చరిత్రలో ఈవారం
అక్టోబరు 8
1932: భారత వైమానిక దళం(ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) స్థాపన. ఆ సందర్భంగా ఏటా ఈ రోజును భారత వైమానిక దళ దినోత్సవంగా జరుపుకొంటారు.
2005: పాకిస్థాన్ కాలమానం ప్రకారం ఉదయం 08:50:38 నిమిషాల ప్రాంతంలో పాక్‌ఆక్రమిత కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 7.3గా నవోదైన దాని తీవ్రతకు దాదాపు 74వేల మంది మరణించారు. సుమారు లక్ష మంది నిరాశ్రయులయ్యారు.
1967: బొలీవియాలో గెరిల్లా యుద్ధ కార్యకలాపాలు నడుపుతున్న క్యూబా విప్లవ యోధుడు చేగువేరా అమెరికన్ గూఢచార సంస్థ సి.ఐ.ఎ. ఏజెంట్ రోడ్రిగ్జ్ ఫిలిప్స్ నేతృత్వంలోని బృందానికి పట్టుబడ్డాడు. ఆ రాత్రికే వారు 'చే'ను సమీపంలోని 'లా హిగువేరా' గ్రామానికి తరలించారు. మర్నాడు మధ్యాహ్నం(అక్టోబరు 9) ఒంటిగంటా పదినిమిషాలకు గ్రామంలోని స్కూలు భవనంలో మారియో టెరాన్ అనే బొలీవియన్ సార్జెంటు చేగువేరాను కాల్చిచంపాడు. అనంతరం మృతదేహాన్ని హెలికాప్టర్‌లో సమీప పట్టణమైన వ్యాలీగ్రాండ్‌కు తరలించి అక్కడి ఓ ఆసుపత్రిలో విలేకరులకు ప్రదర్శించారు. అలా మూడురోజులపాటు అక్కడే ఉంచి చే రెండుచేతుల్నీ తొలగించారు(అందుకు స్పష్టమైన కారణాలేంటో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు). ఆ తర్వాత ఆయన భౌతిక కాయాన్ని గుర్తుతెలియని ప్రదేశానికి పంపారు. అక్టోబరు 15న చే మృతి గురించి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్‌క్యాస్ట్రో అధికారికంగా ప్రకటించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వ్యాలీగ్రాండ్ ప్రాంతంలో చేతులు లేని ఓ అస్థిపంజరం బయటపడింది. పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్ అధికారులు అవి చే తాలూకూ ఆనవాళ్లే అని నిర్ధరించారు. చివరకు 1997 అక్టోబరు 17న శాంటాక్లారా(క్యూబా)లో సైనికలాంఛనాలతో ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపింది.
అక్టోబరు 9
ప్రపంచ తపాలా దినోత్సవం. 1874కు ముందు వరకూ తపాల సేవల నిమిత్తం ప్రతిదేశం ఇతర దేశాలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వచ్చేది. అంతకన్నా సులభంగా... ఒక అంతర్జాతీయ తపాలా సంస్థను స్థాపిస్తే బావుంటుందని అమెరికా పిలుపునిచ్చింది. ఆ మేరకు 1874, అక్టోబరు 9న 'జనరల్ పోస్టల్ యూనియన్' సంస్థ స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరంలో లాంఛనంగా ఏర్పాటయింది. 1878లో దాని పేరును 'యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యు.పి.యు.)'గా మార్చారు. 1969 నుంచి ఏటా అక్టోబరు 9ని ప్రపంచ తపాలా దినోత్సవంగా నిర్వహించాలని నిశ్చయించారు. భారతదేశం సహా 190కి పైగా దేశాలకు యు.పి.యు.లో ప్రస్తుతం సభ్యత్వం ఉంది.
1874: వాడి-సికింద్రాబాద్ రైల్వేలైనుతో నిజాం రాష్ట్ర సొంతరైల్వే వ్యవస్థ ఏర్పాటైంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్పుడు ఏర్పడిందే.
2004: అఫ్గానిస్థాన్‌లో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.
అక్టోబరు 10
1930: శాండర్స్ హత్యకేసు తదితర నేరారోపణలపై భగత్‌సింగ్ ఆయన సహచరులు సుఖదేవ్, రాజగురులకు
కోర్టు ఉరిశిక్ష విధించింది.దాదాపు 5 నెలల తర్వాత 1931, మార్చి 23న ఆ శిక్షను అమలుపరిచారు.
అక్టోబరు 12
1850: ప్రపంచంలోనే తొలి వైద్యకళాశాల అమెరికాలోని పెన్సిల్వేనియాలో ప్రారంభమైంది.
1901: అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ 'వైట్‌హౌస్' పేరును అధికారికంగా ప్రకటించాడు. అంతకు ముందు దాన్ని 'ఎగ్జిక్యూటివ్ మ్యాన్షన్'గా పిలిచేవారు.
1999: ప్రపంచ జనాభా 600కోట్లకు చేరుకుంది.
2005: మన దేశంలో సమాచారహక్కు చట్టం అమల్లోకి వచ్చింది.
అక్టోబరు 13
1542: మొఘల్‌చక్రవర్తి అక్బర్ జననం.
1792: అమెరికా అధ్యక్షభవనం శ్వేతసౌధ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
1884: 'గ్రీన్‌విచ్ మీన్ టైం' గణన ప్రారంభం.
అక్టోబరు 14
1956: లక్షలాది దళితులతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు.
_______________________________
Labels: Events
0 Comments:
Post a Comment
<< Home