మర,గింజలు, పిండి --జీవితం
మరలో గింజలు... గిరగిరా శబ్దం... బుట్టలో మెత్తని పిండి!
ఆ దృశ్యం తులసికెప్పుడూ అపురూపమే!
ఆమె తండ్రిది పిండిమర వ్యాపారం.
చిన్నప్పుడు, గింజ పిండిగా మారే పద్ధతి విచిత్రంగా అనిపించేది.
పెద్దపెద్ద కళ్లతో అబ్బురంగా చూసేది.
వయసు పెరిగేకొద్దీ ఆలోచనలు విస్తరించేకొద్దీ సత్యం బోధపడింది.
....... దాన్ని జీవితానికి అన్వయించుకుంది.
మర... జీవితం! గింజ... మన కల!
పిండి... కృషి ఫలితం!
గింజను బట్టే పిండి. యద్భావo తద్భవతి!
..............................
(Eenadu- Sunday , May 27 , 2007)
-------------------------------------------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home