My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, July 26, 2007

"శత వసంత సాహితీ మంజీరాలు"

(ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం,విజయవాడ-520 010, సం.2002, రూ.250/-)

1999నాటికి మిలీనియం హడావిడి ప్రారంభమైంది.'ఇరవయ్యో శతాబ్దికి వీడ్కోలు చెపుతూ, కొత్త సహస్రాబ్దికి స్వాగతం చెపుతూ వున్న ఈ సంధి సమయంలో, గడిచిపోతున్న ఈ శతాబ్దంలోని గణించదగ్గ శతాలను ఎన్నటం పరిపాటయ్యింది. అలాగే, ఈ శతాబ్దిలో తెలుగులో వచ్చిన పుస్తకాలలో ప్రతి తెలుగువాడు చదువవలసిన 100 పుస్తకాల జాబితా తయారు చేయడానికి, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ లో కృష్ణదేవరాయ ఆచార్య పదవిలో ఉన్న ప్రసిద్ధ తెలుగు విమర్శకుడు, రచయిత శ్రీ వెల్చేరు నారాయణ రావు సారథ్యంలో కొందరు సాహితీ ప్రియులు ఈ క్రింది 100 పుస్తకాలను ఎంపిక చేశారు.' చూడండి:

ఈమాట » ఈ శతాబ్దపు రచనా శతం
అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా 'వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాలు ' అని ఎంపిక చేసిన పుస్తకాల జాబితా విడుదల చేఎసింది. చూడండి (నా బ్లాగ్ పోస్టింగ్ 16:07:2007 "తెలుగులో వంద గొప్ప పుస్తకాలు ") :
తెలుగులో వంద గొప్ప పుస్తకాలు


పై జాబితాల ఆధారంగాను,సాహితీ ప్రముఖుల సలహాలమేరకు, గత వంద సంవత్సరాలలో, 20వ శతాబ్దిలో వెలువడిన వంద వెలుగు చారికల్లాంటి ఉత్తమ పుస్తకాలను పరిచయం చేసే విలువైన వ్యాస సంపుటి ఈ "శత వసంత సాహితీ మంజీరాలు".

ఈ "శత వసంత సాహితీ మంజీరాలు" విజయవాడ ఆకాశవాణికేద్రం నుంచి,జూలై,1999- మే,2002 ల మధ్య , ధారావాహికంగా ప్రసారమైన ప్రసంగ వ్యాసాలు.దీని సంపాదకులు ప్రయాగ వేదవతి,నాగసూరి వేణుగోపాల్ గార్లు.

ఈవంద పుస్తకాలలో కవిత్వానికి సంబంధించి-26,
నాటికలు, నాటకాలు-13,
నవలలు-24,
కథలు-8,
సాహిత్య విమర్శలు-13,
స్వీయ చరిత్రలు-6,
ఇతరాలు-10 ఉన్నాయి.
ఆయా పుస్తకాల ముఖపత్రాల చాయాచిత్రాలు,ఆయా రచయతల, కవుల చాయాచిత్రాలూ ఉన్నాయి.

**********

కవిత్వం(26):

తృణకంకణం(1913), రాయప్రోలు సుబ్బారావు
బసవరాజు అప్పారావు గేయాలు(1921), బసవరాజు అప్పారావు
కృష్ణపక్షం(1925), కృష్ణశాస్త్రి
పిరదౌసి(1932), జాషువా
సౌందర నందము(1932), పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు
రాణా ప్రతాపసింహ చరిత్ర(1934), దుర్భాక రాజశేఖర శతావధాని
పానశాల(1935),దువ్వూరి రామిరెడ్డి
వైతాళికులు(1935), ముద్దుక్రిష్ణ
ఎంకిపాటలు(1935), నండూరి వెంకతసుబ్బారావు
దీపావళి(1937), వేదుల సత్యనారాయణ శాస్త్రి
రాష్ట్రగానము(1938), తుమ్మల సీతారామమూర్తి
ఫిడేలు రాగాల డజన్(1939), పఠాభి
శ్రీ శివభారతము(1943), గడియారం వేంకట శేషశాస్త్రి
నగరంలో వాన(1944), కుందుర్తి ఆంజనేయులు
మగువమాంచాల(1947), ఏటుకూరి వెంకటనరసయ్య
విజయశ్రీ(1948), కరుణశ్రీ
త్వమేవాహం(1949), ఆరుద్ర
మహాప్రస్థానం(1950), శ్రీరంగం శ్రీనివాసరావు
ఆంధ్రపురాణము(1954), మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
నూతిలో గొంతుకలు(1955), ఆలూరి బైరాగి
పెన్నేటి పాట(1956), విద్వాన్ విశ్వం
కర్పూర వసంత రాయలు(1957), సి.నారాయాణ రెడ్డి
శివతాండవం(1961), పుట్టపర్తి నారాయణాచార్యులు
అగ్నిధార(1961), దాశరథి
అమృతం కురిసిన రాత్రి(1968), తిలక్
ఆధునిక మహాభారతం(1985), గుంటూరు శేషేంద్ర శర్మ

*******

నాటికలు, నాటకాలు(13):

గయోపాఖ్యానం(1890), చిలకమర్తి లక్ష్మీనరసింహం
ప్రతాపరుద్రీయము(1897), వేదం వెంకటరాయశాస్త్రి
కన్యాశుల్కం(1897), గురుజాడ అప్పారావు
పాండవోద్యోగ విజయాలు(1907), తిరుపతి వేంటకవులు
వరవిక్రయం(1923), కాళ్ళకూరి నారాయణ రావు
రాజమన్నారు నాటికలు(1930), పి.వి.రాజమన్నారు
మా భూమి(1947), సుంకర వాసి రెడ్డి
కొత్త గడ్డ(1947), నార్ల వెంకటేశ్వరరావు
ఎన్.జీ.ఓ(1949), ఆత్రేయ
విషాధ సారంగధర(1957), ధర్మవరం కృష్ణమాచార్యులు
కీర్తిశేషులు(1960), భమిడిపాటి రాధాకృష్ణ
ఆశఖరీదు అణా(1964), గోరాశాస్త్రి
త్రిపురనేని రామస్వామి నాటకాలు(1978), త్రిపురనేని రామస్వామి

********

నవలలు(24):

మాతృమందిరం(1918), వేంకట పార్వతీశ్వర కవులు
గణపతి(1920), చిలకమర్తి లక్ష్మీనరసిహం
మాలపల్లి (సంగవిజయం) (1922), ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు
బారిష్టర్ పార్వతీశం(1924), మొక్కపాటి నరసింహశాస్త్రి
మైదానం(1928), గుడిపాటి వెంకటచలం
నారాయణ రావు(1934), అడివి బాపిరాజు
ఓబయ్య (1936), వేలూరి శివరామశాస్త్రి
వేయి పడగలు(1939), విశ్వనాధ సత్యనారాయణ
చదువు(1946), కొడవటిగంటి కుటుంబరావు
చివరకు మిగిలేది (ఏకాంతం) (1946), బుచ్చిబాబు
అసమర్ధుని జీవయాత్ర (1946), గోపీచంద్
మృత్యుంజయులు(1947), బొల్లిముంత శివరామకృష్ణ
అతడు-ఆమె(1950), ఉప్పల లక్ష్మణ రావు
కీలుబొమ్మలు(1951), జి.వి. కృష్ణారావు
అపస్వరాలు(1955), శారద (నటరాజన్)
అల్పజీవి(1956), రావి శాస్త్రి
కాలాతీతవ్యక్తులు(1958), డాక్టర్ శ్రీదేవి
పాకుడు రాళ్ళు(1965), రావూరి భరద్వాజ
కొల్లాయి గట్టితేనేమి(1965), మహీధర రామమోహన రావు
జానకి విముక్తి(1977), రంగనాయకమ్మ
మరీచిక(1979), వాసిరెడ్డి సీతాదేవి
ప్రజల మనిషి(1985), వట్టికోట ఆళ్వారు స్వామి
అనుక్షణికం(1985), వడ్డెర చండీదాస్
చిల్లరదేవుళ్ళు(1987), దాశరధి రంగాచార్య:

**************

కథలు(8):

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు(1915), శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
కాంతం కథలు(1925), మునిమాణిక్యం
మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు(1930), మల్లాది రామకృష్ణ శాస్త్రి
మా గోఖలే కథలు(1941), మాధవపెద్ది గోఖలే
విలోమ కథలు(1976), నగ్నముని
అమరావతి కథలు(1978), సత్యం శంకరమంచి
గాలివాన(1984), పాలగుమ్మి పద్మరాజు
అత్తగారి కథలు(1996), భానుమతీ రామకృష్ణ

**************

సాహి త్య విమర్శలు(13):

కవిత్వతత్త్వ విచారం(1914), కట్టమంచి రామలింగారెడ్డి
నేటికాలపు కవిత్వం(1928), అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు
వేమన(1928), రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ
నవ్యాంధ్ర సాహిత్య వీధులు(1942), కురుగంటి సీతారామాచార్యులు
ఆంధ్ర సాహిత్య చరిత్ర(1954), పింగళి లక్ష్మీకాంతం
ఆరుయుగాల ఆంధ్ర కవిత(1958), ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
సమగ్ర ఆంధ్ర సాహిత్యం(1967), ఆరుద్ర
సాహిత్యంలో దృక్పథాలు(1968), ఆర్.ఎస్.సుదర్శనం
శివభారత దర్శనము(1971), సర్దేశాయి తిరుమల రావు
సారస్వత వివేచన(1976), రాచమల్లు రామచంద్రా రెడ్డి
తెలుగు జానపదగేయ సాహిత్యము(1986), బిరుదురాజు రామరాజు
అర్థశతాబ్దపు ఆంధ్ర కవిత్వం(1994), శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
అక్షర తూణీరం(1995), కె.వి.రమణారెడ్డి

************

స్వీయ చరిత్రలు(6):

కందుకూరి స్వీయచరిత్రం(1919), కందుకూరి వీరేశలింగం
నా జీవితయాత్ర(1941), టంగుటూరి ప్రకాశం పంతులు
నేను-నా దేశం(1952), దరిశి చెంచయ్య
ఇదీ నా గొడవ(1953), కాళోజీ నారాయణ రావు
అనుభవాలూ-జ్ఞపకాలూనూ(1955), శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
నా స్మృతిపథంలో(1957), అచంట జానకిరాం

******************

ఇతరాలు(10):

శారద లేఖలు(1934), కనుపర్తి వరలక్ష్మమ్మ
లోవెలుగులు(1937), ముట్నూరి కృష్ణారావు
ఆంధ్రుల సాంఘిక చరిత్ర(1949), సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్రుల చరిత్ర,సంస్కృతి(1951), ఖండవల్లి లక్ష్మీరంజనం,బాలేందు శేఖరం
రస రేఖలు(1965), సంజీవ్‌దేవ్
బుడుగు(1957), ముళ్ళపూడి వెంకట రమణ
ఊహాగానం(1975), తెన్నేటి హేమలత
సాక్షి(1913), పానుగంటి లక్ష్మీఎనరసింహారావు
వదరుబోతు(1935), పప్పూరి రామాచార్యులు
కొత్తపాళి(1955), తాపీ ధర్మా రావు


********************

ప్రస్తుత పాఠకులకు చాలామందికిఈ పుస్తకాలతో పరిచయముండకపోవచ్చు.ఈ స్పీడ్ యుగంలో పుస్తకాలన్నింటినీ చదివే సమయమూ, ఓపికా ఉండకపోవచ్చు. అలాంటివారికి ఆయా పుస్తకాల పరిచయం, కనీసం ఈ సమీక్షల ద్వారానైనా కలుగుతుంది.

కొని దాచుకోదగ్గ ఒక అపురూపమైన సంకలనం ఇది.



---------------------------------------------

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home