సాహిత్యం-వాఙ్మయం
అధిక్షేపం:
అధిక్షేపం అంటే నిందించటం, వద్దని త్రోసిపుచ్చడం, తిరస్కరించడం అని అర్థాలు. వ్యంగ్య, హాస్య ధోరణిలో చేసే రచన. ఆంగ్లంలో సెటైర్. సమకాలీన సాంఘిక, రాజకీయ పరిస్థితులను సమీక్షించి వివిధ రంగాలలోని కలుషిత వాతావరణాన్ని ఆయా వ్యక్తుల దుశ్చర్యల్ని వ్యంగంగా చిత్రీకరించే రచనలు, అధిక్షేపించే రచనలు.అయితే ఆధునిక కాలంనాటి అధిక్షేప రచనలో ఉపదేశం కనిపిస్తుంది.సంఘ సంస్కరణ కనిపిస్తుంది.విమర్శనలో బాగోగులు కనిపిస్తాయి.
ఉదాహరణలు:తిరుపతి వెంకటకవుల గీరతం, గ్రామ సింహం, బిడాలోపాఖ్యానం.దాసు శ్రీరామకవి చక్కట్ల దండశతకం.ప్రహసనాలను సాక్షి సంపుటాలలో, వదరుబోతు వ్యాసాలలోనూ 'అధిక్షేపం ' గుర్తించవచ్చు.
_____________________________
అధివాస్తవికత:
ఆంగ్లంలో సర్రియాలిసం.మనసులో, కలలో వచ్చే అలోచల్ని యథాతథంగా వెల్లడించడం;సహేతుకంగా గతాన్ని, సంప్రదాయాన్ని నిరసించడం; రచనలో వ్యంగ్యము, అధిక్షేపము, హాస్యము, అవహేళనములతో శబ్దచిత్రాల గారడి, ఈ అధివాస్తవికత లక్షణాలు.వీటిలో సౌందర్యానికి, నీతికి సంబంధించిన సూత్రాలకు చోటు లేదు.తమ కాలములోని సాంఘిక నియమాలు పుటుక్కున తెంచి, హద్దు పద్దు లేని వ్యక్తి స్వేచ్ఛను కోరడమే సర్రియలిష్టుల అభ్యుదయ వ్యతిరేక ధోరణికి నిదర్శనము.ఆండ్రే బ్రెటన్,లూయీ ఆరగాన్, సోఫాల్ ఈ ఉద్యమానికి మూలస్తంభాలు.
తెలుగులో ఇది తాత్విక సిద్దాంతంగా కాకుండా కవితాధోరణిగా నిలిచింది.కొందరు దీనిని భీభత్స కవిత్వం, స్మశాన కవిత్వం, మణిప్రవాళం, అహంభావ కవిత్వం అని పిలిచారు. శ్రీశ్రీ రుబాయత్, విధూషకుని ఆత్మహత్య, శ్రీరంగం నారాయణ బాబు రుధిర జ్యోతిలో లెండోయి ఋషులు ఖండిక, పఠాభి ఫిడేలు రాగాల డజన్ మొ// ఉదాహరణాలు.
___________________________
(వాఙ్మయ దర్శిని-ఆచార్య కె.సర్వోత్తమ రావు;
తెలుగు సాహిత్య దర్శనం,క్విజ్-ఎస్.నాగేoద్రనాథ్ రావు,
తెలుగు వెలుగు-డా.ద్వా.నా.శాస్త్రి.)
__________________________________
Labels: సాహిత్యం-వాఙ్మయం
0 Comments:
Post a Comment
<< Home