ఒక సైన్మ
"ఏమన్నా! చెన్నైలో మస్తుగ సెటిలైనావే?ఈ మద్యల హైదరాబాద్ రాలేదేమన్నా?" జయపాల్ ఫోన్ల, హైదరబాదులకెల్లి. "ఏంలేదే, ఒక సైన్మ చూసిన, హైదరబాదోల్లు జరూర్ చూడాలన్నా. మల్ల నూవక్కడ అరవోల్లమద్య ఉన్నవు, గీ సైన్మ చూడనీకి ఎట్లౌతది! దాందిక్కెల్లి నీకు DVD పంపిస్తున్న, చూసి ఎంజాయ్ చెయ్."
DVD వచ్చినంక ఏసిన, చూసిన.
ఏక్ దం మస్తుగున్నది.
పాతబస్తి షద్దలు, వాల్లు పోరిల ఛేడ్ ఛాడ్, చాన్మినార్ దిక్కు కేఫ్ లల్ల చాయిలు తాగుత గవి, గివి పొంకణాలు మట్లాడుకుంట పోకడలు పోవుడు, పీర్ల పండగ;
బస్తిల దాదాలు, బోనాల పండగ, కిడ్నాపులు;
సాఫ్ట్వేర్ కంపనీ ,ఏన్నారైలు- వాల్ల యాంకీ ఇంగ్లీషు;
జర్రంత రొమాన్సు, స్లాప్ స్టిక్ కామెడి;
హైదరాబాదు పాతబస్తిల కల్చరు ఔర్ హైదరాబాదు జుబాన్ (యాస), ఎన్నారైల యాంకీ జుబాన్ల కిచిడి ఈఫిల్లిం.
హర్ ఏక్ హైదరాబాదీ దేఖ్నేకి చీజ్ హై-ఏ ఫిల్లం.
జైపాల్కి ఫోన్ జేసి చెప్పిన "తమ్మి, చాన థాంక్స్. హైదెరాబాదుల ఉన్న ఫీలింగ్ ఇచ్చింది ఈ సైన్మ."
హైదరాబాదోల్లు చూడకుంటె, సూడండ్రి, ఔర్ మస్తుగ ఎంజాయ్ సెయ్యుండ్రి..
ఔ మల్ల సైన్మ పేరు చెప్పకుంటె మీరెట్ల చూస్తరు?
సైన్మ పేరు "ది అంగ్రేజ్"
________________________________________
______________________________________________________________
Labels: Cinema, Cinima/ Telugu
0 Comments:
Post a Comment
<< Home