ఫన్‌కర్ ఫటాఫట్
* ఉన్నఫళాన లక్షాధికారిని అయిపోవాలని ఉంది. కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకుందురూ...!
-ఆర్. రామమోహన్‌రావు, హైదరాబాద్
అదెంత 'భాగ్యం' నాయనా! వెంటనే ఓ కోటి రూపాయలు తెచ్చియ్యి. చిటికెలో నిన్ను లక్షాధికారిని చేసేస్తా.
-------------
* నేను ఎప్పుడు షేర్లు కొన్నా మార్కెట్ పడిపోతోంది. నా ఫ్రెండ్సంతా నాది ఐరన్‌లెగ్ అని తిడుతున్నారు...
- ఆరారెమ్మార్, హైదరాబాద్
ఎంత అదృష్టం! వెంటనే మీ లెగ్గు తీసి ఉగ్రవాదం మీద పెట్టి పుణ్యం కట్టుకోండి. వాళ్ల బిజినెస్ మటాష్ అయిపోతుంది.
-------------------
* పలాసలో నాకో కంపెనీ ఉంది. అది ఎప్పుడూ నష్టాల్లోనే నడుస్తోంది. దాన్ని ఎక్కడికి మార్చమంటారు?
-ఎస్.వనజ, బరంపురం
'లాస్'ఏంజిల్స్‌కి మార్చండి. పేరుకు తగ్గట్టు సరిపోతుంది.
-----------------
* 'ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి' అని సామెత. దీనిని కార్పొరేట్ రంగానికి అన్వయిస్తే?
- టి. మల్లికార్జునరావు, తాడికొండ
ముందొచ్చిన షాపుల కంటే వెనకొచ్చిన 'మాల్స్' గ్రేట్!
------------------------
* కొన్ని పబ్లిక్ ఇష్యూల ధరలు చూస్తే రేట్లు ఎక్కువగా ఖరారు చేశారేమో అనిపిస్తుంది. మీరేమంటారు?
-ఎం.మనోహర్ రావు, చేవెళ్ల
అనవసరంగా 'ఇష్యూ' చేశారేమో అనిపిస్తుంది.
----------------
* 'ల్యాండ్‌లైన్ ఇల్లాలైతే, సెల్‌ఫోన్ ప్రియురాలు' అంటాను. మీరేమంటారు?
-కె.కృష్ణారావు, మచిలీపట్నం
ఇంతకీ మీకు ఎన్ని 'సెల్‌ఫోన్లు' ఉన్నాయి?
------------------
* 'వేమన క్లాత్ సెంటర్' అని పేరు పెట్టాను. ఎలా ఉంది మన ఐడియా? - వి.ఎస్. రాములు, ఇచ్ఛాపురం
డ్రెస్ ఉన్నా అడ్రస్ ఉంటుందా అన్నదే డౌటు.
-------------------
* మా మిత్రుడు దివాలా తీసినా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కారణం ఏంటంటారు?
-ఎస్. గోవిందరావు, కంకిపాడు
దివాలా వెనక ఏదో హవాలా ఉండి ఉంటుంది. ఓ కన్నేయండి
--------------------
* బాగా ప్రమోషన్లు రావాలంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మంచిదా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మంచిదా?
- పి.ఆర్. కోటేశ్వరరావు, రాజమండ్రి
ఏదైనా 'కమిటెడ్'గా పనిచేస్తే వస్తాయి గానీ 'లిమిటెడ్'గా పనిచేస్తే ఎలా వస్తాయి ప్రమోషన్లు.
----------------
------------------
(Eenadu,16:09:2007)
-------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home