My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, September 30, 2007

చరిత్రలో ఈవారం

సెప్టెంబరు 30
1687: వెుఘల్‌చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు.

1882:
ప్రపంచపు తొలి జలవిద్యుత్‌కేంద్రం అమెరికాలోని ఫాక్స్‌నది(విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని యాపిల్‌టన్‌నగరం) వద్ద ప్రారంభమైంది. అనంతర కాలంలో దానికి 'యాపిల్‌టన్‌ ఎడిసన్‌ లైట్‌కంపెనీ' అని పేరు పెట్టారు. యాపిల్‌టన్‌ నగరానికి చెందిన కాగితం తయారీదారు హెచ్‌.ఎఫ్‌.రోగర్స్‌ దీని నిర్మాణం చేపట్టాడు. అంతకు ముందే థామస్‌ అల్వా ఎడిసన్‌ న్యూయార్క్‌లో ఆవిరితో విద్యుదుత్పత్తి చేపట్టడమే రోగర్స్‌కు ఆదర్శం. వెుదట్లో ఆ జలవిద్యుత్కేంద్రం ఉత్పత్తి చేసిన విద్యుత్తు 12.5కిలోవాట్లు మాత్రమే. దాంతో రోగర్స్‌ రెండు పేపర్‌ మిల్లుల్లో ఒకదానికీ అతని ఇంటికీ విద్యుత్‌ ప్రసారమయ్యిందంతే!

1954: అణుశక్తితో కదిలే ప్రపంచపు తొలి సబ్‌మెరైన్‌ (జలాంతర్గామి) 'యుఎస్‌ఎస్‌ నాటిలస్‌' జలప్రవేశం.

1971:
పీవీ నరసింహారావు మనరాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి తెలంగాణ నాయకుడాయన.


1993:
మహారాష్ట్రలోని లాతూరులో ఘోర భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై 6.3గా నవోదైన దాని తీవ్రత కారణంగా లాతూరు, ఒస్మానాబాద్‌జిల్లాల్లో దాదాపు 7600 మంది చనిపోయారు. 25గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. మరో 50కిపైగా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 'కాలాగుంబజ్‌' వంటి చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాలూ ఎన్నో ఆలయాలూ శిథిలమయ్యాయి.


2005: డెన్మార్క్‌ పత్రిక జిల్లాండ్స్‌పోస్టెన్‌ మహ్మద్‌ప్రవక్తను ఉద్దేశిస్తూ 12 వ్యంగ్యచిత్రాలను ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ఆగ్రహానికి కారణమైంది.

అక్టోబరు 1
1953:ఆంధ్రరాష్ట్రావతరణం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైంది.

1869: ఆస్ట్రియా ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారి పోస్టుకార్డుల్ని మార్కెట్లోకి విడుదల చేసింది.

1889: విద్యుత్‌బల్బును కనిపెట్టిన థామస్‌ అల్వా ఎడిసన్‌ ప్రపంచపు తొలి 'ఎలక్ట్రిక్‌ లాంప్‌ ఫ్యాక్టరీ'ని ప్రారంభించాడు.

1958: నాసా(నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) కార్యకలాపాలు ప్రారంభం. అంతరిక్షపరిశోధనల నిమిత్తం అంతకుముందు వరకూ నాసా స్థానంలో 'నాకా(నేషనల్‌ అడ్వైజరీ కమిటీ ఫర్‌

ఏరోనాటిక్స్‌)' అనే విభాగం ఉండేది.

1964:
జపాన్‌ రాజధాని టోక్యో నుంచి ఒసాకాకు తొలి బుల్లెట్‌రైలు ప్రయాణం. అప్పట్లో దాని వేగం గంటకు 210 మైళ్లు.

1982: 'సిడిపి-101' పేరుతో సోనీ కంపెనీ ప్రపంచంలోనే తొలి సీడీ ప్లేయర్‌ (ఆడియో కంపాక్ట్‌డిస్క్‌ ప్లేయర్‌)ను మార్కెట్లోకి విడుదల చేసింది.

2000: 'భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL)' కార్యకలాపాలు ప్రారంభం.

2003: తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తున్న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై నక్సల్స్‌ హత్యాయత్నం. ఆయన కారు అలిపిరి వద్దకు రాగానే మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదం నుంచి చంద్రబాబునాయుడు గాయాలతో బయటపడ్డారు.

2006: పాండిచ్చేరి(ఆల్టరేషన్‌ ఆఫ్‌ నేమ్‌) యాక్ట్‌, 2006 ప్రకారం ఆ రాష్ట్రం పేరును పుదుచ్చేరిగా మార్చారు.

అక్టోబరు 2
1869: మహాత్మా గాంధీ జననం.

1904: లాల్‌బహదూర్‌శాస్త్రి జననం.

1971: హైదరాబాదులో 'జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(JNTU) స్థాపన.

1985: వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది.

అక్టోబరు 3
1952: 'హరికేన్‌' పేరుతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వెుదటిసారి అణ్వస్త్రపరీక్ష నిర్వహించింది.

1990: తూర్పు, పశ్చిమ జర్మనీలు ఏకమయ్యాయి.

అక్టోబరు 4

1537: పూర్తిస్థాయిలో ఇంగ్లిషుభాషలోకి అనువదించిన బైబిల్‌ ప్రచురితమైంది.

1582: పోప్‌ గ్రెగొరియన్‌IIIరూపొందించిన ఆధునిక క్యాలెండర్‌ అమల్లోకి వచ్చింది. వెుదటగా ఇటలీ, పోలండ్‌, పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాలు గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ను పాటించడం వెుదలుపెట్టాయి.

1977: నాటి భారత విదేశాంగమంత్రి వాజ్‌పేయి ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించి సంచలనం సృష్టించారు.

1983: స్కాట్లాండుకు చెందిన రిచర్డ్‌నోబుల్‌ థరస్ట్‌ 2 అనే హైస్పీడ్‌ వాహనంలో గంటకు 1019కి.మీ. వేగంతో ప్రయాణించి(నెవాడా ఎడారుల్లో) రికార్డు సృష్టించాడు. అప్పటికదే అత్యధిక వేగం.

అక్టోబరు 5
1905: రైట్‌ఫ్లయర్‌-3 విమానంలో విల్బర్‌రైట్‌ 24మైళ్ల దూరాన్ని 39నిమిషాల్లో అధిగమించాడు. 1908 వరకూ అది ప్రపంచరికార్డు.

అక్టోబరు 6

1860: భారత శిక్షాస్మృతికి(ఇండియన్‌ పీనల్‌కోడ్‌) రూపకల్పన జరిగింది. కానీ దాదాపు 14 నెలల తర్వాత...
1862 జనవరి 1 నుంచి అది అమల్లోకి వచ్చింది.


(Eenadu, 30:09:2007)

___________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home