ఫన్‌కర్ ఫటాఫట్
కల్లోకి షేర్ వస్తే?
ఇప్పటి పరిస్థితుల్లో ఎంతటివాళ్లయినా కళ్లు తిరిగి 'బేర్'మనాల్సిందే.
_____________________________
అవినీతికి పౌష్ఠికాహారం...?
గడ్డి
_____________________________
తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవంటారు కదా! మరి మీరేమంటారు?
కుందేళ్ల మాటేమోగాని, మన స్టాక్ మార్కెట్ మాత్రం కచ్చితంగా బెదురుతుంది.
_____________________________
ఆమధ్య ఓ సినీనటుడి పెళ్లి జరిగింది. పెద్దలంతా ఆశీర్వదిస్తూంటే బిత్తరపోవడం పెళ్లికొడుకు వంతైంది. ఎందుకంటారు?
మీ పెళ్లి చిత్రం కూడా శతదినోత్సవం జరుపుకోవాలని ఆశీర్వదించడమే అందుకు కారణమై ఉండొచ్చునేమో!
_______________________________
ఏదైనా పార్టీ ఉచిత విద్యుత్తు, ఇంటికో ఉచిత ఉద్యోగం ఇస్తే...?
అబ్బెబ్బే ఉచిత ఉద్యోగం ఇస్తే లాభం లేదు. 'ఉచిత జీతాలు' పథకం ప్రవేశపెడితేనే అందరినీ ఆకట్టుకోవచ్చు.
_________________________________
రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పదంటారు, నిజమేనా?
రామేశ్వరం వెళ్లి కనుక్కుంటే గానీ చెప్పలేను.
_________________________________
పేదలు కూడా మినరల్ వాటర్ కొనుక్కోవాలంటే ఏం చేయాలి?
అది మన చేతుల్లో లేదు. నాయకులు తలచుకోవాల్సిందే. ఎందుకంటే నదులన్నిటినీ కబ్జా చేసి ప్లాట్లు చేయగల శక్తి వారికే కదా ఉంది.
________________________________
అబ్బాయికైతే పాకెట్ మనీ, మరి అమ్మాయికైతే?
పర్స్ మనీ
__________________________________
పర్సులో ఏముంది? నీ మనసులో ఏముంది? అంటే ఏమంటారు?
ఇంకా నయం. మనసులో ఏముంది? అంతా నీ పర్సులోనే ఉంది అనలేదు.
__________________________________
దిష్టి బొమ్మలకు బాగా గిరాకీ ఉంది.ట్రాక్టర్లకొద్దీ గడ్డి తీసుకొచ్చి దిష్టిబొమ్మలు చేయిస్తాను. అవన్నీ అమ్ముడు పోవాలంటే?
నానా 'గడ్డి' తినాలి.
___________________________________
మనదేశంలో పేదవాడు మరింత పేదవాడు కావడానికి కారణం?
'రాజకీయం' తెలియకపోవడం.
____________________________________
మావాడొకడు సినిమా ఫీల్డులో ఉన్నాడు. బాగా సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. అతడికి మీరిచ్చే సలహా!
మేకప్‌తో నటిస్తే ఏం లాభం, ఎంత లాభం? మేకప్ తీసి నటిస్తేనే కదా మజా!
_____________________________________
(Eenadu, 27:01:2008)
_____________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home