ఫన్‌కర్ ఫటాఫట్
గ్యాస్ వ్యాపారం మంచిదా? జ్యూస్ వ్యాపారం మంచిదా?
-ఎం. విజయలక్ష్మి, బోధన్
చెప్పేది 'గ్యాస్' అయినా, వినేవాడికి 'జ్యూస్'లా ఉంటే ఏ వ్యాపారమైనా భేషుగ్గానే ఉంటుందమ్మా.
వినాయకుడు వ్యాపారం మొదలెడితే, మనకూ ఆయనకూ తేడా ఉంటుందంటారా?
-కాశీభట్ల రాజగోపాలం, రాజోలు
కచ్చితంగా ఉంటుంది. మనమైతే నాలుగు రాళ్లు వెనకేసుకుంటాం. ఆయనైతే నాలుగు ఉండ్రాళ్లు ముందేసుకుంటాడు.
వ్యాపారులంతా ఒక్కసారిగా వేదాంతులైపోతే...
-బి. శ్రీకాంత్, బరంపురం
ఇక ప్రతి మాల్‌లోనూ కనిపించేవి రుద్రాక్షమాలలే.
నేటి విలాస పురుషుడే...
-వల్లూరి గోవిందరావు, శివకోడు
రేపటి 'లాస్' పురుషుడు
'టైమ్' బాగాలేకపోతే?
- ఎన్. సుధాకర్, గంపలగూడెం.
టైటాన్ కంపెనీ కూడా ఘడియలు లెక్కెట్టుకోవాల్సిందే
బిచ్చగాళ్లు రిటర్న్స్ ఫైల్ చేస్తే
-ఎం.శ్రీనివాస్, కాకినాడ
హ్యాపీ 'రిటర్న్స్' చెప్పాలి. అయినా మీకు తెలియదా, ఏమిటీ...! ఆడవాళ్ల వయసు, బిచ్చగాళ్ల సంపాదన అడగకూడదు కదా!
పైకి రావాలంటే ఏ పరిశ్రమ మంచిది?
- యెండూరి రమేష్, తాటిపాక
'పట్టు'పరిశ్రమ
కవ్విస్తే ఏంచేస్తారు?
-ఎన్. గోపాలరావు, నిజామాబాద్
cow ఇస్తే ఎవరైనా ఏం చేస్తారు. పాలు పంచుకుంటారు లేదా పాలవ్యాపారం చేసుకుంటారు. అయినా మీ 'పాల'బడ్డప్పటి సంగతి గదా!
ఇంటర్ చదివాను. వ్యాపారంలో ఎలాగైనా నెట్టుకు రావాలంటే ఏం చేయాలి?
- ఎస్. శ్రీహర్ష, ఏలూరు
'ఇంటర్'నెట్టును నమ్ముకుంటే సరి!
అబద్ధాలు చెబితే వ్యాపారం దెబ్బతింటుందా?
- కె. గోపీనాథ్, చిత్తూరు
మీరు చెప్పేవి అబద్ధాలని ఎదుటివారికి తెలిస్తే దెబ్బతింటుంది.
ప్రపంచ బ్యాంకు తలతాకట్టు పెట్టించుకుంటుందా?
-పి. అనూరాధ, గూడూరు
'నేతల తాకట్టు' పెట్టించుకుంటుంది.
ఎఫ్‌ఎమ్ రేడియోల భవిష్యత్తు ఎలా ఉండొచ్చంటారు?
-కె.రాధారాణి, సింగరాయకొండ
'విను'యోగదారుల మీద ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కంప్యూటర్ వ్యాపారం ప్రత్యేకత ఏమిటో?
-గోవిందవఝ్ఝల విశ్వనాథ శర్మ, ముంగండ
ఏముంది... అంతా ఒక 'సిస్టమ్' ప్రకారం సాగడమే.
(Eenadu, 23:09:2007)
_____________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home