My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, November 20, 2007

మహనీయుడి చరిత్ర

పకోడీ మీద పద్యం చెప్పినా, 'భరతఖండంబు చక్కని పాడియావు' అని ఆంగ్లేయుల మీద ధ్వజమెత్తినా చిలకమర్తికే చెల్లింది. పద్యం, నాటకం, నవల ఇత్యాది అన్ని సాహితీప్రక్రియల్లోనూ ఆయనది అసాధారణ ప్రజ్ఞ. మచ్చుకు 'గయోపాఖ్యానం', 'గణపతి' చాలు. ఈ తొలి తెలుగు జాతీయోద్యమ కవి, సంఘసంస్కర్త 1944లో వెలువరించిన 'స్వీయచరిత్రము' పునర్ముద్రించిన ప్రాచి పబ్లికేషన్స్‌ వారిని అభినందించాల్సిందే. '...రాత్రులు నేను దీపముముందర తలపెట్టుకొని, కన్నులకు పుస్తకము మిక్కిలి దగ్గరపెట్టుకొని యైదారుపంక్తులు చదువ ప్రయత్నించుచుండెడివాడను' అంటూ, తనను అంధత్వం ఎలా బాధించిందో, లెక్కలతో పడిన చిక్కులేమిటో, అప్పులతో వచ్చిన తిప్పలేమిటో, రెండో ప్రతి రాసుకునే అలవాటు లేక ఎన్ని పద్యాల్ని పోగొట్టుకున్నారో వెల్లడించారు చిలకమర్తి. 'పశువులు మన యింట నుండవచ్చును. కుక్కలుండవచ్చును. కాని పంచములు మట్టుకు మన గృహావరణములోనికి రాగూడ'దా? అని ప్రశ్నించిన ఆయన ఆత్మకథ అప్పటి(ఇప్పటి అనకూడదా!) ఆంధ్రదేశ పరిస్థితులను కళ్లముందుంచుతుంది. భాష నేటితరానికి కొరుకుడుపడుతుందా... అన్నది కొట్టేయాల్సిన విషయం కాకపోయినా, ఇష్టంగా చదివితే అందులోని మాధుర్యాన్ని రుచిచూడవచ్చు. స్వీయచరిత్రము;

రచన: చిలకమర్తి లక్ష్మీనరసింహము;
పేజీలు:
410;
వెల: రూ.125/-
ప్రతులకు: ప్రాచి పబ్లికేషన్స్‌, 3-3-859/1/ఎ,
రెండో అంతస్తు, కాచిగూడ, హైదరాబాద్‌-27.

- షేర్‌షా(Eenadu, 18:11:2007)
_____________________________________________________

(http://www.avkf.org/BookLink/view_subjects.php?current_number=166)
_____________________________________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home