చరిత్రలో ఈ వారం
సెప్టెంబరు 17 1948:
భారతసైన్యం చేపట్టిన పోలీసుచర్య ధాటికి నిజాం సైన్యం లొంగిపోయింది. ఆపరేషన్ పోలో పేరుతో ఐదురోజులపాటు సాగిన ఈ పోలీస్‌యాక్షన్‌లో దాదాపు 1373 మంది రజాకార్లు హతమయ్యారు. 1900మందికి పైగా బందీలుగా చిక్కారు. హైదరాబాదు సైన్యంలో 800మందికి పైగా మరణించగా, సుమారు 1670మంది బందీలయ్యారు. సెప్టెంబరు 18న నిజాం లొంగిపోయాడు. ఆ రోజు సాయంత్రం నాలుగున్నరకు అధికారిక లొంగుబాటు పత్రంపై సంతకం చేయడంతో 224సంవత్సరాల అసఫ్‌జాహీల పాలన ముగిసినట్లయింది. హైదరాబాదు సంస్థానం భారత్‌లో విలీనమైంది.
ఇక... నిజాం హయాంలో అరాచకాలకు పాల్పడ్డ రజాకార్ల నాయకుడు ఖాసింరజ్వీ కొన్నాళ్లపాటు జైలుజీవితం గడిపి, విడుదలయ్యాక పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే అనామకంగా మరణించాడు.
-----------------------
సెప్టెంబరు 20,1633:
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన గెలీలియోగెలీలీ విచారణ సమయంలో ఆ విషయాన్ని ఒప్పించడంలో విఫలమై మతపెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. ఆపై జీవిత కాలమంతా గృహనిర్బంధంలోనే గడిపి కన్నుమూశాడు.
------------------------
సెప్టెంబరు 20,1878:
నూటపాతికేళ్లకు పైగా ప్రచురితమవుతున్న 'హిందు' తొలిసంచిక విడుదలైంది. అప్పట్లో అది డైలీ కాదు... వారపత్రిక.
--------------------------------
సెప్టెంబరు 21
అంతర్జాతీయ శాంతి దినోత్సవం.
1995:
ఆ రోజు తెల్లవారుజామునే ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు వినాయకుడు పాలు తాగుతున్నాడనే విషయాన్ని చుట్టుపక్కల వాళ్లకు తెలిపాడు. ఉదయం పదకొండుగంటల సమయానికి అది దేశమంతటికీ పాకింది. మరో గంటలో ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ తెలిసింది. విదేశాల్లో సైతం హిందువులు వినాయకుడికీ శివపార్వతుల విగ్రహాలకూ పాలు నివేదించడం వెుదలుపెట్టారు. అయితే దాని వెనుక శాస్త్రీయకోణం ఉందని శాస్త్రవేత్తలు రుజువుచేయడంతో ఎంత వేగంగా ఆ ప్రచారం వెుదలైందో అంతే వేగంగా మరుగున పడిపోయింది.
(Eenadu,16:09:2007)
--------------------------------------
Labels: Events
0 Comments:
Post a Comment
<< Home