వాఙ్ఞయం,సారస్వతం, సాహిత్యం
గ్రంథస్ఠాలైన వాటితో పాటూ, వాక్ రూపంలో జీవిస్తున్న సంభాషణలు, ఉపన్యాసాలు,ఉత్తరాలు, ఇవన్నీ వాఙ్ఞయమనే అంటారు. దీనిలో శాస్త్రవాఙ్ఞయమనీ, కావ్య వాఙ్ఞయమనీ
రెండు రకాలుగా విభజంచవచ్చు.
లిఖితమైన లేదా గ్రంథస్థమైన భాగం సారస్వతంగా భావిస్తారు.శాస్త్రగ్రంథాలు, పంచాంగాలు,వార్తపత్రికలు, శాసనాలు ఇవి సారస్వతంగా చెప్పవచ్చు.వాఙ్ఞయంలో సారస్వతం ఒక భాగం.
సహితస్యభావఃసాహిత్యం.హితేనసహితం సాహిత్యం. ధర్మ ప్రతిపాదనం చేసేది, ప్రీతిదాయకమైనది, ఉపదేశాత్మకమైనిది సాహిత్యం.ప్రకృతి సత్యాన్ని సౌదర్యవంతం చేసి, ఆనంద పర్యవసానాలుగ చిత్రించేది సాహిత్యం.
ఈ మూడు పదాలకు ప్రయోగంలో తేడా ఉన్నా సామాన్యులు వాఙ్ఞయ,సారస్వత, సాహిత్య పదాలను పర్యాయ పదాలుగానే ఉపయోగిస్తున్నారు.
[వాఙ్మయ దర్శిని-ఆచార్య కె.సర్వోత్తమ రావు;
తెలుగు సాహిత్య దర్శనం,క్విజ్-ఎస్.నాగేoద్రనాథ్ రావు]
_______________________________
Labels: సాహిత్యం-వాఙ్మయం
0 Comments:
Post a Comment
<< Home