ఆంగ్లం నేర్వండి ఆకలి తీర్చండి
ఓ చిన్న ఆలోచన...
వేల మంది బతుకులను నిలబెడుతోంది.
అమెరికాలో వచ్చిన ఆలోచన...
ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కడుపులను నింపుతోంది.
ఆ ఆలోచన... ఇంటర్నెట్ ముందు కూర్చొని ఆంగ్లపదాలతో
ఆటాడుకొని అన్నం పెట్టడం! ఆకలిచావు... ఈ మాట వినగానే ఒళ్లు జలదరిస్తుంది. ఏమీ చేయలేమా, పరిస్థితిని మార్చలేమా... అన్న ఆలోచనలతో మనసు బరువెక్కుతుంది. ఇది మామూలే. కానీ ఇకముందు అలా బాధపడనక్కర్లేదు. 'నేను సైతం...' అనుకుంటూ ఇంటర్‌నెట్ ముందు కూర్చొని www.freerice.com వెబ్‌సైట్ ఓపెన్‌చేసి మీకు ఓపికున్నంతసేపు కూర్చుని సాధ్యమైనంత అన్నం పోగేయండి. దానంతట అదే ఆకలి కడుపులకు చేరిపోతుంది. ఇంటర్నెట్‌కూ అన్నానికీ సంబంధమేమిటా అని ఆశ్చర్యంగా ఉంది కదూ! నెట్‌లో ఏం చేస్తే ఏం ఇబ్బందో అని కంగారుగా కూడా ఉందా? మరేం ఫర్వాలేదు మీరు చేయాల్సిందల్లా ఆంగ్లంతో కాసేపు ఆడుకోవడమే.
ఏమిటీ ఆట
ఈ వెబ్‌సైట్ హోమ్ పేజీ ఓపెన్ చేయగానే ఓ ఆంగ్ల పదం, దాని కింద మరో నాలుగు పదాలు కనిపిస్తాయి. పై పదానికి కిందనున్న నాలుగింటిలో సమాన అర్థాన్నిచ్చే పదం మీద క్లిక్ చేయగానే 10 బియ్యపు గింజలు ఒక దగ్గర చేరతాయి. 'ఇంటర్‌నెట్‌లో ఇంగ్లీష్ ఆటా. మా ఆంగ్ల భాషా పరిజ్ఞానం అంతంతమాత్రమే' అని వెనకడుగు వేయకండి. స్కూల్ పిల్లల నుంచి ఇంగ్లిషు పరిజ్ఞానం బాగా ఉన్నవాళ్ల వరకూ ఆడుకోడానికి వీలున్న ఆట ఇది. వెుదట సాధారణ స్థాయి పదాలతో వెుదలవుతుంది. సమాధానాలు ఇస్తూ పోతుంటే కొత్త ప్రశ్నలు వాటంతట అవే వస్తుంటాయి. వరసగా మూడుసార్లు సరైన జవాబును క్లిక్ చేస్తే ప్రశ్నల స్థాయి పెరుగుతుంది. అంటే కాస్త కఠినమైన పదాలకు అర్థాలు కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఒక వేళ సమాధానం తప్పయిందనుకోండి... మరో ప్రశ్న ప్రత్యక్షమవుతుంది. అలా మనకు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవచ్చన్నమాట. దీన్లో వెుత్తం 50 స్థాయులున్నాయి! SAT, GRE, GMAT పరీక్షలు రాసే వారూ, ఉద్యోగులూ, గృహిణులూ, రిటైర్డ్ ఉద్యోగులూ... ఇలా అన్ని వర్గాల వారూ ఓ పక్క ఆంగ్లం నేర్చుకుంటూనే తమ పరిధిలో అన్నార్తులకు సాయం చేయెుచ్చు. కరెంటు పోవడం లేదా మరే కారణంతోనైనా సైట్ నుంచి బయటకు వచ్చేసినా అప్పటివరకూ పోగు చేసిన బియ్యపు గింజలు సరఫరాకి సిద్ధమయిపోతాయి. ఎన్ని బియ్యపు గింజలు పొందారో ఎప్పటికప్పుడు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అవన్నీ అప్పటికే మీ సర్వర్ నుంచి రిజస్టర్ అయిఉండటంతో ఆటోమేటిగ్గా చెల్లింపుల లెక్కలోకి వెళ్లిపోతాయి.
ఎవరు చెల్లిస్తారు?
ప్రశ్నలకు జవాబు ఎంపిక చేసేటపుడు వెబ్‌పేజ్ అడుగున స్పేస్ పొందే ప్రకటనకర్తలు ఆ బియ్యపు గింజలకు అవసరమయ్యే డబ్బు చెల్లిస్తారు. ఆంగ్ల పదజాలాన్ని నేర్పడం, ఆకలి తీర్చడం... ఒకేసారి రెండు లాభాలు కల్పిస్తోన్న ఈ సైట్‌లో ప్రకటనలిచ్చేందుకు ఆపిల్, తొషిబా వంటి అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇలా ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంలోనుంచి బియ్యానికి అవసరమయ్యే డబ్బును ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే ప్రపంచ ఆహార పథకం(డబ్ల్యూఎఫ్‌పీ) నిర్వాహకులకు అందిస్తారు.
పది గింజలతో... సాధ్యమే
ఈ ఏడాది అక్టోబరు 7న ప్రారంభమయిన ఈ వెబ్‌సైట్ ద్వారా వెుదటిరోజు కేవలం 830 బియ్యపు గింజలు మాత్రమే అందాయి. నెల తిరిగేసరికి లక్ష సరైన క్లిక్కులతో 20 టన్నుల బియ్యం సిద్ధమయ్యాయి. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో వెుదలయినట్టు దీనంతటికీ పునాది పది బియ్యపు గింజలే. అయినా ఇప్పుడు రోజూ 50 వేల మందికి ఆహారం అందుతోంది. అలాంటపుడు ఈ సాయం చిన్నదని ఎలా అనుకోగలం!
ఆలోచన వెనుక...
జాన్ బ్రీన్ అమెరికా దేశీయుడు... వెబ్‌సైట్ల రూపకల్పన ఇతడి వృత్తి. బ్రీన్ ఓసారి ఓ ఆన్‌లైన్ గేమ్ తయారుచేయాలనుకున్నాడు. ఏదో ఆషామాషీ గేమ్‌లా కాకుండా దానికో ప్రయోజనం కూడా ఉంటే బాగుణ్ననిపించింది బ్రీన్‌కు. తీవ్రంగా ఆలోచిస్తున్న అతడికి ఎదురుగా ఓ కాంపిటీటివ్ పరీక్షకు సీరియస్‌గా సిద్ధమవుతోన్న కొడుకు కనిపించాడు. వెంటనే బ్రీన్ బుర్రలో ఓ ఆలోచన మెరిసింది. 10 వేల ఆంగ్ల పదాలను తీసుకున్నాడు. 'ఫ్రీరైస్' సిద్ధం చేశాడు. 'ఆకలి, పేదరికం... అందోళన కలిగించే అంశాలివి. నేను ఏం చేసినా అది మన ఆందోళననూ వారి ఆకలినీ దూరం చేయాలి. అందుకే ఈ సైట్ రూపొందించాను' అంటాడు బ్రీన్. ఒక్క ప్రశ్నకు సరైన సమాధానమిస్తే రెట్టింపు ఆనందం కలుగుతోంది అంటున్నారు నెటిజన్లు. వెుదటిది సరైన జవాబు చెప్పినందుకయితే రెండోది ఆకలి కడుపు నింపినందుకు!
బాగుంది కదూ, ఇంకెందుకు ఆలస్యం. ఫ్రీరైస్ రుచి చూడండి మరి.
(Eenadu, 25:11:2007)
______________________________________
ఈ సైట్లో నాకెదురుపడ్డ (మచ్చుకు) కొన్ని ఆంగ్ల పదాలు:-
ineluctable = unavoidable
erumpent = bursting out
simulacrum = image
contrail = aircraft vapour
basinet = medieval helmet
insouciant = carefree
profligate = dissolute
unwonted = rare
styptic = acting to stop bleeding
gnar = growl
concupiscence = passionate desire
conflate = blend
ilex = holly
zax = roofing hatchet
abaca = manila hemp
sidereal = astral
purport = intend
nous = mind
proglottid = tapeworm segment
margay = wildcat
tenebrous = dark
plangent = resounding
oubliette = dungeon
boscage = thicket
pelerine = woman’s cape
nostrum = cure-all
farci = stuffed with meat
durance = imprisonment
canorous = melodious
beatify = make happy
chatoyant = iridescent
meretricious = tawdry
foulard = silk
hebdomadal = weekly
aperient = laxative
remuda = herd of horses
muliebrity = womanhood
faience = earthenware
alidade = surveying instrument
ephemeris = astronomical table
______________________________________Labels: English usage
0 Comments:
Post a Comment
<< Home