My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 19, 2009

తెలుగువాడి వేదన


-శంకరనారాయణ
తెలుగువాడు ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని తేల్చి చెబుతాడు. చిన్న జబ్బునైనా తేలిగ్గా చూడడు. పడిశం పదిరోగాల పెట్టు అని కాస్త దూరంగా ఉంటాడు. ముక్కూమొహం చూసేటప్పుడూ జలుబు ఏమైనా ఉందా అని నిశితంగా చూడ్డం ఈమధ్య అలవాటు చేసుకున్నాడు. ఆబాలగోపాలమూ ఇదే వరస!

పూర్వకాలంలో మునులు తపస్సును 'ముక్కు మూసుకుని' ఎందుకు చేసేవారని ప్రశ్నిస్తే- 'స్వైన్‌ఫ్లూ భయంతోనే' అని తెలుగునాట చిచ్చరపిడుగులు జవాబు చెబుతున్నారు. ఈరోజుల్లో అయితే శుభ్రంగా ముక్కుగుడ్డలు వాడుకునేవాళ్లు అంటున్నారు. ప్రజలు స్వైన్‌ఫ్లూతో బాధపడుతుంటే- ప్రభుత్వం మాత్రం 'స్వయం ఫ్లూ'తో బాధపడుతోందని, ఆరోగ్యం 'యావత్తు'పోయి ఆ 'రోగం'తో బాధపడుతున్నవారు విమర్శిస్తున్నారు. మనది అపరిశుభ్ర దేశమనీ, ప్రపంచంలోని చెత్త అంతా ఇక్కడే పేరుకుంటుందనీ ఖండఖండాంతరాల్లో ఒకటే ప్రచారం! విదేశాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయనీ హోరెత్తుతుంటుంది. చిత్రమేమిటంటే, ఎయిడ్స్‌ మొదలుకొని స్వైన్‌ ఫ్లూ వరకు అన్ని జబ్బులూ విదేశాలనుంచే ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి తప్ప, ఏ జబ్బూ ఇండియానుంచి ఎగుమతి కావడంలేదు.

'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని ఎప్పుడూ పాడే తెలుగువాడు వైద్యంలో చేయితిరిగినవాడే! ఆ మాటకొస్తే పైసా ఖర్చు లేని మందూ మనవాడే చెబుతాడు. 'లంఖణం పరమౌషధం' అంటాడు. మందుకు విపరీతార్థం చెప్పి 'పానా'యామం చేయగల దిట్ట తెలుగువాడే! ఎవడి ఇంట్లో వాడు వైద్యం చేసుకుంటానంటే అతగాడు ఒప్పుకోడు. ఔషధం కానిది అవనిలో లేదు అంటూనే పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదంటాడు! నవ్వొచ్చిందంటే వైద్యుణ్నీ లెక్కచెయ్యడు. 'వైద్యో నారాయణో హరిః' అని అందరూ అంటుంటే, అతడు వైద్యోనారాయణో 'హరీ' అని పళ్లికిలిస్తాడు. హరీ అన్నా, టపా కట్టడమన్నా తెలుగువాడి అర్థం వేరుగా ఉంటుంది. తిక్కరేగితే చెట్టంత వైద్యుణ్నీ పట్టుకుని 'నీచేతి మాత్ర వైకుంఠయాత్ర' అనడం తెలుగువాడికే చెల్లు.

ప్రపంచంలో ఏ పిచ్చీ లేనివాడు ఎవడూ లేనట్టే, ఏ జబ్బూ లేనివాడు ఎవడూ లేడన్నది తెలుగువాడి సిద్ధాంతం.
'లేనివాడికి ఆకలిజబ్బు ఉన్నవాడికి అరగని జబ్బు' అని పాడతాడు.

వైద్యవృత్తి రహస్యాలను తెలుగువాడు ఔపోసన పట్టాడు. అందుకే 'చావుకు పెడితేకానీ లంఖణానికి తేలదు' అంటాడు. 'నినువీడని నీడ' ఎవరూ అని అడిగితే వైద్యుడు అని తెలుగువాడు ఠక్కున చెబుతాడు. 'చచ్చేదాకా వైద్యుడు వదలడు' అని చెబుతాడు. వెనకటికి రోగులు వైద్యులను చూసి భయపడేవాళ్లు. స్వైన్‌ఫ్లూ పుణ్యమా అని, ఇప్పుడు రోగులను చూసి వైద్యులు భయపడుతున్నారు. ఏ రోగివల్ల తన ప్రాణంమీదికి వస్తుందోనని తల్లడిల్లుతున్నారు.

'నేను రాను మొర్రో సర్కారు దవాఖాన'కు అనేది ప్రభుత్వ వైద్యుల గీతం కూడా అయిపోయింది.

'ఎన్నో వ్రణాలు కోసినాను, నా వ్రణం కోసినప్పుడున్నంత నొప్పి లేదే' అన్నవాడూ మన వైద్యుడే!

జబ్బులకు సైతం మానసిక బలహీనతలు అంటగట్టడం తెలుగువాడి ప్రతిభే. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటాడు!

'ఇంతింతై జబ్బు ఇంతై' అనడం మనవాడికి పరిపాటి. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయిందే అని కలత చెందుతాడు. దీనికన్నా పుండుమీద కారం రాసినట్టు మాట్లాడేవారిని చూసి ఎక్కువ బాధపడతాడు.

'బాధే సౌఖ్యమనే భావన' తెలుగువాడి ఆరోగ్య వేదాంతం! నొప్పికి విరుగుడూ చెబుతాడు. 'గర్భాధానం ముచ్చట్లు లంఖణాల్లో తలచుకుంటే' ఎంత బాగుంటుంది అంటాడు. అన్నీ సాగితే రోగమంత భోగమే లేదంటాడు. 'అన్నం హితవు లేనివాణ్ని కరవేం చేస్తుంది?' అని ప్రశ్నిస్తాడు.

అంతమాత్రాన ప్రతిదానికీ లేదు, లేదంటే వూరుకోడు. ప్రత్యేకించి తన భార్య నోటివెంట లేదు అనే మాట వస్తే అస్సలు వూరుకోడు. 'పుండు మీదికి నూనె లేదంటే బూరెలొండవే పెళ్లామా' అన్నవాడూ తెలుగువాడే.

విశేషమేమిటంటే, తెలుగువాడు వైద్యుడి దగ్గరకు పోయేటప్పుడు తన జాతకం ఎలా ఉందో ఆలోచించడు. వైద్యుడి హస్తవాసి ఎలా ఉందోనని ఆరాతీస్తాడు. అదేమిటంటే 'ఆయుష్షు గల రోగి హస్తవాసి గల వైద్యుని దగ్గరకే పోతాడు' అని చెబుతాడు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వ వైద్యుల నియామకాలన్నీ హస్తవాసి పరీక్షించి ఇస్తే బాగుంటుందనిపిస్తాడు.

అలవోకగా ఆరోగ్య సూత్రాలు, ముందు జాగ్రత్తలు చెప్పడం తెలుగువాడికి అలవాటు. 'అనగా అనగా రాగం, తినగా తినగా రోగం' అంటాడు. 'రాయంగరాయంగ కరణం... పారంగ పారంగ మరణం' అని సిద్ధాంతీకరిస్తాడు. 'అరఘడియ భోగం... ఆరు నెలల రోగం' అనీ హెచ్చరిస్తాడు. అరిశె ఆరు నెలల రోగం బయటకు తెస్తుదని పరిశోధనాత్మకంగా చెబుతాడు.

తెలుగువాడు 'ఎవ్వనిచే జనించు' పద్యమే కాదు , ఎవ్వనిచే మరణించు' అన్న పద్యమూ పాడతాడు. 'ఆయువు గట్టిదైతే అన్ని రోగాలూ పోతాయి' అని ధీమాగా చెబుతాడు. 'ఆయుష్షు లేక చస్తారు కానీ ఔషధం లేక చస్తారా?' అని ఎదురు ప్రశ్నలు వేస్తాడు. ఇంతచేసీ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నానంటాడు. 'కొత్త వైద్యుడి కన్నా పాత రోగి మేలు' అంటాడు. అంతవరకు సర్దుకోవచ్చు. ఎటొచ్చీ కొత్త వైద్యుల నియామకం ఎందుకు? పాత రోగులనే వెతికి పట్టి ఆసుపత్రుల్లో వైద్యులుగా నియమించాలంటాడేమోనని ఎంతమంది హడలి చస్తున్నారో ఎవరికి తెలుసు?
(ఈనాడు, ౧౯:౦౯:౨౦౦౯)
__________________________

Labels: ,

Saturday, March 22, 2008

మాఫీచేసి చూడు

- శంకరనారాయణ
'అప్పిచ్చువాడు' పద్యం రాసిన కవి ఎంత గొప్పవాడు! ప్రజాస్వామ్య మూలతత్వం ఆమూలాగ్రం తెలిసినవాడు!! 'రుణానుబంధ రూపేణా' అనేది ఛాదస్తం కాదని, వేదాంతం అంతకన్నా కాదని 'రుణరంగం'లో 'సొమ్ములు తిరిగిన' మేధావులు (సన్నాయి) నొక్కి వక్కాణించే విషయం! 'ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ' అని పాట పాడినవాడు అమాయకుడు. తాను చేసిన రుణాలను మాఫీ చేయాలని అడిగి ఉంటే అతడి తెలివి తేటలకు తగినంత ఫలితం దక్కేది.

ఎప్పటికయ్యెది ప్రస్తుతమప్పటికా 'మూటలు' ఆడడంలో అధికారపక్షం వారు అందె వేసిన 'చెయ్యి'. ఎన్నికలకు ముందూ వెనకా వారి నటనా వైభవాన్ని బేరీజు వేసి చూస్తే 'మూక' మీద వేలు వేసుకోక తప్పదు. ఎన్నికల ముందు జనాభిప్రాయానికి పెద్దపీట వేస్తున్నట్టు గద్దె ఎక్కాక ఖజానాభిప్రాయానికి కంకణం కట్టుకున్నట్టు ఎటువంటి ముస్తాబు లేకపోయినా 'హవా'భావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగలరు. అప్పటి ఇందిరాగాంధీ హయాంలో రుణమేళాల పేరుతో 'రుణభేరి' మోగించినా, ఇప్పటి సోనియాగాంధీ జమానాలో 'మాఫీ వేదాంతం నూరిపోసినా నేపథ్య సంగీతమంతా 'ఓటు వాకా సాగరోరన్నదే'! అంత మాత్రాన పాలకపార్టీ వారికి ఆదా సంగతి తెలియదని అపార్థం చేసుకోకూడదు. రైతులు తాము మద్యం తాగడం మానేసి, అందువల్ల మిగిలే డబ్బుతో విద్యుత్‌ మీటర్లు బిగించుకోవచ్చునని కొంతకాలం క్రితం ఓ అమాత్యవర్యుడు అన్నాడు. ఇటువంటివన్నీ ఎన్నికలయ్యాక 'అవసరం' తీరాక రాజకీయ వెండి తెరమీద కనిపించిన విశేషాలు. అధినాయకులు అకస్మాత్తుగా మాఫీ మంత్రం అందుకున్నంత మాత్రాన వారు సర్కారు సొమ్ము దుబారా చేస్తున్నారనుకోవడం పొరపాటు. ప్రజాధనాన్ని దానం చేయడంలో కర్ణులని అనకూడదు. ఎప్పుడు డబ్బు ఎవరికోసం ఖర్చు పెట్టాలో వారికి ఎన్నికలతో పెట్టిన విద్య. వారు తలుచుకుంటే విద్యార్థుల ఫీజుల్ని కూడా మాఫీ చేయవచ్చు. కానీ పాలకులు అమాయకులు కాదు. విద్యార్థుల ఫీజుల్ని మాఫీ చేయడానికి ఆ అర్భకులకు ఓట్లు ఎక్కడున్నాయి? 'ప్రజాసేవ అన్నది ఓట్లు ఉన్న వాళ్లకోసమే గానీ ఓట్లు లేనివాళ్ల కోసం కాదు!' అన్నది నాయక పండితాభిప్రాయం.

'ఉచిత' విద్యుత్తుతో సహా ప్రభువులు దేనినీ 'ఉచితం'గా ఇవ్వడం లేదు. వారి జనస్వామ్యమంతా 'ఇచ్చిపుచ్చుకునే' ధోరణితోనే సాగుతోంది! ఎన్నికల ముందు తప్ప మన అధికార పక్ష నేతలకు కారుణ్యం ఉండదా? అని ప్రశ్నించుకోవచ్చు. దానికి తిరుగులేని జవాబు ఉంది. 'ఎంత దయో దోషులపై' అనే విమర్శ నేతల మీద ఉంది. వారి మీద ఎన్ని మాఫీలు చేశారు. కబ్జాలు చేసి భూమాతను 'అడుగు' అడుగునా సేవించుకున్న మహా 'పరుషులకు' ఎన్ని మాఫీలు ప్రసాదించలేదు? చెబితే శానా ఉంది, వింటే ఇంకా ఉంది అనిపించేంత 'వీర' గాథలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టుల్లో 'పారుతున్న' అవినీతి గలగలల విషయంలో ఎందరి తప్పులు మాఫీ కాలేదు! ఎన్నికల ముందు జనం నాయకులకు దేవతల్లాగా కనిపిస్తారు. తీరా ఆ ముచ్చట తీరాక నాయకులు జనానికి దేవతల్లాగా కనబడతారు. ఎంత ఓటుకు అంత గాలి! దేవుడికి నైవేద్యం పెడతాం. దాన్నేమయినా దేవుడు తింటున్నాడా? అలాగే ప్రజాస్వామ్య దేవతలకు నైవేద్యం పెట్టింది ఎన్నికలయ్యాక దానంతట అదే తిరిగి వస్తుంది! రుణాల మాఫీ చేసిన నాయకులు జనం నుంచి ఏమి కోరుకుంటున్నారన్నదే ప్రశ్న. రుణాల మాఫీ చేసి నాయకులు కోరుకునేది తమ 'దారుణాల మాఫీ'! హరియను రెండక్షరములు పాపాలను హరియించినా, హరియించపోయినా, మాఫీ అను రెండక్షరాలు తమ పాపాలను హరియిస్తాయన్నది మన నాయకుల నమ్మకం. ఎవరి నమ్మకానికి ఎంత అమ్మకం ఉందో రాగల ఎన్నికలకే ఎరుక!

రుణం లేకపోతే మాఫీ చేయలేం. మాఫీ చేయకపోతే ప్రజాసేవలేదు! అందువల్ల ప్రజాస్వామ్యానికి మూలం రుణమే అని ఏ గిరీశం అన్నా కాదనగలమా?

(Eenadu, 19:03:2008)

Labels:

Wednesday, March 19, 2008

ఫన్‌కర్‌ ఫటాఫట్‌



* నేను ఒక అమ్మాయిని ప్రేమించే పెళ్లి చేసుకున్నా. అయినా ఇద్దరి ఐడియాలూ కలవడం లేదు. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. పరిష్కారం చెప్పి పుణ్యం కట్టుకోండి.

అదేం పెద్ద సమస్య? ఇద్దరి సెల్‌ఫోన్లకూ ఐడియా కనెక్షన్లు తీసుకోండి. ఐడియాలు అవే కలుస్తాయి.
________________________________
* ఎంసెట్‌లాగా బీసెట్‌ పెట్టి అందులో ఉత్తీర్ణులైన వాళ్లనే వ్యాపారం చేయడానికి అనుమతిస్తే?

ఉత్తీర్ణులైన వాళ్లు ఏం'సెట్టు'లే హలా అంటారు. కానివాళ్లు 'ఎంట్రన్సు'లోనే ఆగిపోయి ఎంత'సెట్టు'కు అంత 'ధూళి' అని పాడుకోవాల్సిందే.
________________________________
*స్టాక్‌తత్వం ఒక్కముక్కలో చెప్పండి?

అంతా 'జోక్‌'!
________________________________
* బడా పారిశ్రామికవేత్తకైనా, రాజకీయ నాయకుడికైనా అవసరమైనవి?

'కోట్లు...' వరించడానికైనా, ధరించడానికైనా.
________________________________
* రామాయణంలోనూ, భారతంలోనూ వ్యాపారం ఉందా?

అప్పుడుందో, లేదో తెలీదు గాని, ఇప్పుడు మాత్రం రామాయణం మీద, భారతం మీద బోలెడంత వ్యాపారం జరుగుతోంది.
________________________________
* కల నిజం కావాలంటే ఏంచేయాలి?

పగలు నిద్రపోకుండా ఉంటే సరి.
________________________________
* కచ్చితంగా మరో జన్మ ఉండాలంటే ఏంచేయాలి?

ఇచ్చినవాడి దగ్గరల్లా అప్పులు చేసేయాలి. రుణాలు తీర్చుకోవడానికైనా వాడు మళ్లీ పుట్టాలని అప్పులవాళ్లు సామూహిక ప్రార్థనలు చేస్తారు.
_______________________________
*మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్లింది. దాని ప్రభావం ఏమైనా ఉంటుందా?

బహుశా స్టాక్‌ మార్కెట్‌ పడిపోవచ్చు (ఈమధ్య ఎక్కడేం జరిగినా పడిపోతున్నది షేర్ల ధరలే కదా!)
_______________________________
* లక్షకారు లక్షణంగా ఉంటుందంటారా?

కొనేవాడు కోటీశ్వరుడైతే!
_____________________________

(Eenadu, 10:02:2008)
===============================

Labels:

Monday, March 17, 2008

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

కల్లోకి షేర్‌ వస్తే?

ఇప్పటి పరిస్థితుల్లో ఎంతటివాళ్లయినా కళ్లు తిరిగి 'బేర్‌'మనాల్సిందే.
_____________________________
అవినీతికి పౌష్ఠికాహారం...?

గడ్డి
_____________________________
తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవంటారు కదా! మరి మీరేమంటారు?

కుందేళ్ల మాటేమోగాని, మన స్టాక్‌ మార్కెట్‌ మాత్రం కచ్చితంగా బెదురుతుంది.
_____________________________
ఆమధ్య ఓ సినీనటుడి పెళ్లి జరిగింది. పెద్దలంతా ఆశీర్వదిస్తూంటే బిత్తరపోవడం పెళ్లికొడుకు వంతైంది. ఎందుకంటారు?
మీ పెళ్లి చిత్రం కూడా శతదినోత్సవం జరుపుకోవాలని ఆశీర్వదించడమే అందుకు కారణమై ఉండొచ్చునేమో!
_______________________________
ఏదైనా పార్టీ ఉచిత విద్యుత్తు, ఇంటికో ఉచిత ఉద్యోగం ఇస్తే...?

అబ్బెబ్బే ఉచిత ఉద్యోగం ఇస్తే లాభం లేదు. 'ఉచిత జీతాలు' పథకం ప్రవేశపెడితేనే అందరినీ ఆకట్టుకోవచ్చు.
_________________________________
రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పదంటారు, నిజమేనా?

రామేశ్వరం వెళ్లి కనుక్కుంటే గానీ చెప్పలేను.
_________________________________
పేదలు కూడా మినరల్‌ వాటర్‌ కొనుక్కోవాలంటే ఏం చేయాలి?

అది మన చేతుల్లో లేదు. నాయకులు తలచుకోవాల్సిందే. ఎందుకంటే నదులన్నిటినీ కబ్జా చేసి ప్లాట్లు చేయగల శక్తి వారికే కదా ఉంది.
________________________________
అబ్బాయికైతే పాకెట్‌ మనీ, మరి అమ్మాయికైతే?

పర్స్‌ మనీ
__________________________________
పర్సులో ఏముంది? నీ మనసులో ఏముంది? అంటే ఏమంటారు?

ఇంకా నయం. మనసులో ఏముంది? అంతా నీ పర్సులోనే ఉంది అనలేదు.
__________________________________


దిష్టి బొమ్మలకు బాగా గిరాకీ ఉంది.ట్రాక్టర్లకొద్దీ గడ్డి తీసుకొచ్చి దిష్టిబొమ్మలు చేయిస్తాను. అవన్నీ అమ్ముడు పోవాలంటే?


నానా 'గడ్డి' తినాలి.
___________________________________
మనదేశంలో పేదవాడు మరింత పేదవాడు కావడానికి కారణం?

'రాజకీయం' తెలియకపోవడం.
____________________________________
మావాడొకడు సినిమా ఫీల్డులో ఉన్నాడు. బాగా సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. అతడికి మీరిచ్చే సలహా!

మేకప్‌తో నటిస్తే ఏం లాభం, ఎంత లాభం? మేకప్‌ తీసి నటిస్తేనే కదా మజా!
_____________________________________
(Eenadu, 27:01:2008)
_____________________________________

Labels:

Friday, March 14, 2008

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

*ధరలతో ధరణి దద్దరిల్లితే వ్యాపారులు ఏం చేస్తారు?

ఆకాశానికి నిచ్చెనలేస్తారు.
____________________________
* మా కంపెనీ కారును కొన్నారంటే నెల పాటు పెట్రో కార్డు ఉచితం అనే స్కీమును ప్రవేశపెడితే ఖాతాదారులు ఏమనుకుంటారు?

పెట్రోలు కొనగలిగితే కారు ఫ్రీ అనే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు.
____________________________
* లక్ష కారు కొనవలసిందేనని ఇంటావిడ పట్టుపడితే, ఇష్టం లేని ఇంటాయన ఏం చేస్తాడు?

భార్యవన్నీ 'కారుకూతలు' అని కొట్టేస్తాడు.
_______________________________
* రిలయన్స్‌ పవర్‌ షేర్‌ కనీసం రెండు రెట్లు ఎక్కువ ధరకు లిస్ట్‌ అవుతుందని బెట్టు కట్టాను. మీ సలహా..?

'బెట్టు'కుపోయి దెబ్బతింటే కష్టం. మీ 'షేరు' మీరు సునాయాసంగా పొందండి చాలు.
________________________________

* పూరీలు, చపాతీలు, ఇడ్లీలు.. గుండ్రంగానే ఎందుకుంటాయి?

'గుండు' చేసేవన్నీ గుండ్రంగా ఉంటాయని చెప్పడానికి.
_____________________________
* చెట్టు కింద కూర్చొని కన్ను కొడితే?

ఏమీ కాదు. 'పళ్లు' రాలవు.
______________________________
ప్ర: ఆశబోతు వ్యాపారి ఎన్నికల్లో నిలబడితే?

డిపాజిట్‌ను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తాడు.
____________________________
* కదిలే భూమి కదలనట్లు, కదలని సూర్యుడు కదులుతున్నట్లు అనిపిస్తోంది. ఇదేం రివర్స్‌ గేరండీ? నా వ్యాపారంలో ఏమవుతుందంటారు?

మీకు వ్యాపారంలో నష్టాలు వచ్చినా ఇబ్బంది లేదు.. లాభాలు వచ్చినట్టు అనిపిస్తుంది లెండి.
____________________________
* దొంగలంతా కలిసి వ్యాపారం చేస్తే?

'పగలు' కూడా పని చేయక తప్పదు.
____________________________
(Eenadu, 20;01:2008)
_____________________________
____________________________________

Labels:

Thursday, March 13, 2008

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* వీఆర్‌ఎస్‌ ముందు నా కాపురానికి నేనే కార్పొరేటర్‌ని. కాని, ఇప్పుడు నాది కింద చెయ్యి అయిపోయింది. గుండె ఆగిపోతే బాగుండననిపిస్తోంది.

మిమ్మల్ని మీరు కార్పొరేటర్‌ అనుకున్నారు. అంతవరకు ఫర్వాలేదు కాని, ఈ వరసలో ఇతరుల్ని మేయర్‌ అంటారేమో? విష్ణుమూర్తి అంతటివాడే చేయి కింద పెట్టి ఇచ్చినవాణ్ని 'బలి' తీసుకున్నాడు. ఇదే సూక్ష్మంలో వ్యాపార మోక్షం.
__________________________________
* నేను నీతిగా వ్యాపారం చేస్తున్నా, కొందరు రౌడీలు వచ్చి మామూళ్లకోసం వేధిస్తున్నారు. వాళ్ల వ్యవహారం గురించి మీరేమంటారు?

రౌడీలకు అది 'మామూలే'. బందీగా పట్టుబడితే తప్ప ఇబ్బందిలేని, పెట్టుబడిలేని వ్యాపారమది.
___________________________________
* రాజకీయాలతో వ్యాపారం చేద్దామనుకుంటున్నా. ఏ రంగు చొక్కా వేసుకుంటే మేలు?

ఏ ఒక్క రంగు చొక్కాయో వేసుకుంటే పెద్దగా లాభం ఉండదు. సమయానుకూలంగా 'రంగులు' మార్చాలి. పొద్దున్నే 'వూసరవెల్లీ! నిన్ను దలంచి...' అని పద్యం పాడుకోవాలి.
___________________________________

* అంబానీలు, మిట్టల్స్‌, టాటాలు, బిర్లాలు... వీళ్లంతా ప్రపంచ శ్రీమంతులనే సవాలు చేస్తున్నారు. మరి మన దేశంలో పేదల సంగతో?

మన దేశంలోని పేదలూ ఇతర దేశాల పేదలతో పోటీపడుతున్నారుగా. వారికన్నా పై చెయ్యిగా ఉంటున్నారు.
___________________________________
* వ్యాపారానికి మదుపు ముఖ్యమంటారు. మరి పొదుపు చేయాలంటే ఏం చేయాలి?

ఖర్చులపై అదుపు
___________________________________
* న్యూ ఇయర్‌ రోజున నామిత్రుడ్ని మందు పార్టీ అడిగితే, ఏ 'మందు' కావాలో తీసుకో అంటూ మెడికల్‌ షాపునకు తీసుకెళ్లాడు. మీరేమంటారు?

ఏ'మందు'ను? నేనేమందును??
'మందు' ఎక్కువైతే మనిషి పలచనవుతాడు అని తెలిసే చేసి ఉంటాడు. అంతేకాదు, 'మందు' ఎక్కువైనా చివరికి అవసరమయ్యేది 'మందే'నన్న విషయం తెలిసిన జ్ఞాని మీ మిత్రుడు.
__________________________________
* కొంతమంది క్రికెటర్లు ఆటలో రాణించకుండా వాణిజ్య ప్రకటనల్లో రాణిస్తున్నారు. ఏమంటారు?

ఏదో రకంగా క్రికెట్‌ 'యాడ్‌'కొంటున్నారులే అంటాను.
__________________________________
* వ్యాపార విజయ రహస్యం?
కుడి చేత్తో పుచ్చుకోవాలి. ఎడమ చేత్తో ఇవ్వాలి.
__________________________________
* 'పులి'రాజు ఎవరు?

'షేర్‌' మార్కెట్‌
__________________________________
* వ్యాపారానికి, రాజకీయానికి తేడా?

దాచుకోవడానికి, దోచుకోవడానికి ఉన్నంత
__________________________________
* బిజినెస్‌ పార్టనరే లైఫ్‌ పార్టనర్‌ అయితే?

ఇంటా బయటా బిజీబిజీ, అంతా గజిబిజి
__________________________________
* నెహ్రూ కుటుంబీకుల జాబితా పేర్లు అన్నీ అయిపోయిన తర్వాత వైఎస్సార్‌ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎవరి పేర్లు పెడతారు?

రెండో 'వరస' మొదలవుతుంది. ఎందరో 'గాంధీ'లు అందరికీ పథకాలు అన్నది గొప్ప 'పథకం'.
(Eenadu,13:01:2008)
____________________________________

Labels:

Thursday, February 21, 2008

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

*కరెన్సీ నోటు మీద కూడా వాణిజ్య ప్రకటనలు ముద్రిస్తే?
చిదంబరానికి ఓ లెటరు రాయరాదూ...! ఆయనకు ఖజానా, మీకు జేబూ నిండుతాయి(వారిచ్చే పారితోషికంతో).
-----------------------------------
* ముకేశ్‌ అంబానీ తన పదవిని మీకిచ్చాడనుకోండి... మీరెలా ఫీలవుతారు?
నేను 'ఫీల్‌' అవడానికి ఏముంది? ఆ తర్వాత ఆయనే 'ఫీల్‌' అవ్వాల్సి వస్తుంది.
---------------------------------
* ఉదయం రూ.10 డిపాజిట్‌ చేస్తే సాయంత్రానికి రూ.1,000 ఇచ్చే పెట్టుబడి ఉంటుందా?
దాని సంగతి తెలియదు గాని, మీ ఇంటావిడకి పొద్దున్న ఓ రూ.1000 ఇచ్చి చూడండి. సాయంత్రానికి అది రూ.10 అవ్వకపోతే నామీద ఒట్టే.
-----------------------------------

* ఎవరైనా మిమ్మల్ని చూసి 'టాటా' అంటే?
నేను మాత్రం వెనక్కి తగ్గుతానా? వాళ్లను చూసి 'బిర్లా' అంటాను.
-----------------------------------
* నా స్నేహితుడు ఓ 'కడుపు మండే' రోగి. అతగాడికి 'రాజీవ్‌ ఆరోగ్యశ్రీ' రావాలంటే?
'మండే'నాడు ప్రయత్నించాలి.
-----------------------------------
* జేబు నిండితే ఆనందం ఎక్కువ కలుగుతుందా? కడుపు నిండితే ఆనందం ఎక్కువ కలుగుతుందా?
ఈ రెండూ కాదు. ఎదుటివాళ్ల జేబూ, కడుపూ ఖాళీగా ఉంటే సంతోషించే జనాలున్నప్పుడు.
------------------------------------
* చెవిటివాడి ఇంటికి అదృష్ట లక్ష్మి వచ్చి తలుపు తడితే... ఆయన ఏమంటాడు?
తను చెప్పిందే వినమంటాడు.
-----------------------------------
* వ్యాపారం అభివృద్ధి కావాలంటే ప్రతిభ అవసరమా?
'పర్సెంటేజీ'లు ఇచ్చే ప్రతిభ ఉండాలి.
----------------------------------
* ఏమి చదువుకుంటే పైకొస్తాను?
స్కామాయణం చదివితే సరి. ఆటోమేటిగ్గా పైకొచ్చేయొచ్చు.
__________________________________
(Eenadu, 06:01:2008)

Labels:

Saturday, January 19, 2008

అవినీతి-రాజనీతి

- శంకరనారాయణ

''కామిగాక మోక్షగామియు కాడయా విశ్వదాభిరామ వినురవేమ!'' అన్న వేమన్న 'అవినీతిపరుడుగాక నీతిపరుడు కాలేడయా' అన్న ఒక్క ముక్క గనక అని ఉంటే మన పాలకులు ఆయనకు (సంస్కరణ) బ్రహ్మరథం పట్టి ఉండేవాళ్లు. వూరూరా ఆయనకు గుళ్లూ గోపురాలు కట్టించేవాళ్లు. 'చెక్కు' భజనలు చేసేవాళ్లు. అయితే, అంత 'అదృష్టం' వేమనకు దక్కలేదు. అయినా మన నాయకులు వేమన చెప్పిన మాటను కాస్త మార్చి 'తినగ' తినగ 'స్కాము' తీయనుండు అంటున్నారు. ఎప్పటికప్పుడు 'అవినీతి బ్రహ్మోత్సవాలు' జరిపిస్తూ 'ఆదర్శం'లోకి 'అడుగు'వేస్తున్నారు.

ఇందుకు గిరీశమే స్ఫూర్తి. ''యిన్ఫెంట్‌ మారేజీలు అయితేనేగాని, యంగ్‌విడోజ్‌ వుండరు. విడోజ్‌ వుంటేనేగాని విడో మారియేజ్‌ రిఫారమ్‌కి అవకాశం వుండదు గదా! సివిలిజేషన్కల్లా నిగ్గు విడోమారియేజ్‌ అయినప్పుడు, యిన్ఫెంట్‌ మారేజీల్లేకపోతే సివిలిజేషన్‌ హాల్టవుతుంది. మరి ముందుకు అడుగుపెట్టలేదు. గనక తప్పకుండా యిన్ఫెంట్‌ మారియేజ్‌ చేయవలసిందే'' అంటాడు గిరీశం. ఆ లెక్కన అవినీతే లేకపోతే అవినీతి నిర్మూలన ఎలా జరుగుతుంది? 'తిన్నది' ఎలా అరుగుతుంది? తక్కువ 'తిన్న'వారెవరూ ఉండకూడదన్న సదాశయంతో 'చేతి'కి ఎముకలేకుండా 'సంత'ర్పణలు సాగుతున్నాయి.

వనభోజనాలు ఒక్క కార్తీకమాసంలోనే జరిగితే ఎవరైనా ఎంత తినగలరు? అందుకే మహానాయకుల చేతి చలువతో ఏడాదిలో అన్ని మాసాల్లోనూ, అన్ని మోసాల్లోనూ 'ధన భోజనాలు' పుష్కలంగా జరుగుతున్నాయి. 'జేబు నిండా డబ్బు... కంటినిండా నిద్ర' అనేది 'నోటికి నోరు శాతం' అమలు అయిపోతున్నది!

అలాగని, మాంసం తిన్నంతమాత్రాన ఎముకలు మెళ్లో వేసుకోవాలని ఎక్కడన్నా ఉందా? ముడుపులు ముట్టినంతమాత్రాన మాటల్లోనూ మడి కట్టుకోకూడదని ఎవడు చెప్పాడు? అందువల్ల 'నేత' బీరకాయలు, 'నీతి బీరకాయలు' బ్రహ్మాండంగా పుట్టుకొస్తున్నాయి.

'అవినీతి అంతర్జాతీయ సమస్య' అని ఇందిరమ్మే చెప్పారు. అప్పటికన్నా ఇందిరమ్మరాజ్యం ఇప్పుడే ఎక్కువ వెలిగిపోతోంది! 'తిన్నవాడికి తిన్నంత మహాదేవా!' అంటున్నారు. అయినా 'సంత'ర్జాతీయ సమస్యలను ఎవరేం చేయగలరు? ధృతరాష్ట్ర పాలకుల్లా చూస్తూ ఊరుకోవలసిందేనంటే ఎంత అవమానకరం!

ఎన్నో సమస్యలను పరిష్కరించిన గిరీశమే ఇందులోనూ పాలకులకు ఓ బాట చూపించాడు! దాంతో ఏలినవారు 'నినద భీషణ శంఖము దేవదత్తమే' అంటున్నారు. అవినీతి కనబడితే తోలు వలిచేస్తాం అని బెదిరిస్తున్నారు. సర్వ'శిక్షా'భినయాలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శిస్తున్నారు.

''మంత్రాలకు చింతకాయలు రాలతాయా? తిట్లకు అవినీతి మటుమాయమైపోతుందా?'' అని గిట్టనివాళ్లు అంటుంటే ఆ మాటలు 'చెవులూ'రించడం లేదు. 'ఎంతదాకానో ఎందుకు? మీ చుట్టుపక్కల, చుట్టపక్కాల అక్రమ సంపాదనకు పొగబెడితేచాలు అవినీతి దయ్యం దెబ్బకు పారిపోతుంద'ని ప్రతిపక్షాలవాళ్లు ఎద్దేవా చేస్తుంటే, 'దీపం చుట్టూ చీకటి ఉండడం సహజమేగా' అని అధికారపక్ష పౌరాణికులు 'అరికథలు' వినిపిస్తున్నారు. ఇది నిజమే. అవినీతి అంతం తాతలనాటి పతకం. 'అవినీతి సొంతం' ఇప్పటి నేతల పథకం. 'అవినీతి సొంతం' వల్ల తమకు చెడ్డపేరు వచ్చినా ఇతరులకు మంచి పేరు వస్తుంది. ఇదికూడా ప్రజాసేవే.

అధికారుల గోల అధికారులది. అవినీతి విషయంలో 'రాజ'నీతి చిత్రంగా ఉందని వారు వాపోతున్నారు. నేతల అవినీతిపై పెదవివిప్పని మారాజులు అధికారుల మీదికిమాత్రం ఒంటికాలిమీద లేస్తున్నారని, ఇదికూడా 'విభజించి పాలించు' సూత్రమేనని విమర్శిస్తున్నారు. నాయకుల ఆజ్ఞ లేకుండా ఫైలయినా కదులుతుందా? కళ్లు మూసుకుని ఫైళ్లమీద సంతకం పెట్టిననాడే ఈ విషయం గుర్తొచ్చి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? అని ప్రశ్నిస్తున్నారు. చివరికి 'బలి పశువులం మేమా?' అని నిలదీస్తున్నారు.

వీటి సంగతేమయినా ప్రభువుల 'విత్తశుద్ధి'ని శంకించడానికి వీల్లేదు. అవినీతిని సజీవంగా పట్టి ఇచ్చిన ఉద్యోగులకు 30 శాతం ప్రోత్సాహక వేతనాన్ని ఇస్తామని అధినాయకులు ఊరిస్తున్నారు. ఎంత జీతం ఇస్తేమాత్రం ఏం లాభం? అవినీతిని పట్టుకున్నవారు లంచం తీసుకున్నా దానిని వారు ఒప్పుకొంటే వదిలెయ్యాలంటూ చట్టం చేయాలని కొంతమంది 'నొక్కేసి' వక్కాణిస్తున్నారు. ఒక అవినీతిపరుణ్ని ఇంకో అవినీతిపరుడు మాత్రమే పట్టుకోగలడు కాబట్టే దొంగ చేతికే తాళాలిచ్చినట్టు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. పైగా 'అవినీతిపరులు ఎంతటివారయినా వదలొద్దు' అని సాక్షాత్తూ ప్రభుత్వాధినేతే చెబుతుంటే అవినీతిపరులయిన అధికారులు పులకించిపోతున్నారు. 'అందుకేగదా సార్‌! అవినీతిపరులు ఎంతటివారయినా, వారిని మేము వదలకుండా వాళ్లచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దక్షిణలు పుచ్చుకుంటున్నాం. అందువల్ల అవినీతిలో గుత్తాధిపత్యం తగ్గిపోయి వికేంద్రీకరణ జరుగుతుంది! అవినీతి పలచన కావడానికి మంది ఎక్కువ కావడమే కదా మార్గం'' అంటున్నారు.

ప్రభువులు గమనించని విషయం ఒకటుంది. అన్నిటికన్నా పారదర్శకతకు పెద్దపీట వేయడం ముఖ్యం. అవినీతి జరక్కపోతే దర్యాప్తు ఉండదు. దర్యాప్తు జరగకపోతే పారదర్శకత ఉండదు. కాబట్టి... అన్నీ తెలిసినవాళ్లకు ఇంతకుమించి ఏం చెప్పగలం?
(Eenadu, 04:01:2008)
________________________________

Labels:

Sunday, December 30, 2007

'మోడి'రాగం పాడుకుంటూ

- శంకరనారాయణ

'తన 'మత'మేదో తనది పర'మత'మసలే పడదోయ్‌' అంటూ కాంగ్రెస్‌ 'హస్త'సాముద్రికురాలు సోనియా గాంధీ గుజరాత్‌లో ఊరూవాడా తిరిగి భాజపా ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మీద దుమ్మెత్తిపోసినా ప్రయో'జనం' కలగలేదు. 'గాంధీ పుట్టిన రాష్ట్రమా ఇది' అని ప్రశ్నించినా కుదరలేదు. 'తోడి'రాగం పాడుకుంటూ జనం మోడీకే పట్టం కట్టారు. తమకు కాంగ్రెస్‌ మతం పడదని తేల్చిచెప్పారు. డొంక తిరుగుడు రాజకీయాలు తమ ఒంటికి పడవని చెప్పినట్టయింది. కమలములు 'ఓటు'బాసిన అనే పద్యం చదివినా, నరేంద్రది రెటమతం అని రెట్టించినా పప్పులుడకలేదు. నెహ్రూ కుటుంబానికి ఆటపట్టయిన ఉత్తరప్రదేశ్‌తోపాటు, గాంధీజీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రాహుల్‌గాంధీ 'చేతి'మీద కంగు తినిపించినట్టయింది. వంశపారంపర్యపాలన ముఖ్యం కాదు, అంశపారంపర్యపాలన ముఖ్యమన్నది 'జనసందేశ'మయింది! కాంగ్రెస్‌ పెద్దలు సతమతమయ్యారు. గుజరాత్‌లో గెలిచింది భాజపా కాదు, నరేంద్రమోడీ సాహసం అనేవాళ్లున్నారు. 'సాహసం శాయరా డింభకా, ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది' అని ఎవరో కలలో చెప్పి ఉంటారని కొంతమంది చమత్కరిస్తున్నారు.

''కుడి ఎడమైనా పొరపాటులేదోయ్‌ 'మోడి'పోలేదోయ్‌'' అని కమలదాసులు పాడుతుంటే కాంగ్రెస్‌ వాళ్లు 'మనకు అంతటి సాహసవీరుడు, వాగ్ధాటిగల నేతలేడు'గా అని 'పోస్టు'మార్టమ్‌ సమావేశంలో అనుకున్నారు. ఏంచేసినా గత'జన'హేతుబంధనమే. మోడిని కాంగ్రెస్‌ వాళ్లు కలుపుమొక్కగా వర్ణించినా, అభిమానులు 'కలుపుగోలు మనిషి'గా వర్ణిస్తారు. అందరినీ 'భాయ్‌ భాయ్‌'అని పలకరించే మోడీకి అసమ్మతినేత కేశూభాయ్‌ కూడా మినహాయింపుకాదని, మళ్లీ ముఖ్యమంత్రి అందలం అందుతున్న తరుణంలో ఆయన దగ్గరికి వెళ్లారని గుర్తుచేస్తారు.

'ఇంతింతై వటుడింతై' అనడానికి నరేంద్రమోడి నిదర్శనం. ఒకప్పుడు టీ తెచ్చి ఇచ్చే కుర్రాడిగా సుపరిచితుడైన మోడీ గుజరాత్‌ భాజపాలో సాటిలేని వాడయ్యాడు. ''అద్వానీకి శిష్యుడైన మోడి గురువును మించిన లేదా ముంచిన శిష్యుడవుతాడన్న మిత్రభేదం కథను కూడా కొందరు 'పెన్‌'గట్టుకుని సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో విజయభేరి మోగించాక నరేంద్రమోడి రెచ్చిపోయి ''ఢిల్లీ పీఠం పట్టుకుపోతాన్‌'' అంటారని అందువల్లనే అద్వానీని హడావుడిగా ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించారన్న ప్రచారమూ ఉంది''

విషయం విషయమే, వినయం వినయమే అన్నది నరేంద్రమోడీ సిద్ధాంతం. అతని గొప్పతనం వల్లనే గెలుపు వచ్చింది తప్ప భాజపా ఘనత ఏమీ లేదని మీడియా కోడై కూసేసరికి నరేంద్రమోడీ బాధపడ్డారు. కంట తడిపెట్టారు. ''పార్టీ తల్లివంటిది. బిడ్డ ఎంత గొప్పవాడైనా తల్లి కన్నా తక్కువే'' అనేశారు.

గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ విజయభేరి మోగించాక ఆ పార్టీ వాళ్లంతా 'పదండి ముందుకు' అంటుంటే నరేంద్రమోడి మాత్రం 'పదండి వెనక్కు' అనేశాడు. అలనాటి జనసంఘ్‌లో కార్యకర్తల త్యాగాన్ని కొనియాడారు. ''పార్టీ బ్రహ్మ; పార్టీ విష్ణు; పార్టీ దేవో మహేశ్వరః'' అన్నట్టు మాట్లాడారు. ఆయన 'సంఘం శరణం గచ్ఛామి' అన్నారంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గుర్తొస్తుంది తప్ప బౌద్ధమతం ఎవరికి గుర్తుకు రాదు. నరేంద్రమోడీ ఏ పాట పాడినా 'హిందూ'ళ రాగంలో పాడతాడు. హిందూ మతమే హితమన్నట్టు మాట్లాడుతుంటారు. చివరకు ప్రభుత్వోద్యోగి ఎవరయినా 'సిక్కు'లీవ్‌ పెట్టినా, సిక్కులీవ్‌ ఎందుకయ్యా 'హిందూలీవ్‌' పెట్టుకో అని నరేంద్ర మోడీ అంటారని గుజరాత్‌లో చమక్కులు వినిపిస్తుంటాయి. అటువంటి మోడీ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం వల్లిస్తుంటే విశ్వహిందూ పరిషత్‌, రా.స్వ.సే. సంఘ్‌ వంటివి కాస్త కినుక వహించాయి. ఎన్నో హిందూ మంత్రాలు ఉంటే అభివృద్ధి మంత్రం ఎందుకని బాధపడ్డాయి.

కాంగ్రెస్‌ పెద్దల తిట్లు దీవెనలని నరేంద్రమోడీ విశ్వాసం. ఒక్కో తిట్టూ అదనంగా ఒక్కో సీటు తెస్తుందనేది ఆయన విశ్వాసం. సోనియా 'మృత్యుబేహారులు' అని తిట్టేసరికి మోడీ లోలోపల నవ్వుకున్నారు. 'తినగ తినగ వేము తియ్యనగును, తిట్ట తిట్ట సీట్లు తెప్పలగును' అని అనుకున్నారు. అదే నిజమైంది. అమెరికా పెద్దల తిట్లు కూడా వరమే అయింది. వీసాను తిరస్కరించగానే గుజరాతీలందరిలో ఆయన మీద సానుభూతి ఏర్పడింది. రాజకీయాల్లో అనుకూలంగా ఉన్నవాళ్లవల్లనే నాయకులు బలపడతారనడానికి వీల్లేదు. వ్యతిరేకుల వల్ల కూడా బలపడతారు.

ఎంతయినా నరేంద్రమోడీకి మన రాష్ట్ర పాలకులకు ఉన్నన్ని, తెలివి తేటలు లేవు. తెలుగు రాజాలు ఎప్పుడూ లౌకికవాదం గురించి నొక్కి వక్కాణిస్తుంటారు. చిత్రమేమిటంటే తమది 'దేవుడి పాలన' అని పదే పదే అంటుంటారు. నరేంద్ర ఎప్పుడూ హిందూత్వం గురించి చెబుతుంటారు. అయినా తనది 'దేవుడి పాలన' అని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇంకో విషయం ఏమిటంటే నరేంద్ర మోడీ ప్రభావం భారతీయ జనతాపార్టీ వాళ్లమీద కన్నా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వాళ్ల మీద ఎక్కువగా ఉంది. నరేంద్రమోడీ అభివృద్ధి మంత్రం పఠించి గెలిచారు కాబట్టి మేమూ అభివృద్ధి పఠిస్తామని ఇక్కడి కాంగ్రెస్‌ ఘనాపాఠీలు చెప్పుకొంటున్నారు. 'వాతలు' పెట్టుకుంటే రాతలు మారతాయా? కరీంనగర్‌ గుణపాఠం మరచిపోయారా? అని ఎవరన్నా వెక్కిరించినా వారికి వినిపించదు గాక వినిపించదు.
(Eenadu, 29:12:2007)
_____________________________

Labels:

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

*నేను పట్టిందల్లా బంగారం కావాలంటే?
బంగారం దుకాణం పెట్టేయడమే.
___________________________
*కొండమీది కోతి దిగిరావాలంటే ఏం చేయాలి?
ముందు మనం కొండ మీది కెక్కాలి. మన పోటీ తట్టుకోలేక దానంతటదే దిగివస్తుంది.
______________________________
* తొలి కాన్పులోనే అమ్మాయి పుట్టిన దంపతులకు మీరిచ్చే ఉచిత 'ఆర్థిక' సలహా?
'లక్ష్మీ' ప్రసన్నమయిందనుకుంటే సరి...! రావలసిన డబ్బు చేతికి రాకున్నా దిగులు ఉండదు.
_________________________________
* రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు ఎందుకు దోచుకుంటున్నారు?
అదేమిటండీ వాళ్లను అలా అంటారు. రాష్ట్రమైనా, దేశమైనా అంతా 'మనదే' అనుకునే బోళా మనసు వాళ్లది.
__________________________________
* కుక్కను తన్నితే డబ్బులు రాల్తాయంటారు గదా పెద్దలు... ఎంత తన్నినా రాలడం లేదేమిటండీ?
డబ్బు రాలేమాట నిజమే... కానీ, మీకు కాదు డాక్టరుకు! ఎందుకైనా మంచిది పిచ్చికుక్కను మాత్రం తన్నకండి.
___________________________________
* రాజకీయాల్లో వెన్నుపోటు... మరి వ్యాపారాల్లో?
పన్నుపోటు
__________________________________
* మా వాడొకడు రకరకాల వ్యాపారాలు పెట్టి, ఆడవాళ్లను భాగస్వాములుగా చేసుకొని వాళ్లను బుట్టలో వేసుకోవాలని చూస్తుంటాడు. వాడికి మీరిచ్చే సలహా!
భాగస్వామ్యం మంచిది కాని 'భోగ'స్వామ్యం కొంప ముంచుతుందని!
_______________________________
* కాంటాక్టులు పెంచుకుంటే?
'కాంట్రాక్టులు' గ్యారంటీ.
__________________________________
* సినీ హీరోయిన్లు ఎక్కువగా వ్యాపారవేత్తలనే ఎందుకు ప్రేమించి, పెళ్లాడతారు?
'నటించే'వాళ్లను చూసి విసుగెత్తిపోయి.
___________________________
(Eenadu, 23:12:2007)
___________________________________

Labels:

Tuesday, December 25, 2007

మందూ ముచ్చటా

- శంభు
'ముందుగతి కానవే చిలుకా!' అన్నతత్వం ఒంటపడితే సాధించేదేమిటి? స్వర్గమేగా! ఆ స్వర్గం మాత్రం చెబుతున్నదేమిటి? మందుగతి కానవే చిలుకా అనేగా! సురాపానం లేకపోతే స్వర్గమేముంది? దేవతలు ప్రసన్నమయ్యే మార్గమేముంది? అందువల్ల దేవుడి పాలన అని చెప్పుకొంటున్న ప్రభువులు 'మద్యఛందస్సులను' ఎంచుకున్నారు. ఖజానాకు 'మందోబస్తు' చేసుకుంటున్నారు. ఎవరు 'బెల్టు' బిగిస్తున్నా రాష్ట్ర పాలకులు పట్టించుకోవడంలేదు. ఎక్కడ ఆడవాళ్లను గౌరవిస్తే అక్కడ దేవతలుంటారన్నది చాదస్తం. మహిళలను గౌరవించడానికి ఎలాగూ ఆర్టీసీ బస్సులున్నాయి. అందులో ముందు మూడు సీట్లు వారికి కేటాయించారు. ఆ సంగతి ఎలాగూ ఎమ్మెస్సార్‌ సారు చూసుకుంటారు. ఎక్కడ మందు ఏరులై పారుతుందో అక్కడ దేవతలు కచ్చితంగా తిష్ఠవేస్తారు. అంతకన్నా ఏ ప్రభుత్వానికైనా ప్రతిష్ఠ ఏముంది? అందుకే ఏలినవారు 'తాగుడు' మూతలు ఆడుతున్నారు. మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ఖజానా గలగలలు వినిపిస్తున్నాయంటున్నారు. అదే 'మందడుగు' అంటున్నారు. ఎన్నికలనాడయినా ఎవరూ తాగకపోతే మన ప్రజాస్వామ్యం గతి ఏమైపోతుంది?
'మందు'గిస్తూ
ముందుకడుగెయ్‌
వెనకబడితే
వెనకేనోయ్‌ -
అని నాయకులు ప్రోత్సహించేది అందుకేగా! 'మందుదాతా! సుఖీభవ' అనుకుంటూ వారికి ఎంతోమంది 'జిన్‌'దాబాద్‌ అంటున్నారు.

మొరార్జీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో మహాకవి శ్రీశ్రీని ఎవరో ''మూత్రంతాగితే వంద సంవత్సరాలు బతకొచ్చని మొరార్జీదేశాయ్‌ అంటున్నారు. మీరేమంటారు?'' అని అడిగితే ''మూత్రం తాగి బతకడం కన్నా మద్యం తాగి చావడం మంచిది'' అని 'చెమ్మ'త్కరించారట! మందుబాబుల కళ్లు 'చెమ్మ'గిల్లేమాట ఇది!! ఈ మాట విన్నతర్వాత మద్యం అంటే ద్రవమే తప్ప ఉపద్రవమని చెబితే పాలకులు వింటారా? అందుకే ప్రాణాలను రక్షించే'మందు' అన్నమాట మద్యానికి పర్యాయపదమైపోయింది. నలుగురు తాగి దెబ్బతింటేకదా ఆసుపత్రులూ, వైద్యులూ బాగుపడేది! లక్షలు పెట్టి 'తెల్లకోటు' సంపాదించుకున్నందుకు డాక్టర్‌రాజ్యం వారికిచ్చే వరమిది అనుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు. ఇంత మతలబు ఉండబట్టే పరిపాలన 'మందు'కొడిగ సాగుతోంది!

జనంలో ఈ మాత్రమైనా నీతి బతికి ఉన్నదంటే అందుకు కారణం తాగుడే. 'తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాదన్నా' అనే పాట ఉంది. అదే పాలకుల బాట!

నిందితుల చేత నిజం కక్కించడానికి లైడిటెక్టర్లు ఎందుకు? మందు సీసా చేతికిస్తే ముందు వచ్చేది నిజమే. దర్యాప్తులో పోలీసులకు దండోపాయం అవసరమే ఉండదు! 'బాటిల్‌ఫీల్డు' బ్యాటిల్‌ఫీల్డుగా కనిపిస్తుంది. ఒక పండితుడి కష్టం ఇంకో పండితుడికి గానీ అర్థంకాదంటారు. ఇది పచ్చి అబద్ధం. ఒక పండితుడికి ఇంకో పండితుడికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. కానీ ఒక మందుప్రియుడి బాధను ఇంకో మందుప్రియుడు అర్థం చేసుకోగలడు. అందుకే పద్యపరిశ్రమ ముసిముసినవ్వులతో 'పెగ్గు'లొలకబోస్తుంది. 'బుడ్డి'మంతులు పెరిగే కొద్దీ కొత్తఅందాలను చిందిస్తుంది.

'కదిలేదీ కదిలించేదీ కవిత్వం' అనేదీ అబద్ధమే. మహా అయితే కవిత్వం జనాన్ని సభల్లోంచి బయటికి కదిలిస్తుందేతప్ప, అంతకుమించి సాధించేది లేదు. నిజానికి కదిలేదీ కదిలించేదీ మద్యమే. చిక్కని చుక్క గొంతులో పడిందంటే 'చుక్కలే హద్దు' అనిపిస్తుంది. కనిపించినవాడినల్లా 'విస్కి'ంచాలనిపిస్తుంది! మహాభారతం నుంచి ఎంకిపాటల వరకు అన్నీ కంఠస్థమైపోతాయి. అన్నీ రాగయుక్తంగా బయటపడతాయి. మద్యప్రియుడికి సొంతరాజ్యాంగం తయారవుతుంది. సరికొత్త వాక్‌స్వాతంత్య్రం వస్తుంది. కట్టుకున్న పెళ్లాం ముందు కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. నిజంగా కుండలు బద్దలు కొట్టేస్తాడు. దాంతో భరతనాట్యం, కూచిపూడి, క్యాబరే వంటి డ్యాన్సులన్నీ మద్యప్రియుల అడుగులకు మడుగులొత్తుతాయి. అందువల్లనే పల్లెలకు పల్లెలు తాగుతున్నాయి. తూగుతున్నాయి.

పిచ్చిమహాత్ముడు గాంధీజీ 'కల్లుమానండోయ్‌ బాబూ కళ్లు తెరవండోయ్‌' అన్నాడు. అందులో ప్రజాసేవ ఏముంది? ఆయన వారసులు 'కల్లు తాగండోయ్‌ బాబూ కళ్లు మూయండోయ్‌' అంటున్నారు. ఇందులో ప్రజాసేవ ఉంది.
'తాగితే మరిచిపోగలను
కష్టసుఖాలను
తాగనివ్వరు' -
అని మద్యనిషేధం రోజుల్లో ఎంతమంది మందుబాబులు బాధపడ్డారు? మీచేత తాగించి మీ కష్టాలను మాన్పిస్తున్నాం, అంతకన్నా మీకేం కావాలని ప్రభువులు వూరిస్తుంటే-
'ఔను నిజం ఔను నిజం
మీరన్నది నిజం నిజం'
అంటున్నారు. అంతా పాత గాంధీ చెప్పినట్టే జరిగితే- కొత్త గాంధీలు ఎందుకసలు?

గాంధీజీ ఖద్దరు కట్టమన్నాడు. వీళ్లు అక్కర్లేదంటున్నారు. గాంధీజీ మద్యం తాగొద్దన్నాడు. తాగితే తప్పేముంది అంటున్నారు కొత్తగాంధీలు. టోపీ పెట్టుకోవయ్యా అన్నాడు పాతగాంధీ. 'టోపీ నీవు పెట్టుకోకు ఇతరులకు పెట్టు' అన్నది కొత్తగాంధీల అంతరంగం.

'తాగేవాడే కడతాడు తాళ్లపన్ను!' అన్నది సామెత. తాగనివాళ్లకోసం తాగేవాళ్లు ఎంత కష్టపడుతున్నారో తలచుకుంటే త్యాగాల 'సారా'ంశం బోధపడుతుంది!
'షరాయి వీడిపోతున్నా
తాను వైస్రాయిననుకుంటాడు
తాగుబోతు' -
అని ఒక కవి రాశాడు.
ఎన్ని ఉపనిషత్తులైనా 'మందోపనిషత్తు' ముందు బలాదూరే! తాగుబోతు ప్రత్యేకత అటువంటిది. ''మగువ పొలుపు దెలుపు నొక్క మారుతమొలసెన్‌'' అని మనుచరిత్రలో రాసి అల్లసాని పెద్దన మురిసిపోయాడు. వాసనామయ ప్రపంచాన్ని గురించి అద్భుతంగా రాశానని అనుకున్నాడు. దాందేముంది? మందు కొట్టివస్తుంటే అతగాడి జాడ ఎవరూ చెప్పనక్కరలేదు. అతగాడినుంచి వచ్చే 'పరిమళమే' జీవిత కథను 'రస'వత్తరంగా చెబుతుంది.
పదండి 'మందు'కు
పదండి తోసుకు
పోదాం పోదాం
పైపైకి'
అంటూ ముందుకు తోస్తుంది. ద్రవప్రస్థానం రుచిచూపిస్తుంది.
(Enadu.25:12:2007)
-----------------------------------------------------

Labels:

Saturday, December 22, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌


* రాజకీయాలకు, వ్యాపారానికి తేడా ఏమిటి?

'తాళం' వేస్తేగానీ రాజకీయాల్లో రాణించలేరు. 'తాళం' తీస్తే గానీ వ్యాపారంలో రాణించలేరు.
____________________________

* మా ఫ్రెండ్‌ది షేర్ల వ్యాపారం. దానికి తగ్గట్టే తన కూతురుకి లావా'దేవీ' అని పేరు పెట్టాడు. కొడుకు పుడితే ఏ పేరు పెట్టాలంటారు?


మార్‌'కేటు' అని పెడితే సరి.
_______________________________

* అప్పిచ్చువాడు వైద్యుడయితే అప్పు తీసుకునేవాడు?

రోగి. ఎందుకంటే డాక్టరుకి బిల్లు కట్టాక అతని వద్ద ఏం మిగులుతుంది కనుక!
_____________________________

* నేను వ్యాపారం చేస్తుంటాను. చిత్రమేమిటంటే షాపులోకి వెళ్లగానే నాకు నిద్ర ముంచుకొస్తుంది. తెలిసిన వాళ్లంతా నవ్వుతున్నారు. నాకు మీ సలహా కావాలి.

ఎంత సంపాదించినా కంటికి నిద్రపట్టని వాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వాళ్లతో పోల్చుకుంటే మీరు ఎంతో అదృష్టవంతులు. ఎటొచ్చీ మీరు గుండె మీద కాక జేబు మీద చెయ్యి వేసుకుని నిద్రపోండి.
____________________________

* పెళ్లి అనే వ్యాపారానికి ప్రేమ పెట్టుబడి అంటాను. మీరేమంటారు?

పిల్లలు లాభనష్టాలు అంటాను.
_____________________________

* నాకు ఓ వైన్‌ షాపు ఉంది. తమాషా ఏమిటంటే అందరిచేత తప్ప తాగిస్తాను తప్ప నేను తాగను. నేను రాజకీయాల్లో చేరాలనుకుంటున్నాను. మీ సలహా?

రాజకీయాల్లో చేరాక కూడా మీరు ఇదే విధానాన్ని అవలంబిస్తారు. ఇతరులతో తప్పులు చేయిస్తారు తప్ప.. మీరు చేయరు.
____________________________

* మావారు బైక్‌ నడపనంటున్నారు. ఏం చేయమంటారు?

'నడిపేది మీరయినా, నడిపించేది నేనే' అని గట్టిగా చెప్పండి. ఆ తర్వాత బండి దానంతట అదే నడుస్తుంది.
____________________________

* కాజోల్‌ కళ్లు, కరెంటు బిల్లు. ఈ రెంటికీ ఉన్న పోలిక?

రెండూ జేబు కొట్టేసేవే!
_____________________________

* నేను ఒక హోటల్‌ పెడుతున్నా. అందరినీ ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి?

'మా హోటల్‌లో భోజనం చేస్తే మీ ఇంటి వంటను మీరు మర్చిపోతారు' అని బోర్డు పెట్టండి. కనీసం అప్పుడైనా ఇంటిని మర్చిపోవచ్చు కదా అని మగరాయుళ్లు క్యూకడతారు.
____________________________
(Enadu, 16:12:2007)
______________________________

Labels:

Wednesday, December 12, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* ప్రేమను 'రీఛార్జి' చేయించుకోవాలంటే?
'సెల్స్‌' (కణాలు) బాగుండాలి.
______________________
* వ్యాపార లావాదేవీల్లో 'లావా' రాకుండా ఏం చేయాలి?
'అంటుకు'పోయే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి.
______________________
* సినిమా టిక్కెట్ల వెనక ప్రకటనలు వేస్తే...?
'ఐడియా' కూడా అసూయపడేట్టు ఉంది. 'టిక్కెట్స్‌ చించుకుంటే కాల్స్‌ మీద పడేటట్టు.'
_________________________
* అసైన్డ్‌ భూమికి, సొంత భూమికి తేడా ఏమిటి?
అసైన్డ్‌ భూమి అంటే కొన్న భూమి. సొంత భూమి అంటే ఆక్రమించుకున్న భూమి!
____________________________
* తంతే బూరెల బుట్టలో పడ్డాడంటారు. ఎవరు తంతే అలా జరుగుతుంది సార్‌?
నేను తన్నితేనే కదా...
____________________________
* మీ టోపీ ఎవరైనా కొట్టేస్తే ఏంచేస్తారు?
అంత కంటే భాగ్యమా! ఒకళ్లకైనా 'టోపీ' పెట్టానని ఆనందపడతాను.
___________________________
* నన్నందరూ తిడుతున్నారెందుకు?
అంటే మీరు అంత పెద్ద స్థాయికి ఎదిగిపోయారన్న మాట.
____________________________
* కార్పొరేషన్‌కు, కార్పొరేట్‌కు తేడా ఏమిటి?
ప'రేషాన్‌' చేసేది కార్పొరేషన్‌. 'రేటు' పలికేది కార్పొరేట్‌.
_____________________________
(ఏఎనదు, 09:12:2007)
______________________________

Labels:

Sunday, December 02, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

బాగా 'తినాలని' కోరుకునే వారికి మీరిచ్చే సలహా?

'కాగ్‌ రిపోర్టులు చదవండి. మంచి మార్గాలు తెలుస్తాయి' అని.
________________________
* మీకు 'హస్త'సాముద్రికం వచ్చని విన్నాను. నిజమేనా?

ఇంకా నయం. 'హస్త లాఘవం' వచ్చని అన్లేదు.
__________________________
* అటు టాటా, ఇటు బిర్లా మధ్యలో మీరు ఉంటే...?

ఇద్దరి జేబుల్లోనూ చెయ్యి పెడతా!
__________________________
* బిల్‌గేట్స్‌ నన్ను అప్పు అడగాలంటే ఏం చేయాలి?

మీ ఇంటి 'గేట్స్‌' బార్లా తెరచి మంచి కల కనండి.
________________________________
* పారిశ్రామికవేత్తలూ 60 ఏళ్లకు పదవీ విరమణ చేయాల్సి వస్తే?

పెన్షన్‌ ఉండదు కానీ టెన్షన్‌ ఉంటుంది! అయినా వయసుతో పని ఏముంది పర్సులోనే కదా అంతా ఉంది.
_______________________________
* 'భాగ్యలక్ష్మి' కరుణించాలంటే

వెంటనే ఆవిడకో ఓ ఫ్లాట్‌ కొని ఇచ్చేయండి.
________________________________
* 'దివాలా' బ్యాంకుకు మిమ్మల్ని మేనేజర్‌గా ప్రమోట్‌ చేస్తే?

మీలాంటివాళ్ల 'సాయం'తో ఏదో విధంగా 'మేనేజ్‌' చేయడానికి ప్రయత్నిస్తా.
________________________________
* నేను ఓ కంపెనీలో మేనేజర్ని. ఈమధ్య నా ఛాంబర్‌లోకి వచ్చిన వాళ్లంతా వణికి పోతున్నారు. నేనంటే వాళ్లకి ఎంత భయమో కదా?

భయంలేదు, గియంలేదు కాని, శీతాకాలం కదా! మీరు కాస్త ఆ ఏసీ కట్టేస్తే సరి.
__________________________________
* శ్రీకృష్ణుని భార్య రుక్మిణీ దేవికి నచ్చని వ్యాపారం?

టపాసుల వ్యాపారం! దాని పేరు వింటేనే రుక్మిణీదేవికి సత్యభామ గుర్తొచ్చి తిక్కరేగుతుంది.
_____________________________
* ముకేశ్‌ తన సతీమణికి రూ.234 కోట్ల విలువైన విమానాన్ని బహుమతిగా ఇచ్చాట్ట. అలాకాకుండా ఆమెకు కోపం తెప్పించాలంటే ఆయన ఏం చేసేవారు?

'లుంబినీ పార్కు'కు షికారు వెళదాం వస్తావా? అని అడిగేవారు.
_______________________________
(Eenadu, 02:12:2007)
________________________________

Labels:

Sunday, November 25, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

ఏటీఏంలలో నెలకు ఆరు లావాదేవీల ఉచితమట. పరిమితి దాటితే రుసుము చెల్లించాల్సిందేనట. ఇదెక్కడి ఫిటింగ్‌ సార్‌?

'ఆరే'సుకోబోయి ఏడేసుకున్నాను హరీ అంటే ఇదే మరి. ఇప్పుడు నడుస్తున్నది బ్యాం'కింగ్‌'ల రాజ్యం. మర్చిపోకండి. ఆమాత్రం 'ఫిటింగ్‌'లు ఉండకపోతే ఎలా?
__________________________________
బట్టల సబ్బుల ప్రకటనల్లో తెల్ల బట్టలే వాడతారెందుకు?

జాగ్రత్త! గట్టిగా అనకండి... 'రంగు పడుద్ది'
________________________________________
తలాతోకా లేకుండా వ్యాపారం చేయొచ్చా?

తల లేకపోయినా ఫర్వాలేదేమో గాని తోక మాత్రం కంపల్సరీ.
_________________________________
వ్యాపారంలో అదృష్టాన్ని నమ్ముకోవాలా? దురదృష్టాన్ని తిట్టిపోయాలా?

అదృష్టాన్ని 'అమ్ముకోవాలి'!
_______________________________


మనిషి కోతి నుంచి పుట్టాడన్న డార్విన్‌ సిద్ధాంతాన్ని నమ్మవచ్చంటారా?

ఎవరికి వాళ్లు అద్దంలో చూసుకుని నిర్ణయించుకోవాల్సిందే.
____________________________
నిన్న సైకిల్‌ మీద తిరిగిన నాయకుడు ఇవాళ ఏసీ కార్లలో తిరుగుతున్నాడు. ఏ వ్యాపారం చేసి పైకొచ్చాడో వూహించగలరా?

ఈమాత్రం దానికి ఊహించడం ఎందుకు? 'గాలి'కొట్టు శుభవేళ... మెడలో రత్నాల మాల...
_________________________________
ఎవరూ ధరించలేని వస్త్రాలు?

మీరు కట్టుకుని వదిలేసినవే!
______________________________
రాజకీయమే మంచి వ్యాపారమంటాను. మీరేమంటారు?

'ముంచు' వ్యాపారం అంటాను.
_____________________________
సీఎం, మాజీ సీఎంల 'అక్రమారోపణల'పై మీరే విచారణ జరపాల్సి వస్తే?

ఎవరు ఎక్కువ ముట్టజెబుతారో చూశాకే రిపోర్టు ఇస్తా.
______________________________
(Eenadu, 25:11:2007)
______________________________

Labels:

Tuesday, November 20, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

రాజకీయాలకు వ్యాపార ప్రతిపత్తి లభిస్తే?
లైసెన్సు అవసరం లేదు. 'లైయింగ్‌ సెన్సు' ఉంటే చాలు.
-------------------------
సినీ నటుల్లాగా పారిశ్రామికవేత్తలతో క్రికెట్‌ ఏర్పాటు చేస్తే?
విజయానికి ఎవరి 'ఇండస్ట్రీ' మీద వారు ఆధారపడతారు.
---------------------------
ప్రపంచబ్యాంకు తల తాకట్టు పెట్టించుకుంటుందా?
'నేతల తాకట్టు' పెట్టించుకుంటుంది.
------------------------------
రేపటికల్లా నేను మిట్టల్‌ను అయిపోవాలంటే?
తక్షణం వ్యాపారంలోని మిట్ట(ల్‌) పల్లాలు ఔపోసన పట్టడమే.
----------------------------------
ఎంత పెద్ద కుంభకోణాలు బయల్పడినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు ఎందుకని?
'స్కామాయణం'లో 'పీడకల వేట' ఎందుకని.
-------------------------------------
ఆర్థికమంత్రి చిదంబరం మీ దగ్గరకొచ్చి బ్లాక్‌మనీని వెలికితీసే చిట్కా చెప్పమంటే ఏం చెబుతారు?
ముందు వైట్‌మనీనంతా 'బ్లాక్‌' చేసేయమంటాను.
-------------------------------------
రోబోలు పాఠాలు చెబితే..
అన్నీ 'మెకానికల్‌'గా ఉంటాయి.
--------------------------------------
సెన్సెక్స్‌ బాగా పెరిగిపోతోంది కదా! అయినా పేదవాళ్ల సంఖ్య తగ్గడం లేదెందుకు?
ఉన్నదాన్ని అందరూ 'షేర్‌' చేసుకోకపోవడం వల్లే.
--------------------------------------
నాకు 65 ఏళ్లు. రానురాను ఓపిక తగ్గుతోంది. అయినా బతకడానికి ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నారు. నేను బార్‌ పెడితే మేలా? రెస్టారెంట్‌ మేలా?
రెస్టారెంట్‌ పెడితేనే మేలు. ఏజ్‌'బార్‌' అవుతుంది గానీ రెస్టారెంట్‌ అవ్వదు కదా!
----------------------------------------
లెక్కల టీచర్లంటే పిల్లలు ఎందుకు భయపడతారు?
వాళ్లవల్ల బోలెడన్ని 'ప్రాబ్లమ్స్‌' కాబట్టి.
-----------------------------------------
పశువులకు కూడా 'మధ్యాహ్న గడ్డి పథకం' ప్రవేశపెట్టవచ్చు కదా!
ఓట్లు లేని ఆ మూగజీవులను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? అయినా పశువులకు శ్రమ లేకుండా గడ్డితినే మహానుభావులు బోలెడంత మంది ఉన్నారు కదా.
-----------------------------------------


ఏదైనా పార్టీ కిలో రెండ్రూపాయల బియ్యం పథకంలా కిలో రెండ్రూపాయల ఉల్లి పథకం ప్రవేశపెడితే?
రాజకీయం ఢిల్లీ చుట్టూ కాకుండా ఉల్లి చుట్టూ తిరుగుతుంది. 'ఉల్లీ' నిన్ను దలంచి...' అనేది అన్ని పార్టీల ప్రార్థనాగీతం అవుతుంది.

-------------------------------------------
(Eenadu, 18:11:2007)
________________________________

Labels:

Sunday, November 11, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

*వ్యాపారం బాగా 'సాగాలంటే' ఏం చేయాలి?
'రబ్బరు వ్యాపారం' చేస్తే సరి!

*'చస్తే ఏ గొడవా లేదు' అంటారు నిజమేనా?
కాస్త సవరణ. 'బీమా చేసి చస్తే ఏ గొడవాలేదు' అంటే బాగుంటుంది.

*నాయకులకు ఉపయోగపడేందుకు తిట్లలో శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. కమర్షియల్‌గా ఇది క్లిక్‌ అవుతుందంటారా?
నలుగురు తిడుతుంటే ఆ సంస్థకు అవే ఆశీర్వచనాలు అవుతాయి. దానికి కమర్షియల్‌ విలువ కూడా వచ్చి తీరుతుంది.

*స్టాక్‌ మార్కెట్‌లో నెగ్గుకు రావాలంటే...?
'స్టాక్‌'చాతుర్యం ఉండి తీరాలి.

*నాకు ప్రపంచ బ్యాంకుకే రుణమిచ్చినట్లు కల వచ్చింది. నిజంగా అదే జరిగితే?
అంతా 'కల'కలమే!

*కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టే కట్టడాలు కూడా రోజులు లెక్కపెడుతున్నట్లు నాసిరకంగా తయారవుతున్నాయి. బిల్లులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటున్నాయి. మీరు ఏమంటారు?
'గుడ్‌' వచ్చి 'బిల్లు'ను వెక్కిరించడమంటే ఇదే మరి!

*నాకు ఏ అర్హతా లేదు. మంచి తెలివితేటలూ లేవు. వ్యాపారం చేయమంటారా? ఉద్యోగం చేయమంటారా?
మీ ఒంటికి ఈ రెండూ సరిపడవు గానీ రాజకీయాల్లో చేరండి. అటు వ్యాపారం ఎఫెక్టూ వస్తుంది. ఉద్యోగమూ చేసినట్లు ఉంటుంది. పైన ఒకాయన తిట్ల ఇనిస్టిట్యూట్‌ పెడదామనుకుంటున్నాడట. అడ్రస్‌ కనుక్కుని వెళ్లి ఓ నాలుగు తిట్లు నేర్చుకోండి చాలు.
(Eenadu, 11:11:2001)
__________________________________

Labels:

Sunday, November 04, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* హనుమంతుణ్ని నరకాసురుడి దగ్గరికి పంపితే ఏం చేసేవాడు?
చూసి రమ్మంటే 'పేల్చి' వచ్చేవాడు.

* సత్యభామ నరకాసురుడిని వధించకపోతే టపాకాయల పరిశ్రమ ఏమయ్యేది?
'కృష్ణా'ర్పణమయ్యేది. అప్పుడు ఆయనే ఢామ్మని నరకాసురుణ్ని ఒక చూపు చూసేవాడు.

* అందమైన అమ్మాయి కదా అని అప్పిచ్చాను. కనీసం వడ్డీ కూడా ఇవ్వడం లేదు ఎందుకు?
మీ 'అసలు' దృష్టి తెలిసాక వడ్డీ మాత్రం ఎందుకిస్తుంది?

* నాది పాప్‌కార్న్‌ బిజినెస్‌. దానికి 'ఫటాఫట్‌ కరాకర్‌' అని పేరు పెడదామనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా?
మీరు ఆ పని చేస్తే నేనెందుకు ఊరుకుంటాను. పనిగట్టుకుని వచ్చి కరకరా నమిలేస్తాను(మిమ్మల్ని కాదులెండి, పాప్‌కార్న్‌ను).

* మీ చూపు కూడా సెన్‌'సెక్స్‌' మీదేనా?
మీ సెన్‌'సెక్స్‌' పరిజ్ఞానానికి నా జోహార్లు. కాని, దాని మీదే అతిగా ఆధారపడితే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త!

* నేనూ 'ఫ్రెష్‌'లు పెట్టి లక్షలు సంపాదిద్దామనుకుంటున్నా సాధ్యమవుతుందా?
'ఫ్రెష్‌' మైండ్‌తో చేస్తే సాధ్యంకానిది ఏముంటుంది?

* ఇన్సూరెన్స్‌ బిజినెస్‌లో ఎప్పుడూ బిజీగా ఉండాలంటే?
యమధర్మరాజు 'బిజినెస్‌' బాగుండాలి.

* మీరూ, నేనూ జాయింట్‌ వ్యాపారం చేద్దాం రెడీనా?
నా 'జాయింట్స్‌' ఏమవుతాయోనన్నదే నా బెంగంతా

* 'సత్యం' రామలింగరాజును అమెరికాలో సెటిల్‌ అవమంటూ బిల్‌గేట్స్‌ ఆహ్వానం పంపాడట. అలాకాక బిల్‌గేట్స్‌నే ఇండియా వచ్చేయమంటే...
'గేట్స్‌' ఎక్కడుంటేనేం నాయనా! అమెరికా బిల్లులన్నీ మనవే అవుతాయి. ఇండియా గేట్‌ను ఇండియా 'గేట్స్‌'గా మార్చుకుంటే సరి!

* కుబేరుడ్ని కావాలంటే...?
(కు)బేరసారాలు బాగా తెలిసి ఉండాలి.

* కూరగాయల ధరలు బాగా తగ్గాలంటే?
'ఫల'హారాలు మాత్రమే చేయాలి.
(Eenadu, 04:11:2007)
_________________________________

Labels:

Monday, October 29, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* నా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే ఏ వ్యాపారం మేలు?

పూలు, పళ్లవ్యాపారం.

* కాసులో తేడావస్తే..

అంతా తిర'కాసు'

* ఇన్ని చెబుతున్నారు కదా... మీరేం చేస్తారు?

'జవాబు'దారీగా ఉంటాను.

* చాలామంది తమ షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టుకుంటారు. అయినా కొంతమందికి నష్టాలొచ్చి అప్పుల పాలైపోతుంటారు ఎందుకు?

పేరు పెట్టుకునే వాళ్లను దేవుడు బాగానే చూసుకుంటాడమ్మా. ఎటొచ్చీ 'నామం' పెట్టేవాళ్లనే ఒక పట్టుపడతాడు.

* గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడం ఎక్కడన్నా జరుగుతుందా?

పౌల్ట్రీ పరిశ్రమలో సహజమే.

* కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు. దీనిని ఆపే మార్గమేమిటి?

'బఫే'ను అలవాటు చేసుకోండి! కూర్చునే అవసరం ఉండదు

* డబ్బుకోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నా. ఇంతకీ నేనేం చేస్తున్నానంటారు?

యోగా మాస్టర్‌ అయి ఉంటారు. అందుకే రోజూ శీర్షాసనం తప్పట్లేదేమో మీకు.

* వడ్డీ వ్యాపారం చేద్దామనుకుంటున్నా. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెబుదురూ?

'వడ్డి'చ్చేవాడు మనవాడు అవునో కాదో చూసుకుంటే చాలు.

* 'గొడ్డు' చాకిరీ చేస్తున్నాను. మంచిదేనా?

'పాడి' పరిశ్రమకయితే మంచిదే

* గుడికి, కర్మాగారానికి తేడా ఏమిటి?

గుడి మంత్రముగ్ధం చేస్తుంది. కర్మాగారం యంత్రముగ్ధం చేస్తుంది. అయితే రెండు చోట్లా ఎవరి 'కర్మ'కు వారే బాధ్యులు సుమా!

* పొదుపు సొమ్ము భద్రంగా ఉండాలంటే, ఆ డబ్బును ఎందులో పెట్టమంటారు?

నా జేబులో వద్దులెండి.

* నాకు వడ్డీ లేకుండా కోటి రూపాయలు అప్పు కావాలి. ఎవరిస్తారో కొంచెం చెబుదురూ?

నేను ఎదురుచూస్తోంది కూడా అ'ప్పిచ్చి'వాడి కోసమే నాయనా. అసలు కూడా తిరిగి ఇవ్వనక్కర్లేకుండా కోట్లు ఇచ్చేవారు ఎక్కడ దొరుకుతారా? అని వెతుక్కుంటూ ఇప్పటికే 50000 రూపాయలు తగలేశాను.

* దేవుడికి ఈమేల్‌ ఐడీ ఉంటుందంటారా?

దేవుడికి ఈమేల్‌ ఐడీ ఎందుకు చెప్పండి? 'ఫిమేల్‌' ఐడీ ఉంటే చాలు. భార్యల పేరుతోనే కదా వాళ్లకి గుర్తింపు వచ్చింది. సీతాపతి, ఉమాపతి, రాధాకృష్ణ... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు

* సాధారణంగా తీర్చని వాళ్లకే బ్యాంకులు అప్పులు ఇస్తాయి ఎందుకో చెప్పగలరా?
- జోగిపర్తి ప్రసాద్‌, బుచ్చిరెడ్డిపాలెం
తీర్చేవారికి ఇస్తే 'రుణానుబంధం' అప్పటికప్పుడు తెగిపోతుంది. కదా!అందుకే ఇవ్వరు.
(Eenadu, 28:10:2007)
______________________________

Labels:

Sunday, October 21, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* మా ఫ్రెండొకడు నేనేమి చెప్పినా 'తొక్క'లో విషయం అని తీసిపారేస్తున్నాడు. ఎందుకంటారు?

బహుశా మీ ఫ్రెండ్‌ది అరటిపళ్ల వ్యాపారం అయి ఉంటుంది. అంచేత మీరేమాత్రం వర్రీ అవక అతని మాటల్ని తుంగలో 'తొక్కే'యండి
----------------------------
* నాకెప్పటినుంచో ఓ సందేహం. పసిపిల్లలు సహా అంతా టాటా చెబుతారే తప్ప బిర్లా అనరేమిటండీ?

మనది 'తాతల' నుంచి వచ్చిన సంప్రదాయం కదమ్మా! అందుకే అలా. అంతకుమించి ఎక్కువ ఆలోచించొద్దు.
----------------------------
* ఎఫ్‌ఎమ్‌ రేడియోల భవిష్యత్తు ఎలా ఉండొచ్చునంటారు?

'విను'యోగదారుల మీద ఆధారపడి ఉంటుంది.
-------------------------------
* బలానికి ఏ విటమిన్‌ మంచిది?'ఏ' విటమిన్‌ అని మాత్రం చెప్పకండి.

అన్ని విటమిన్‌లలోకి ఎం(మనీ) విటమిన్‌ ఆరోగ్యదాయకం. ఇతరుల నుంచి అడ్డగోలుగా వచ్చేట్టయితే చచ్చినవాడు కూడా ఎంచక్కా లేచి కూర్చుంటాడు.
---------------------------
* లాభాలు రావాలంటే మార్గం ఏమిటి?

చెబితే నాకేంటి లాభం?
----------------------
* నేను బెడ్‌వర్క్స్‌ చేస్తుంటాను. ఇందులోనూ పోటీ ఎక్కువైపోయింది. తట్టుకొని పైకి రావాలంటే ఏం చేయాలి.

'పరుపు' ప్రతిష్ఠలు పెంచుకోవడమే.
--------------------------
*అవసరమయినవన్నీ అప్పనంగా వస్తుంటే....

'అప్పిచ్చువాడు' పద్యం అవసరమే ఉండదు.
-------------------------
*కొంతమంది డబ్బులు లెక్కపెట్టేటప్పుడు కళ్లకద్దుకుంటారు. ఎందుకని?

తమ కళ్లను తామే నమ్మలేక
-----------------------
*మన కళ్లముందు నుంచే గుజరాత్‌కు గ్యాస్‌ తరలిపోతుందంటే చాలా కంగారుగా ఉంది.

ఏం కంగారుపడొద్దు. నాయకులు ఉన్నంతవరకు 'గ్యాస్‌'కు ఎలాంటి లోటు ఉండదు.
------------------------
*పిచ్చి తుగ్లక్‌ హయాంలో మాదిరిగా మళ్లీ తోలు నాణేలు వస్తే...?

ఎవరు 'తోలు తీస్తారో'నని గడగడ వణికిపోవలసి వస్తుంది.
-----------------------
*గిఫ్టు ఎందుకిస్తారు?

లిఫ్టు కోసం
---------------------
(Eenadu, 21:10:2007)
_____________________________

Labels: