభట్టు, కవిద్యయము, కవి సార్వభౌముడు
పమ్మి వీరభద్రరావు:
-కాల్తున్న మనుషులు
పరిమళా సోమేస్వర్:
-అంతరంగ తరంగాలు
పసుపులేటి మల్లికార్జునరావు:
-పక్షులు
ప్రయాగ రామకృష్ణ:
-మౌన రాగాలు, ద్రౌపది
పాలగుమ్మి పద్మరాజు:
-బతికిన కాలేజి, రమరాజ్యానికి రహదారి, నల్లరేగడి
పి.సత్యవతి:
-అయిదురెట్లు, చేదు నిజాలు, రవిచంద్ర
పినిసెట్టి:
-దత్తత
పిలకా గణపతి శాస్త్రి:
-విశాల నేత్రాలు, నాకబలి, మినువాక, మీనాంబిక
పెళ్ళకూరు జయప్రద:
-ప్రియ బంధవి
పురాణం సుబ్రహ్మణ్య శర్మ:
చంద్రునికో నూలు పోగు, జేబులో బొమ్మ
పురాణం సూర్యప్రకాశ రావు:
-జీవన గంగ, మారే మనుషులు
పులుగుర్తి లక్ష్మీనరసమాంబ:
-సుభద్ర, యోగేశ్వరి, అన్నపూర్ణ
పోల్కంపల్లి శాంతాదేవి:
-అగ్ని కెరటాలు
పోరంకి దక్షినా మూర్తి:
-ముత్యాల పందిరి, వెలుగు వెన్నల గోఒదారి
పోతుకూచి సాంబసివరావు:
-ఉదయ కిరణాలు
బలివాడ కాంతా రావు:
-గోదమీది బొమ్మ, దగాపడిన తమ్ముడు, సుగుణ, వంశధార
భాస్కరభట్ల కృష్ణారావు:
-యుగసంధి, వెల్లువలో పూచికపుల్లలు
బీనా దేవి:
-పుణ్యభూమీ కళ్ళుతెరు, భూమి గుండ్రంగావుంది, కెప్టన్ కథ, హేంగ్ మీ క్విక్
బుచ్చిబాబు:
-చివరకు మిగిలేది (ఏకాంతం)
బొల్లిముంత శివరామకృష్ణ:
-మృత్యుంజయులు
భోగరాజు నారాయణమూర్తి:
చంద్రగుప్తుడు, విమలాదేవి, అల్లాహో అక్బర్
మంజుశ్రీ:
-నూరు శరత్తులు, స్వర్గారోహణo
మంథా వెంకటరమణారావు:
ఉద్యోగపర్వం
మన్నెం శారద:
-పిలుపు నీ కోసమే, సిస్టర్ సిస్టర్
మల్లాది వసుంధర:
-తంజావూరి పతనం, దూరపు కొండలు, సప్తపర్ణి, నరమేధం
మల్లాది సూరిబాబు:
-జీవనసర్వస్వం
మల్లాది వెంకట కృష్ణమూర్తి:
-లిటిల్ రాస్కెల్, రెండు రెళ్ళు ఆరు, రేపటి కొడుకు, నాతిచరామి, సగటు మనుషులు, ధర్మ యుద్ధం, యమ పాశం, స్రవంతి, మందాకిని, చంటబ్బాయి, జాబిలి మీద సంతకం, నీతిలేని మనుషులు, డబ్బెవరికి చేదు
మల్లిక్:
-చిట్టీ చిట్టీ బ్యాంగ్ బ్యాంగ్
మహీధర రామమోహన రావు:
-ఓనమాలు, దవానలం, కత్తుల వంతెన, కొల్లాయి గట్టితేనేమి, రథ చక్రాలు
మాదిరెడ్డి సులోచన:
-సంధ్యారాగం, ఇది నాదేశం, న్యాయం నిదురపోయింది, అద్దాల మేడ, ఋతుచక్రం, పద్మవ్యూహం, మీనా
మాలతీ చందూర్:
-సద్యోగం, చంపకం, వైశాఖి, ఆలోచించు, హృదయనేత్రి, రెక్కలు చుక్కలు
ముదిగొండ శివప్రసాద్:
-ఆవాహన
మునిమాణిక్యం నరసింహారావు:
-ఉపాధ్యాయుడు, తిరుమాళిగ, వక్రరేఖ, వృద్దాప్యం, రుక్కుతల్లి, దీక్షితులు, శశిరేఖ
ముప్పాళ రంగనాయకమ్మ(http://www.ranganayakamma.org/index.html):
-బలిపీఠం, జానకి విముక్తి, కృష్ణవేణి, కూలినగోడలు, పేకమేడలు, స్వీట్ హోం, ఆండాళ్ళమ్మగారు
ముళ్ళపూడి వెంకట రమణ:
-ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు, రాజకీయబేతాళపంచవింశతి, ఋణానందలహరి
మొక్కపాటి నరసింహశాస్త్రి:
-బారిష్టర్ పార్వతీశం, ఏకోదరులు
యండమూరి వీరేంద్రనాథ్ ( http://www.yandamoori.com ):
-అంతర్ముఖం, తులసీదళం, తులసి, ఆనందోబ్రహ్మ, మరణమృదంగం, రుద్రనేత్ర, అభిలాష,వెన్నెల్లో ఆడపిల్ల, స్వరభేతాళం, అగ్నిప్రవేశం, ఋషి, డబ్బు డబ్బు డబ్బు, ఆఖరిపోరాటం, కాష్మోరం
యద్దనపూడి సులోచనారాణి:
-సెక్రటరీ, సంయుక్త, హృదయగానం, మధురస్వప్నం, సహజీవనం, జీవన తరంగాలు, సంసారరథం, ప్రేమలేఖలు, కీర్తి కిరీటాలు, విజేత, శ్వేత గులాబి, నీరాజనం, రాధాకృష్ణ, జైజవాన్, చీకటిలో చిరుదీపం, జలపాతం, ఈ జీవితం నాది, మౌనపోఒరాటం, కన్నీటి కెరటాలు
యన్నాకుల శాలిని:
-జీవనయాత్రలో ఆఖరి మజిలీ
యర్రంసెట్టి శాయి:
-స్వీట్ రివెంజ్, నిర్భయ్ నగర్ కాలనీ, అమ్మాయి-ఓ- అమ్మాయి, ప్రేమంటె ఇదే ఇదే,
టు హె ల్ విత్ లువ్
యామినీ సరస్వతి:
-జీవన భాష్యం
యార్లగడ్డ సరోజినీ దేవి:
కెరటాలు
రావినూతల సువర్నాకన్నన్:
-క్లిక్ క్లిక్ క్లిక్, కరిగిన శిల, ఆకాశదీపం, ప్రకృతి శాపం, రత్తాలు రాంబాబు
రావి శాస్త్రి:
-గోవులొస్తున్నాయి జాగ్రత్త, రాజు-మహిషి, అల్పజీవి, రత్తాలు రాంబాబు
రావి శ్రీమన్నారాయణ:
-తెలుగు మోసం జిందాబాద్, ఇన్స్పెక్తర్ ఇందిర, బోగస్ బ్రతుకులు
రావూరి భరద్వాజ:
-పాకుడు రాళ్ళు, సౌందర్య నందనం, నాలోని నీవు, శ్రీరస్తు, ఇనుపతెరవెనుక
(తెన్నేటి) లత:
-ఎడారి పువ్వులు, చరిత్రశేషులు, పిచ్చివాళ్ళస్వర్గం, మోహనవంశి, గాలిపగడలు, పథ విహీన, మిస్ కోకిల, వన కిన్నెర, వారిజ, నీటి బుడగలు
లల్లాదేవి:
-శ్వేతనాగు, మా తెలుగుతల్లి,
లక్ష్మీకాంత మోహన్:
- సింహ గర్జనలు
వంగూరి సుబ్బారావు:
-ప్రభాతం, ధరణికోట
వట్టికోట ఆళ్వారు స్వామి:
-ప్రజల మనిషి, గంగు
వడ్డెర చండీదాస్:
-అనుక్షణికం, హిమజ్వాల
వనశ్రీ:
-కురుక్షేత్రం
వాసిరెడ్డి సీతాదేవి:
-మట్టిమనుషులు, మరీచిక, రాబందులు-రామచిలుకలూ, ఉరిత్రాడు, సమత
వినుకొండ నాగరాజు:
-ఊబిలో దున్న
విమలారామం:
-ప్రేమించడం ఎందుకు? , రాజీ
వి. రాజ్యలక్ష్మి:
-చెదిరిన మేఘాలు
విశ్వనాధ సత్యనారాయణ:
-వేయి పడగలు, కడిమిచెట్టు, స్వర్గానికి నిచ్చెనలు, ఏకవీర, జేబుదొంగ, చెలియలికట్ట, దిండు క్రింది పోకచెక్క, బద్దన్న సేనాని, పులుల సత్యాగ్రహం, మిహిరకులుడు, హాహా హూహూ, విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు, అంతరాత్మ, ధర్మచక్రం
వీరాజి:
-ఇద్దరం ఒకటే
వీరేశలింగం:
-రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక), సత్యవతీ చరిత్రము, సత్యారాజా పూర్వ దేశయాత్ర
వేలూరి శివరామశాస్త్రి:
అహోఒబలీయం, ఓబయ్య
వేంకట పార్వతీశ్వర కవులు:
-మాతృమందిరం, ప్రమదావనం, తిరుగుడుపెండ్లి, వసుమతీవసంతం, శ్యామల, లక్షరూపాయలు
వేలాల సుబ్బారావు:
-రాణీ సంయుక్త
శాతవాహన:
-అంగారతల్పం, కల్కి, అనురాగసంధ్య, మరోభారతం, కాలుతున్న పూలతోట, నిశ్శబ్ద యుద్దం, దానవ శిల్పం, వజ్రసంకల్పం, సమ్మోహనాస్త్రం
శారద (నటరాజన్):
-మంచీ-చెడు, ఏది సత్యం, అపస్వరాలు
శిష్టా ఆంజనేయశాస్త్రి:
-కమల వాసిని
శీలా వీర్రాజు:
-మైనా
శ్రీకాంత్:
-దేవుళ్ళారా మీ పేరేమిటి?
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి:
-ఇల్లుపట్టిన వెధవాడపడుచు, మిధున రాగం, వడ్లగింజలు, వీరపూజ, విషభుజంగం,
ఆత్మబలి, రక్షాబంధనము
సాహు రాజయ్య:
-కొమరం భీము
స్వామి:
-గద్దలాడతండాయి
సి. ఆనందరామం:
శారద, ఆత్మబలి, తపస్వి, జాగృతి, తుఫాన్, నవ్వుల ట్రాజెడీ, భాష్యం
సింగరాజు లింగమూర్తి:
-ఆదర్శాలూ-ఆంతర్యాలూ, రంగులమేడ
సీరము సుబద్రాంబ:
జాగిలం
సూర్యదేవర రామమోహనరావు:
-మోడల్, అశ్వభారతం, అక్షరయజ్ఙం, త్రినేత్రుడు, డియర్, ఎర్రసముద్రం, క్రిమినల్స్
హరికిషన్ :
-బలిహారం, హృదయకుసుమాలు, గగనకుసుమాలు, ది జద్జిమెంట్, జీవన విహంగం
హితశ్రీ:
-సామాన్యుడి కానుక
హోతా పద్మినీదేవి:
-నీడలతో క్రీడలు
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
Also browse
http://www.avkf.org/BookLink/brief_view_subjects.php?cat_id=4
For novel-wise and author-wise details.
చూడండి
http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%
B0%B5%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%
B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%
B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81
________________________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home