My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, May 20, 2007

కొల్లిపర బాలగంగాధర తిలక్


20,మే,2007 'ఈనాడు, ఆదివారం'సంచికలో కొల్లిపర బాలగంగాధర తిలక్ గారి గురించి చదువుతుంటే, నా చిన్నప్పుడు బహుశ 1958-59లో అనుకుంటా, హైదరాబాదు, నారాయణగూడాలోని దీపక్ మహల్ లో చూసిన 'ఎం.ఎల్.ఏ' సినిమా గుర్తుకుతెచ్చుకున్నా. అప్పుడు ఆ సినిమా వెనక చరిత్రగాని, ఆ డైరక్టరు గురించిగాని ఏమి తెలవదు.ఈ article చదువుతుంటే ఎన్నొ విశేషాలు తెలిశాయి. ఈ article లొని కొన్ని విశేషాలు మచ్చుకి:

-----------------------------------------------------------
'భూసంస్కరణల ఉద్యమం పెద్ద తుపానులా దేశాన్ని వూపేస్తుంది. ఇప్పుడు ఎదురీతకు ప్రయత్నించడం శుద్ధ తెలివితక్కువ. పంచదార ఫ్యాక్టరీనో సిగరెట్టు ఫ్యాక్టరీనో పెడితే దానికి కావలసిన చెరుకూ పొగాకూ పండించుకోవడానికి ఎంత భూమైనా ఉండొచ్చు. దానికి పరిమితి లేదు... అదనపు భూములన్నీ షేరుధనం కింద రాసేసుకుందాం. షేర్లన్నీ మనవే కాబట్టి భూములన్నీ మన కిందే ఉంటాయి' ...ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం విడుదలైన 'ఎం.ఎల్.ఎ.' సినిమాలో ఓ జమీందారు పాత్రధారి డైలాగులివి. సంస్కరణల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ముందే హెచ్చరించిన దార్శనికుడు కొల్లిపర బాలగంగాధర తిలక్ ఆలోచనల ప్రతిరూపం ఆ సినిమా........

"ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఎ., అత్తా ఒకింటికోడలే, భూమికోసం, ఛోటీ బహు, కంగన్... ఇలా నేను తీసిన సినిమాలు విజయవంతం అవడం ఒక ఎత్తయితే... తీయాలనుకుని తీయలేకపోయినవి మరొకఎత్తు. .............
స్టూడియోలకే పరిమితమైన సినీతారలనూ షూటింగుల్నీ మామూలు జనం మధ్యకి తీసుకొచ్చిన సినిమా నా 'ఎమ్మెల్యే'. రివోట్ కంట్రోల్ రాజకీయ హత్యలకు నాంది పలికిన చిత్రమూ అదే. అందులో ీదాసు' పాత్ర వేసిన జగ్గయ్యను చంపి యాక్సిడెంట్‌లా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు ప్రత్యర్థులు. ఆ సీన్‌ని ఇప్పటి హైదరాబాద్ పబ్లిక్‌స్కూలు దగ్గర చిత్రీకరించాం. రిజర్వుడు అభ్యర్థులను ముందుంచి తెరవెనుక రాజకీయాలు (బ్యాక్‌సీట్ డ్రైవింగ్) నడిపే తీరును అప్పట్లోనే ఉహించి తీసిన సినిమా అది. దురదృష్టమేంటంటే... ఇప్పటికీ అదే జరుగుతోంది. ఆ పరిస్థితుల్లో ఏం మార్పు రాలేదు. .............

నేను సినీ పరిశ్రమలోకి రావడానికి కారణం మా మేనమామ. అవును! అక్కినేని లక్ష్మీవరప్రసాద్... ఎల్వీ ప్రసాద్ మా మావయ్య.
..............ఎడిటింగ్ లైన్‌లో స్థిరపడ్డాననుకున్న దశలోనే అనుకోకుండా దర్శకుణ్నయ్యాను. సావిత్రి హీరోయిన్‌గా తెలుగూ తమిళం భాషల్లో ఒకేసారి తీసిన 'జ్యోతి' నా వెుదటి సినిమా. ఆ సినిమా దర్శకనిర్మాతలకు చెలరేగిన గొడవల మూలాన కొంత షూటింగ్ పూర్తయ్యాక దర్శకుణ్ని తొలగించి ఆ బాధ్యతలు నాకప్పజెప్పారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను చాటిచెప్పేలా అప్పటికప్పుడు ఓ పాట రాయించి ఆ సినిమాలో కలిపాను.
ఆ పాటకు అభినయించిన బాలనటి జోగమాంబ సహజనటి జయసుధ తల్లి.

ఆ తర్వాత తీసినదే 'ముద్దుబిడ్డ'. అప్పటికే 'పుట్టిల్లు' సినిమాతో హీరోయిన్ అయిన జమునకు నటిగా ఎంతో పేరుతెచ్చింది. అందులో నేను నృత్యకళాకారిణిగా పరిచయం చేసిన ీజ్యోతి'- హీరో సాయికుమార్ వాళ్లమ్మ. మూడో సినిమా 'ఎమ్మెల్యే'. ఆ సినిమా చర్చల్లో ఉన్నప్పుడే నాకో ఆలోచన వచ్చింది. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రరాష్ట్రానికి రాజధాని ఏదన్న తర్జన భర్జనల అనంతరం హైదరాబాదును ఎన్నుకున్నారు. ఆ నేపథ్యంలో హైదరాబాద్ చారిత్రక, కళాత్మక ఘనతను వర్ణిస్తూ ఒకపాట పెట్టాలన్నదే ఆ ఆలోచన. ఆరుద్ర అద్భుతంగా రాశారా పాటని... 'ఇదేనండి ఇదేనండి భాగ్యనగరమూ మూడు కోట్ల ఆంధ్రులకూ ముఖ్యపట్టణం..'

అందులోనే 'నవో నవో బాపు మాకు న్యాయమార్గమే చూపు' అప్పట్లో స్వతంత్రదినోత్సవ వేడుకల్లో అంతా తప్పనిసరిగా పాడుకునే పాట. మధుర గాయని ఎస్.జానకి పరిశ్రమకు పరిచయమైంది ఈ చిత్రం ద్వారానే. ఆ పాట 'నీ ఆశ అడియాస...' జానకికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఇవే కాదు నా సినిమాల్లో నేనెంతో ఇష్టపడి రాయించుకున్న పాటలన్నీ జనాదరణ పొందినవే... 'జయమంగళ గౌరీ దేవీ, దయచూడుము చల్లని తల్లీ', 'అమ్మా చూడాలని ఉంది(ముద్దుబిడ్డ)', 'ఇదేమి లాహిరి ఇదేమి గారడి, ఎడారిలోన పూలుపూచి ఎంత సందడి (ఈడూజోడు)', 'ఓ పోయే పోయే చినదానా, నీ తీయని మనసూ నాదేనా', 'అందాలా రాముడు ఇందీవర శ్యాముడు, ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు', 'కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడిందీ' (ఉయ్యాలజంపాల)'... ఇలా చెప్పుకుంటూపోతే మా అనుపమ చిత్రాలన్నీ సంగీతపరంగా హిట్లే. "
___________________________________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home