పక్షులు
[1]చక్రవాకము=the ruddy goose or Brahmany duck, [Anas casarca],కోకము, జక్కన పక్షి.The poetical swan, always described as being in pairs(క్షణ విరహంకూడ సహించలేనవి).
______________________________________
[2]క్రౌంచము=a kind of heron or curlew, [Ardea jaculator ]కొంచపిట్ట, ఒకవిధమగు కొంగ
[కీ.శే.బూదరాజు రాధాకృష్ణగారి "మాటల మూటలు" లోని 'పక్షి సంతతి ' అధ్యాయంనుండి ఈ క్రింది అంశం, ఆసక్తిదాయకంగా ఉందని, ఎత్తి రాయబడింది:-
"మన పరిసరాల్లో కనిపించే మరో పక్షి కొంగ. ఈ తెలుగు మాటకు 'కొక్కెర, కొక్కెరాయి, పుల్లగొరక, గుండగి ' మొదలైన పేర్లున్నాయి. 'పెద్ద కొక్కెర, తెల్లకొక్కెర,గుడ్డికొంగ, చీకుకొక్కెర, పక్కు కొంగ, గుడి కొంగ, దోసికొంగ, సినిగలకొంగ, సంకుబుడ్డి కొంగ ' వంటి భేదాలున్నాయి.
'కొంచ ' అనే తద్భవనామముంది. అది క్రౌంచ/క్రుంచ శబ్దభవం- అంటే వంగిన, మెలికలు తిరిగిన (మెడగలది) అనే అర్థంలోనన్నమాట.
'బకం, సారసం, క్రౌంచం, లోహపృష్థం ' అనే సంస్కృత పదాలు పర్యాయ పదాలు.వీటిలో మొదటిదే సాధారణ పదం.సరస్సుల్లో ఉంటుంది కాబట్టి సారసమన్నారు.వంపు మెడగలది కాబట్టి క్రౌంచం.కట్టెల్లాంటి కాళ్ళున్నది కాబట్టి లోహపృష్ఠం.ష్థం బకమంటే మోసకారి, దొంగ అని విశేషార్థం.'కొంగజపం ' వల్ల ఈమాట పుట్టింది.పెద్ద కొక్కెరను బిసకంఠిక, బలాకం అంటారు. కొక్కెరను కృకణం, క్రకరం అంటారు.గుడ్డి కొంగను కోయష్టికం అంటారు.పక్కు కొంగను కహ్వ మంటారు, సంస్కృతంలో. " ]
________________________________________
[3]చకోరకము/చకోరము=వెన్నెలపులు(గు, the bartavelle or Greek parridge: a bird much referred to in poems:corresponding to the nightingale, or turtle dove (చంద్రకిరణములకు చకోరపక్షులు ఏ విధముగా నిరీక్షించుకొనియుండునో)
____________________________________
(చాతక పక్షులు= తలకిందులుగా ఎగురుతూ వెన్నెలనో మంచు బిందువుల్నో మాత్రమే తాగి బతికే పక్షులు,వాన కోయిల )
_____________________________________
Labels: Animals/ telugu
0 Comments:
Post a Comment
<< Home