ఫన్‌కర్ ఫటాఫట్
నమ్మిచెడ్డవాడు ఉండొచ్చేమో గాని... నవ్వి చెడ్డవాడు లేడు. ఇంతకాలం వ్యాసం నాది. హాసం మీది. మనం మనం కలిసి 'ఫన్ని'కిలించాలని నా తహతహ. అందుకే ఫన్‌మంతులూ కదలిరండి. 'ఫన్'చాయతీ చేసుకుందాం. నవ్వే జనాస్సుఖినోభవంతు
-ఫన్‌కర్
------------------------
* నాకో గిఫ్ట్ చెక్కు వచ్చింది. దానిమీద డేట్ 30.2.2008 అని ఉంది. ఆ డేట్ అసలు రాదు కదా! మరి ఆ చెక్కును ఏం చేయమంటారు?
- ఎం. వీరనారాయణ, అనకాపల్లి
మీదగ్గరే 'చెక్కు' చెదరకుండా ఉంచుకోండి. ఎప్పటికీ 'చేతులు' మారని 'స్థిరాస్తి' అది!
------------------------------
* మేనేజ్‌మెంట్ 'గురు' కావాలన్నది నా కోరిక. ఓ పట్టాన నెరవేరేటట్లు లేదు
-కె. గణనాథ్, జగిత్యాల
మన రైల్వే మినిస్టర్ లాలూజీతో మాట్లాడా. అబ్బే! రెండు 'పట్టాలు' ఉండాల్సిందే అంటున్నాడాయన.
------------------------------
* అంబానీల ఐశ్వర్యాన్ని చూసి ఓ పాట రాయాలనిపిస్తోంది. ఒకవేళ రాస్తే ఎలా ఉంటుందంటారు?
-ఎస్.సుగుణాకర్, విజయవాడ
'అంబా' నీ తీయని డబ్బు... ఎంత కుప్పగా ఉందిరో యబ్బ' అన్నట్టు ఉంటుంది.
-------------------------------
* మావాడు ఈమధ్య బిజీబిజీగా తిరుగుతున్నాడు. ఏంటీ కత?
-ఎస్. సుబ్రమణ్యం, గుడివాడ
బిజీగా ఉన్నాడంటే బిజినెస్ ఏవైనా బెడిసికొడుతోందేమో ఓ కన్నేయండి.
-----------------------------------
* పార్టనర్లు బిజినెస్ చేస్తారు. లైఫ్ పార్టనర్లు ఏం చేస్తారు?
-ఎం.సుబ్బారావు, రాయదుర్గం
'గజి బిజి'నెస్
--------------------------------
* పంచ పాండవులు ఐదూళ్లు పంచి ఇమ్మన్నా పంచి ఇవ్వలేదు. చివరకు భీముడి చేతిలో పంచ్‌లు తిని చచ్చాడు. దుర్యోధనుడికి ఏం లాభం చెప్పండి?
- వి. రమాదేవి, పాణ్యం
'చచ్చేంత' లాభం.
-------------------------
* దుస్తుల కొరత తీరాలంటే
-కె.వెంకట్రావు, కడప
ప్రతి ఒక్కరూ 'తార'స్థాయికి ఎదగాలి. లెస్ డ్రస్ మోర్ కంఫర్ట్ కదా మరి
------------------------
* మా స్థలాల్లో టేకు చెట్లు పెంచినా పెద్దగా ఫలితం కలగడం లేదు ఏం చేయమంటారు?
-ఎం. సుగుణ, అనంతపురం
పారిజాతపు చెట్లు పెంచండి. సత్యభామ సాక్షిగా శ్రీకృష్ణుడి 'అండ్'దండలు ఉంటాయి. ఒకే 'టేకు'లో వ్యాపారం ఓకే అవుతుంది.
-----------------------------
* వ్యాపారులందరూ పార్టీపెడితే
-ఎ. నటరాజ్, బెంగళూరు
'టీ' పార్టీకే ఎక్కువ ఖర్చవుతుంది.
---------------------------------
(Eenadu, 09:09:2007)
------------------------------------------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home