ఫన్‌కర్ ఫటాఫట్
*నేను పట్టిందల్లా బంగారం కావాలంటే?
బంగారం దుకాణం పెట్టేయడమే.
___________________________
*కొండమీది కోతి దిగిరావాలంటే ఏం చేయాలి?
ముందు మనం కొండ మీది కెక్కాలి. మన పోటీ తట్టుకోలేక దానంతటదే దిగివస్తుంది.
______________________________
* తొలి కాన్పులోనే అమ్మాయి పుట్టిన దంపతులకు మీరిచ్చే ఉచిత 'ఆర్థిక' సలహా?
'లక్ష్మీ' ప్రసన్నమయిందనుకుంటే సరి...! రావలసిన డబ్బు చేతికి రాకున్నా దిగులు ఉండదు.
_________________________________
* రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు ఎందుకు దోచుకుంటున్నారు?
అదేమిటండీ వాళ్లను అలా అంటారు. రాష్ట్రమైనా, దేశమైనా అంతా 'మనదే' అనుకునే బోళా మనసు వాళ్లది.
__________________________________
* కుక్కను తన్నితే డబ్బులు రాల్తాయంటారు గదా పెద్దలు... ఎంత తన్నినా రాలడం లేదేమిటండీ?
డబ్బు రాలేమాట నిజమే... కానీ, మీకు కాదు డాక్టరుకు! ఎందుకైనా మంచిది పిచ్చికుక్కను మాత్రం తన్నకండి.
___________________________________
* రాజకీయాల్లో వెన్నుపోటు... మరి వ్యాపారాల్లో?
పన్నుపోటు
__________________________________
* మా వాడొకడు రకరకాల వ్యాపారాలు పెట్టి, ఆడవాళ్లను భాగస్వాములుగా చేసుకొని వాళ్లను బుట్టలో వేసుకోవాలని చూస్తుంటాడు. వాడికి మీరిచ్చే సలహా!
భాగస్వామ్యం మంచిది కాని 'భోగ'స్వామ్యం కొంప ముంచుతుందని!
_______________________________
* కాంటాక్టులు పెంచుకుంటే?
'కాంట్రాక్టులు' గ్యారంటీ.
__________________________________
* సినీ హీరోయిన్లు ఎక్కువగా వ్యాపారవేత్తలనే ఎందుకు ప్రేమించి, పెళ్లాడతారు?
'నటించే'వాళ్లను చూసి విసుగెత్తిపోయి.
___________________________
(Eenadu, 23:12:2007)
___________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home