తెలుగులో వంద గొప్ప పుస్తకాలు
వెయ్యేళ్ళ తెలుగు సాహితీ ప్రస్థానం పిల్ల కాలువలా మొదలై, నదీ ప్రవాహమై, సాగరమై, సుసంపన్నమై మైలురాళ్ళను నెలకొల్పుతూ ముందుకు సాగుతూ ఉన్నది.అటువంటి సాగరతుల్యమైన సాహిత్యం నుంచి 'గొప్ప వంద పుస్తకాలు ఇవే ' అని తేల్చి చెప్పడం కష్టసాధ్యమైన పని. రచయితలు కొందరు విడి విడిగా ఇటువంటి ప్రయత్నంచేసారు. వాటిని గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు., కాని ఆంధ్రజ్యోతి దినపత్రిక 1999 దిసెంబర్ లో ముద్రించిన జాబితాను ఇక్కడ పొందుపర్చుతున్నాము. అప్పట్లో ఆంధ్రజ్యోతి సాహిత్యవేదికను చూస్తున్న సీనియర్ జర్నలిస్టు, రచయిత పొనుగోటి కృష్ణారెడ్డి తెలుగులో వచ్చిన గొప్ప వంద పుస్తకాలను ఎంపిక చేయడానికి ఓ మంచి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు, కవులు, విమర్శుకులు, మేధావులు,పుస్తక ప్రియులనుంచి గొప్ప వంద పుస్తకాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరిపారు.వారిలో 44 మంది రచయితలు తమ అభిప్రాయాలను పంపారు. ఈ అభిప్రాయాల ప్రాతిపదికగా రూపొందించి, అంధ్రజ్యోతిలో ప్రచురించిన జాబితాను వరుసక్రమంలో ఇక్కడ ఇచ్చాము. ఈ జాబితా ఎంపికలోనూ అనేక పరిమితులున్నాయని, ఇదే సమగ్రమైన జాబితా అని చెప్పడానికి సాహసించడం లేదని అప్పట్లో సంపాదకులు ప్రకటించారు. అభిప్రాయ సేకరణలో పాల్గొన్న రచయితల వ్యక్తిగత అభిరుచి, వారికి ఉండే పరిమితుల కారణంగా కొన్ని ప్రముఖ రచనలకు ఇందులో స్థానం లభించకపోయివుండవచ్చు. అంతమాత్రం చేత ఆ రచనల ప్రాధాన్యం తగ్గిపోదు. ఆంధ్రజ్యోతి అప్పట్లో వంద గొప్ప కథలను కూడ విడిగా ఎంపిక చేసింది.అందువల్ల గొప్ప వంద పుస్తకాల జాబితాలో కథల సంపుటాల గురించిన ప్రస్తావన చేయలేదు.
1] కన్యాశుల్కం:-గురుజాడ అప్పారావు
2] మహాప్రస్థానం: - శ్రీశ్రీ
3] ఆంధ్రమహాభారతం:-కవిత్రయం
4] మాలపల్లి (సంగవిజయం):-ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు
5] చివరకు మిగిలేది (ఏకాంతం):-బుచ్చిబాబు
6] అసమర్ధుని జీవయాత్ర :-గోపీచంద్
7] దేవరకొండ బాలగంగాధర తిలక్:-అమృతం కురిసిన రాత్రి
8] కాలాతీతవ్యక్తులు:-డాక్టర్ శ్రీదేవి
9] వేయి పడగలు:-విశ్వనాధ సత్యనారాయణ
10] పింగళి సూరన:- కళాపూర్ణోదయం
11] సాక్షి:-పానుగంటి లక్ష్మినరసింహారావు
12] గబ్బిలం:-జాషువా
13] వసుచరిత్ర:-భట్టుమూర్తి
14] అతడు ఆమె::-ఉప్పల లక్ష్మనరావు
15] అనుభవాలు జ్ఞాపకాలు:-శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
16] ఆముక్తమాల్యద:- శ్రీకృష్ణదేవరాయలు
17] చదువు:-కొడవటిగంటి కుటుంబరావు
18] ఎంకి పాటలు:-నండూరి సుబ్బారావు
19] కవిత్వ తత్త్వ విచారము:- డాక్టర్ సి ఆర్ రెడ్డి
20] వేమన పద్యాలు:-వేమన
21] కృష్ణపక్షం:-కృష్ణశాస్త్రి
22] మట్టిమనిషి:-వాసిరెడ్డి సీతాదేవి
23] అల్పజీవి:-రావి శాస్త్రి
24] ఆంధ్రుల సాంఘిక చరిత్ర:-సురవరం ప్రతాప రెడ్డి
25] ఆంధ్ర మహాభాగవతం:-పోతన
26] బారిష్టర్ పార్వతీశం:-మొక్కపాటి నరసింహశాస్త్రి
27] మొల్ల రామాయణం:-ఆతుకూరి మొల్ల
28] అన్నమాచార్య కీర్తనలు:-అన్నమాచార్య
29] హంపీ నుంచి హరప్పాదాకా:-తిరుమల రామచంద్ర
30] కాశీయాత్రా చరిత్ర:-ఏనుగుల వీరాస్వామయ్య
31] మైదానం:-చలం
32] వైతాళికులు:-ముద్దుకృష్ణ
33] ఫిడేలు రాగాల దజను:-పఠాభి
34] సౌందర నందము:-పింగళి, కాటూరి
35] విజయవిలాసం:-చేమకూర వేంకటకవి
36) కీలుబొమ్మలు:-జీ.వీ. కృష్ణారావు
37] కొల్లాయి గడితేనేమి:-మహీధర రామమోహనరావు
38] మ్యూజింగ్స్:-చలం
39] మనుచరిత్ర:-అల్లసాని పెద్దన
40] పాండురంగ మహత్యం:-తెనాలి రామకృష్ణ
41] ప్రజల మనిషి:-వట్టికోట ఆళ్వారు స్వామి
42] పాండవోద్యోగ విజయములు:-తిరుపతి వేంకటకవులు
43] సమగ్ర ఆంధ్ర సాహిత్యం:-ఆరుద్ర
44] దిగంబర కవిత:-దిగంబర కవులు
45] ఇల్లాలి ముచ్చట్లు:-పురాణం సుబ్రమన్య శర్మ
46] నీలిమేఘాలు:-సంపాదకత్వం:వోల్గా
47) పానశాల:-దువ్వూరి రామిరెడ్డి
48] శివతాండవం:-పుట్టపర్తి నారాయాణాచార్యులు
49) అంపశయ్య:-నవీన్
50] చిల్లర దేవుళ్ళు:-దాశరథి రంగాచార్య
51] గణపతి:-చిలకమర్తి లక్ష్మీనరసింహం
52] జానకి విముక్తి:-రంగనాయకమ్మ
53] స్వీయ చరిత్ర:-కందుకూరి
54] మహోదయం:-కె.వి.రమణారెడ్డి
55] నారాయణరావు:-అడవి బాపిరాజు
56] విశ్వంభర:-డాక్టర్ సి.నారాయణరెడ్డి
57] దాశరథి కవిత:-దాశరథి
58] కథాశిల్పం:-వల్లంపాటి వెంకటసుబ్బయ్య
59] నేను-నా దేశం:-దర్శి చెంచయ్య
60] నీతి చంద్రిక:-చిన్నయ సూరి
61] పెన్నేటి పాట:-విద్వాన్ విశ్వం
62] ప్రతాపరుద్రీయం:-వేదం వెంకటరాయశాస్త్రి
63] పారిజాతాపహరణం:-నంది తిమ్మన
64] పల్నాటి వీర చరిత్ర:-శ్రీనాథుడు
65] రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక):-కందుకూరి వీరేశలింగం పంతులు
66] రాధికా సాంత్వనము:-ముద్దుపళని
67] స్వప్న లిపి:-అజంతా
68] సారస్వత వివేచన:-రాచమల్లు రామచంద్రారెడ్డి
69] శృంగార నైషధం:-శ్రీనాథుడు
70] ఉత్తర రామయణం;-కంకంటి పాపరాజు
71] విశ్వదర్శనం:-నండూరి రామమోహనరావు
72] అనుక్షణికం:-వడ్డెర చండీదాస్
73] ఆధునిక మహాభారతం:-గుంటూరు శేషేంద్ర శర్మ
74] అడవి ఉప్పొంగిన రాత్రి:-విమల
75] చంఘీజ్ ఖాన్:-తెన్నేటి సూరి
76] చాటుపద్య మంజరి:-వేటూరి ప్రభాకర శాస్త్రి
77] చిక్కనవుతున్నపాట:-జి.లక్ష్మీనరసయ్య, త్రిపురనేని స్రీనివాస్
78] చితి-చింత:-వేగుంట మోహనప్రసాద్
79] గద్దర్ పాటలు:-గద్దర్
80] హాంగ్ మి క్విక్:-బీనాదేవి
81] ఇస్మాయిల్ కవిత:-ఇస్మాయిల్
82] కుమార సంభవం:-నన్నె చోడుడు
83] కొయ్య గుర్రం:-నగ్నముని
84] మైనా:-శీలా వీర్రాజు
85] మాభూమి:-సుంకర,వాసిరెడ్డి
86] మోహన వంశీ:-లత
87] నగరంలో వాన:-కుందుర్తి
88] రాముడుండాడు రాజ్యముండాది:-కేశవరెడ్డి
89] రంగనాథ రామాయణం:-గోన బుద్ధారెడ్డి
90] సౌభద్రుని ప్రణయ యాత్ర:-నాయని సుబ్బారావు
91] సూత పురాణం:-త్రిపురనేని రామస్వామి చౌదరి
92] శివారెడ్డి కవిత:-శివారెడ్డి
93] సాహిత్యంలో దృక్పథాలు:-ఆర్.ఎస్.సుదర్శనం
94] స్వేచ్ఛ:-వోల్గా
95] తెలుగులో కవితావిప్లవాల స్వరూపం:-వేల్చేరు నారాయణరావు
96] కరుణశ్రీ:-జంధ్యాల పాపయ్య శాస్త్రి
97] వేమన:-రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
98] తృణకంకణం:-రాయప్రోలు
99] హృదయనేత్రి:-మాలతీ చందూర్
100] బ్రౌను నిఘంటువు:-చార్లెస్ బ్రౌను
(జర్నలిష్టు కరదీపిక,సంపాదకుడు:కట్టా శేఖర్ రెడ్డి,
న్యూ మీడియా కమ్యూనికేషన్స్, హైదరాబాద్,2006)
--------------------------------------------------------
ఈ క్రింది సైటు కూడా చూడండి::
ఈమాట » ఈ శతాబ్దపు రచనా శతం
Labels: Books, Telugu literature/ books
2 Comments:
88 - రాముడుండాడు రాజ్జివుండాది :)
3:17 am
అందుబాటులో వుంటే వంద గొప్పకథల జాబితాను కూడా దయచేసి చెప్పండి.
3:23 am
Post a Comment
<< Home