'అంధకులు ' ఎవరు?
తొలి బౌద్ధ గ్రంథాలన్ని పాళీ(ప్రాకృత) భాషలో రచించబడ్డాయి. ఈ పాళీ భాషలో ఆంధ్రులు 'అంధకులని' పిలువబడినారు. తొలి బౌద్ధ గ్రంధాలలో ఒకటైన 'సుత్తనిపాతాన్ని ' బట్టి 'అంధకరట్టం '('అంధ ' ప్రాచీనరూపం, ఆంధ్ర ' తర్వాతరూపం; అందుచేత అంధకరట్టం అంటే ఆంధ్రరాష్ట్రం) గోదావరినది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తుంది.ఈ 'సుత్తనిపాత ' గ్రంథంపైని వ్యాఖ్యానంలో అళక లేక అస్సక, ముళక జనపదాలు అంధక రాష్ట్రాలని చెప్పబడ్డాయి. వీనిలో అళక లేక అస్సక జనపదానికి పోతన(ఇప్పటి బోధన్) రాజధాని... .....అస్మక జనపదం గొదావరి, మంజీరానదుల ఉభయ తటాలను ఆవరించి, కొంత మహారాష్ట్ర దేశంలో, కొంత తెలంగాణ వాయవ్య ప్రాంతంతో కూడిఉన్న భూభాగమని చెప్పవచ్చు. ముళకదేశం గోదావరీనదికి ఉత్తరంగా వ్యాపించి ఉన్న నేటి మహారాష్ట్ర లోని ఔరంగాబాద్‌జిల్లా. అందుచేత నేటి తెలంగాణాలోని నిజమాబాద్‌జిల్లా, దానిని వెంబడించిన గోదావరిప్రాంతం కొంత, మహారాష్ట్రంలోని ఔరంగాబాదు జిల్లా(ఈ జిల్లాలోనే అజంతా బౌద్ధ గుహలున్నాయి) ఉన్నభూభాగానినే క్రీ.పూ. నాల్గు అయిదు శతాబ్దాల ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రం('అంధకరట్టం ') అనేపేరు ఉండేది.
గోదావరీ ఉభయతీరాల్లో ఉన్న ఆంధ్రులు క్రమంగా కృష్ణా గోదావరినదుల మధ్యదేశాన్ని ఆక్రమించినట్లున్నారు .బౌద్ధగ్రంథాల తర్వాతనే మహాభారత రచన, దాని చివరి రూపం సంతరించుకుంది( క్రీ.శ.నాల్గవ శతాబ్దం). దానిలో ఆంధ్రులు క్రిష్ణా గోదావరీ మధ్యదేశాలలో ఉన్నట్లు చెప్పబడింది( అంధ్రకా: కృష్నా గోదావర్యో మధ్యే విద్యమానే దేశ://)
(Ref:తెలుగు చరిత్ర-సంస్కృతి; తెలుగు అకాడామి, హైదరాబాదు,1986) ________________________________
Pl. also see
TELUGU...a language sweeter than honey
_______________________________________Labels: Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home