ఫన్‌కర్ ఫటాఫట్
ఏటీఏంలలో నెలకు ఆరు లావాదేవీల ఉచితమట. పరిమితి దాటితే రుసుము చెల్లించాల్సిందేనట. ఇదెక్కడి ఫిటింగ్ సార్?
'ఆరే'సుకోబోయి ఏడేసుకున్నాను హరీ అంటే ఇదే మరి. ఇప్పుడు నడుస్తున్నది బ్యాం'కింగ్'ల రాజ్యం. మర్చిపోకండి. ఆమాత్రం 'ఫిటింగ్'లు ఉండకపోతే ఎలా?
__________________________________
బట్టల సబ్బుల ప్రకటనల్లో తెల్ల బట్టలే వాడతారెందుకు?
జాగ్రత్త! గట్టిగా అనకండి... 'రంగు పడుద్ది'
________________________________________
తలాతోకా లేకుండా వ్యాపారం చేయొచ్చా?
తల లేకపోయినా ఫర్వాలేదేమో గాని తోక మాత్రం కంపల్సరీ.
_________________________________
వ్యాపారంలో అదృష్టాన్ని నమ్ముకోవాలా? దురదృష్టాన్ని తిట్టిపోయాలా?
అదృష్టాన్ని 'అమ్ముకోవాలి'!
_______________________________
మనిషి కోతి నుంచి పుట్టాడన్న డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మవచ్చంటారా?
ఎవరికి వాళ్లు అద్దంలో చూసుకుని నిర్ణయించుకోవాల్సిందే.
____________________________
నిన్న సైకిల్ మీద తిరిగిన నాయకుడు ఇవాళ ఏసీ కార్లలో తిరుగుతున్నాడు. ఏ వ్యాపారం చేసి పైకొచ్చాడో వూహించగలరా?
ఈమాత్రం దానికి ఊహించడం ఎందుకు? 'గాలి'కొట్టు శుభవేళ... మెడలో రత్నాల మాల...
_________________________________
ఎవరూ ధరించలేని వస్త్రాలు?
మీరు కట్టుకుని వదిలేసినవే!
______________________________
రాజకీయమే మంచి వ్యాపారమంటాను. మీరేమంటారు?
'ముంచు' వ్యాపారం అంటాను.
_____________________________
సీఎం, మాజీ సీఎంల 'అక్రమారోపణల'పై మీరే విచారణ జరపాల్సి వస్తే?
ఎవరు ఎక్కువ ముట్టజెబుతారో చూశాకే రిపోర్టు ఇస్తా.
______________________________
(Eenadu, 25:11:2007)
______________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home