1263-The Telugu navala
Labels: Indians/ Telugu, Liesure/Telugu, Personality, Telugu literature/ books, Telugu literature/personality, Telugu/ culture/ books, సాహిత్యం-వాఙ్మయం
My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."
Labels: Indians/ Telugu, Liesure/Telugu, Personality, Telugu literature/ books, Telugu literature/personality, Telugu/ culture/ books, సాహిత్యం-వాఙ్మయం

Labels: Chennai, Life/telugu, Personality, Telugu language, Telugu literature, Telugu literature/ books, Telugu literature/personality, Telugu literature/Tamil, సాహిత్యం-వాఙ్మయం
Labels: Books, Telugu literature/ books
CBRaoగారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పైఓ మంచి చర్చకు వారి బ్లాగుదీప్తి ధార ను వేదిక చేసి, ఇన్నయ్య, విశ్వనాథ, కొత్త సత్యనారాయణ చౌదరి, కవి రాజు , జాషువా మొ//వారల గురించి మంచి సమాచారం రాబట్టారు/ ఇచ్చారు కూడా.Labels: Books, Telugu literature/ books
సరదా 'నీతి'
Labels: Books, Telugu literature/ books

Labels: Books, Telugu literature/ books
Labels: Books, Telugu literature/ books

(http://www.avkf.org/BookLink/view_subjects.php?current_number=166)Labels: Books, Telugu literature/ books
'సాహిత్యంలో సమాజం ప్రతిబింబించాలి. అదీ సహజంగా వాస్తవికంగా ఉండాలి. అప్పుడే ఆ సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. స్ఫూర్తిగా నిలుస్తుంది'... సరిగ్గా ఈ అభిప్రాయంతో అల్లుకున్నవే ఇనాక్ సృజించిన కథానికా సంపుటులు 'కట్టడి', 'కొలుపులు'. భిన్న పత్రికల్లో విభిన్న సందర్భాల్లో ప్రచురితమైన ఈ కథానికలన్నీ సమాజంలో కనిపించే సమస్యల్నీ సంఘర్షణనీ ఎత్తి చూపించేవే. పోలింగుబూత్‌కు వచ్చి ఓటు వేయలేనివారి నిస్సహాయస్థితిని 'సగం ప్రజాస్వామ్యం'లో, బాలకార్మిక సమస్యని 'లేబరోళ్లు'లో, ఆడపిల్లని కనే తీరతాను అన్న యువతి ధైర్యాన్ని 'పిల్లని కంటాను'లో చూడవచ్చు. నిమ్నకులాలు, బడుగుల సమస్యల్ని తాకిన 'కులవృత్తి', 'పోలే', 'విముక్తి'... వంటివన్నీ ఈ కోవకు చెందినవే. 'మా అమ్మే'లో మనవరాలిని తల్లిగా భావించిన తాతనీ, 'రాధారాధన'లో యువతీయువకుల మధ్య ఉన్న ఆకర్షణనీ, 'తాతా కారు కావాలి'లో పిల్లల ఆటవస్తువుల్లో వచ్చిన మార్పునీ సున్నితంగా సృజించారు. సంభాషణా శైలి ఎక్కడా ఆగదు. కవితాత్మకంగా హాయిగా సాగిపోతుంది.
Labels: Books, Telugu literature/ books
తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతులు ఆత్మకథకూ బాటలు పరిచి, 'స్వీయచరిత్రము' వెలువరించారు. 1911లో తొలిభాగం, ఆ తర్వాత నాలుగేళ్లకు రెండో భాగం అచ్చయ్యాయి. 'ఈ స్వీయచరిత్రము నందు వీరేశలింగ మహాశయుని జీవిత కథయేగాక యా కాలమందలి యాచారములు, కట్టుబాటులు, న్యాయస్థానములు వ్యవహారములు, దేశస్థితి వెుదలైనవెన్నో తేటతెల్లముగఁ దెలియును. అందుచేత నిది ఆంధ్రదేశము యెుక్క సాంఘిక చరిత్రమని చెప్పవచ్చును' అంటారు ఆ పుస్తకం గురించి చిలకమర్తి లక్ష్మీనరసింహం. కందుకూరి బాటలో నడిచి, సంఘసంస్కర్తగా, గ్రంథకర్తగా ప్రసిద్ధులైన చిలకమర్తి కూడా తన ఆత్మకథను 'స్వీయచరిత్రము' పేరుతో రాశారు.
పోరాట నేపథ్యం ఉన్నవాళ్లు ఆత్మకథలకు ఎక్కువగా శ్రీకారం చుట్టారనిపిస్తుంది. గదర్ పార్టీ యోధుడు దరిశి చెంచయ్య 'నేనూ నా దేశం', దాశరథి కృష్ణమాచార్య 'యాత్రాస్మృతి', ఆయన సోదరుడు దాశరథి రంగాచార్య 'జీవనయానం', కాళోజీ నారాయణరావు 'నా గొడవ' పేరొందిన ఆత్మకథలే. తన అంత్యక్రియలు ఎలా జరగాలో కూడా వివరంగా రాసిపెట్టిన రావి నారాయణరెడ్డి 'నా జీవనపథంలో' స్వాంతంత్య్రానంతరం తెలంగాణ పోరాట కొనసాగింపు విషయమై కమ్యూనిస్టుల మధ్య ఏర్పడిన విభేదాలను చక్కగా వెల్లడిస్తుంది. నల్లా నరిసింహులు 'తెలంగాణ సాయుధపోరాటం- నా అనుభవాలు' ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఓ వీరుడి కథను తలపిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు, సేవాగ్రామ్‌లో గాంధీజీతోపాటు రెండేళ్లు గడిపిన ఎం.ఎస్.రాజలింగం 'స్వీయచరిత్రము', 'బాపు-నేను' పుస్తకాలు రాశారు.
ఉద్యమాలతో సంబంధం లేకుండా రచనలో ఉన్న మాధుర్యాన్ని బట్టి తిరుమల రామచంద్ర 'హంపీ నుంచి హరప్పా దాకా', శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 'అనుభవాలు జ్ఞాపకాలు' గొప్ప ఆత్మకథలుగా పేరొందాయి. ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవలగా తన 'అనంతం' వెలువరించారు మహాకవి శ్రీశ్రీ. 'ఆత్మకథను, స్వీయచరిత్రగా రాసుకున్న తెలుగువాళ్ల సంఖ్య పూర్వం చాలా తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ. సంస్కృత కవులు ఆత్మస్తుతీ పరనిందలకు పాల్పడలేదు గాని తెలుగు కవులు కుకవినింద మానలేదు... ఇదంతా కాలప్రభావం కావచ్చు. పూర్వ మార్గాన్ని అనుసరించటానికే ప్రయత్నిస్తాను' అని చెప్పుకున్న బూదరాజు రాధాకృష్ణ 'విన్నంత కన్నంత' రాసుకున్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు 'నా జీవితయాత్ర', రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు 'నా జీవిత కథ', రాష్ట్ర తొలి రాజకీయ కార్టూనిస్ట్ రాంభట్ల కృష్ణమూర్తి 'సొంత కథ', రచయిత వేగుంట వోహన్‌ప్రసాద్ 'బతికిన క్షణాలు' పేర్లతో ఆత్మకథలు విడుదలచేశారు.
'ఆత్మచరితము' వెలువరించిన ఏడిదము సత్యవతి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి తెలుగు మహిళ. దీని రచనా కాలం 1934. మతం, సంఘం, దురాచారాలను నిరసించి, హేతుబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. నటి భానుమతి 'నాలో నేను' అంటూ తన గురించి చెప్పుకున్నారు. ఇంకా సినీ కళాకారుల్లో ధూళిపాల, పద్మనాభం, డి.వి.నరసరాజు విడుదల చేశారు. '...నా జీవితంలో పాఠకులకు ఆసక్తికరం కాని విషయాలు- ఘట్టాలు- చాలా వుంటాయ్. అవన్నీ వ్రాసి- వాళ్లను విసిగించడం ఏం న్యాయం? విసిగిస్తే- వాళ్లు తిట్టరు- కొట్టరు! పుస్తకం మూసేసి- అవతల పెడతారు!... అందువల్ల... అనవసర విషయాలు వదిలేసి చదివేవాళ్లకు- ఆసక్తికరమని నాకు అనిపించినవి మాత్రమే వ్రాయదల్చుకున్నాను' అన్నారు నరసరాజు.Labels: Books, Telugu literature/ books
మతం, పవిత్ర గ్రంథాల పేరిట కొనసాగుతున్న అబద్ధాలను ప్రశ్నిస్తూ రిచర్డ్ డాకిన్స్ రాసిన పుస్తకం 'ది గాడ్ డెల్యూజన్'. 'దేవుడి భ్రమలో' పేరిట ఇన్నయ్య అనువదించిన దీనిలో దేవుడి ఉనికికి సంబంధించిన అభిప్రాయాలు, నమ్మకాలు, మతం, నీతి, వ్యాపార రీతి తదితర అంశాలను చర్చించారు. 'క్రైస్తవ మతాన్ని మేధావులైన సుప్రసిద్ధులలో అధిక సంఖ్యాకులు నమ్మరు. కాని బహిరంగంగా ఆ విషయాన్ని దాచిపెడతారు. ఆదాయాలు పోతాయని వారికి భయం' అంటారు బెట్రాండ్ రస్సెల్. మతం, విజ్ఞానంపై కేంబ్రిడ్జ్‌లో టెంపుల్టన్ సంస్థ ఓ సమావేశాన్ని నిర్వహించి ఎంపికచేసిన సైన్స్ జర్నలిస్టులకు లక్షన్నర డాలర్ల చొప్పున చెల్లించిన వైనాన్ని డాకిన్స్ తప్పుబట్టారు. ఆ సంస్థ డబ్బు శాస్త్రీయరంగాన్ని చెడగొడుతోందంటూ నిరసన వ్యక్తం చేశారు. నిరంతరం కొనసాగుతుండే ఈ చర్చనీయాంశాలపై డాకిన్స్ ఓ వెబ్‌సైట్(వ్వ్వ్.రిచర్ద్దవ్కిన్స్.నెత్)నూ నిర్వహిస్తున్నారు.
Labels: Books, Telugu literature/ books
సుప్రసిద్ధ పాతిక
Labels: Books, Telugu literature/ books

Labels: Books, Telugu literature/ books
సహృదయైుక వేద్యం
Labels: Books, Telugu literature/ books
"త్రిలోకాలు, త్రికరణశుద్ధి, దుష్టచతుష్టయము, పంచప్రాణాలు, పంచాంగము, పంచద్రావుడులు, పంచమహాపాతకాలు, సప్తసముద్రాలు, సప్తర్షులు, అష్టదిగ్గజాలు, నవధాన్యాలు, దశావతారాలు, షోడశోపచారాలు, అష్టాదశ పురాణాలు", ఈవిధంగా అంకెలతో కూడిన మాటలు తెలుగువారి నోట మాటి మాటికి వినబడుతుంటాయి. త్రికరణలంటే ఏమిటి? పంచాంగానికి ఆ పేరు ఎలా వచ్చింది? సప్తర్షులు ఎవరు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఇలా అంకెలతో కూడిన మాటలకు నిలయమే- "సంకేత పదకోశం".దీని సంపాదకులు సంస్కృత పండితులూ,కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపాధ్యక్షులూ ఐన ఆచార్య రవ్వా శ్రీహరి గారు.Labels: Books, Telugu literature/ books

నన్నయకూ పోతనకూ తిక్కనకూ దొరకని అదృష్టం నాకు దక్కింది.వేదాల్ని తెలుగులోకి అనువదించే మహద్భాగ్యం నాకే దక్కింది. అంతటి బృహత్యార్యంలో నాకు సాయపడిందెవరూ లేరు. నేనే కాయితం కొనుక్కొని పెన్సిల్ కొనుక్కొని రాశాను. ఒకటా రెండా! ఐదువేల పేజీలు. ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాల్నీ కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే. అంతేకాదు, వేదాలకు వ్యాఖ్య చేసిన సాయణాచార్యులు మన ఆంధ్రుడే. ఇది తెలుగువారి అదృష్టం.Labels: Books, Telugu literature/ books
(ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం,విజయవాడ-520 010, సం.2002, రూ.250/-)
| ||
********************
ప్రస్తుత పాఠకులకు చాలామందికిఈ పుస్తకాలతో పరిచయముండకపోవచ్చు.ఈ స్పీడ్ యుగంలో పుస్తకాలన్నింటినీ చదివే సమయమూ, ఓపికా ఉండకపోవచ్చు. అలాంటివారికి ఆయా పుస్తకాల పరిచయం, కనీసం ఈ సమీక్షల ద్వారానైనా కలుగుతుంది.
కొని దాచుకోదగ్గ ఒక అపురూపమైన సంకలనం ఇది.
Labels: Books, Telugu literature/ books
వెయ్యేళ్ళ తెలుగు సాహితీ ప్రస్థానం పిల్ల కాలువలా మొదలై, నదీ ప్రవాహమై, సాగరమై, సుసంపన్నమై మైలురాళ్ళను నెలకొల్పుతూ ముందుకు సాగుతూ ఉన్నది.అటువంటి సాగరతుల్యమైన సాహిత్యం నుంచి 'గొప్ప వంద పుస్తకాలు ఇవే ' అని తేల్చి చెప్పడం కష్టసాధ్యమైన పని. రచయితలు కొందరు విడి విడిగా ఇటువంటి ప్రయత్నంచేసారు. వాటిని గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు., కాని ఆంధ్రజ్యోతి దినపత్రిక 1999 దిసెంబర్ లో ముద్రించిన జాబితాను ఇక్కడ పొందుపర్చుతున్నాము. అప్పట్లో ఆంధ్రజ్యోతి సాహిత్యవేదికను చూస్తున్న సీనియర్ జర్నలిస్టు, రచయిత పొనుగోటి కృష్ణారెడ్డి తెలుగులో వచ్చిన గొప్ప వంద పుస్తకాలను ఎంపిక చేయడానికి ఓ మంచి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు, కవులు, విమర్శుకులు, మేధావులు,పుస్తక ప్రియులనుంచి గొప్ప వంద పుస్తకాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరిపారు.వారిలో 44 మంది రచయితలు తమ అభిప్రాయాలను పంపారు. ఈ అభిప్రాయాల ప్రాతిపదికగా రూపొందించి, అంధ్రజ్యోతిలో ప్రచురించిన జాబితాను వరుసక్రమంలో ఇక్కడ ఇచ్చాము. ఈ జాబితా ఎంపికలోనూ అనేక పరిమితులున్నాయని, ఇదే సమగ్రమైన జాబితా అని చెప్పడానికి సాహసించడం లేదని అప్పట్లో సంపాదకులు ప్రకటించారు. అభిప్రాయ సేకరణలో పాల్గొన్న రచయితల వ్యక్తిగత అభిరుచి, వారికి ఉండే పరిమితుల కారణంగా కొన్ని ప్రముఖ రచనలకు ఇందులో స్థానం లభించకపోయివుండవచ్చు. అంతమాత్రం చేత ఆ రచనల ప్రాధాన్యం తగ్గిపోదు. ఆంధ్రజ్యోతి అప్పట్లో వంద గొప్ప కథలను కూడ విడిగా ఎంపిక చేసింది.అందువల్ల గొప్ప వంద పుస్తకాల జాబితాలో కథల సంపుటాల గురించిన ప్రస్తావన చేయలేదు.
Labels: Books, Telugu literature/ books
..'ఈనాడు' జర్నలిజం స్కూలు, 'ఆంధ్రజ్యోతి ' జర్నలిజం కళాశాలలు- జర్నలిస్టులు కాదలచినవారు చదవాల్సిన పుస్తకాల జాబితాలను రూపొందించాయి.ఆ జాబితాలోని తెలుగు నవలలు, నాటకాలు, కథలు, కవిత్వం, వ్యాసాల పేర్లు:
Labels: Books, Telugu literature/ books
.....వర్తకానికి వచ్చి రాజ్యాధిపతులైన ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకొని పోవడం వాళ్ళకు తప్పుగా కనపడలేదు. వారి కొలువులో వున్న దేశీయులు బతుకు తెరువు కోసం చేతనైన ఆర్జనలు చేయడం తప్పు కాదనిపించింది. రెవెన్యూ డిపార్టుమెంటులో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూవున్న నేటివులు అడ్డదారులు తొక్కి ధనార్జన కోసం అక్రమాలు అన్యాయాలు మోసాలు దగాలు తప్పుడు రికార్డులు సృష్టించడం మొదలైనివి చేస్తున్నారని తెల్లదొరలు గుర్తించారు.నేటివులు విశ్వసనీయంగా ప్రవర్తించాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించారు.నేటివుల విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకున్నారు.ఆనాటి మద్రాసు గవర్నరు సర్ తామస్ మన్రో 1822 జూలై రెండో తేదీన ఒక యీ దస్తు కోరారు.అందులో ఇలా వుంది :Labels: Books, Telugu literature/ books