ఫన్‌కర్ ఫటాఫట్
____________________________
* మా ఫ్రెండ్‌ది షేర్ల వ్యాపారం. దానికి తగ్గట్టే తన కూతురుకి లావా'దేవీ' అని పేరు పెట్టాడు. కొడుకు పుడితే ఏ పేరు పెట్టాలంటారు?
_______________________________
* అప్పిచ్చువాడు వైద్యుడయితే అప్పు తీసుకునేవాడు?
రోగి. ఎందుకంటే డాక్టరుకి బిల్లు కట్టాక అతని వద్ద ఏం మిగులుతుంది కనుక!_____________________________
* నేను వ్యాపారం చేస్తుంటాను. చిత్రమేమిటంటే షాపులోకి వెళ్లగానే నాకు నిద్ర ముంచుకొస్తుంది. తెలిసిన వాళ్లంతా నవ్వుతున్నారు. నాకు మీ సలహా కావాలి.
ఎంత సంపాదించినా కంటికి నిద్రపట్టని వాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వాళ్లతో పోల్చుకుంటే మీరు ఎంతో అదృష్టవంతులు. ఎటొచ్చీ మీరు గుండె మీద కాక జేబు మీద చెయ్యి వేసుకుని నిద్రపోండి.____________________________
* పెళ్లి అనే వ్యాపారానికి ప్రేమ పెట్టుబడి అంటాను. మీరేమంటారు?
పిల్లలు లాభనష్టాలు అంటాను._____________________________
* నాకు ఓ వైన్ షాపు ఉంది. తమాషా ఏమిటంటే అందరిచేత తప్ప తాగిస్తాను తప్ప నేను తాగను. నేను రాజకీయాల్లో చేరాలనుకుంటున్నాను. మీ సలహా?
రాజకీయాల్లో చేరాక కూడా మీరు ఇదే విధానాన్ని అవలంబిస్తారు. ఇతరులతో తప్పులు చేయిస్తారు తప్ప.. మీరు చేయరు.____________________________
* మావారు బైక్ నడపనంటున్నారు. ఏం చేయమంటారు?
'నడిపేది మీరయినా, నడిపించేది నేనే' అని గట్టిగా చెప్పండి. ఆ తర్వాత బండి దానంతట అదే నడుస్తుంది.____________________________
* కాజోల్ కళ్లు, కరెంటు బిల్లు. ఈ రెంటికీ ఉన్న పోలిక?
రెండూ జేబు కొట్టేసేవే!_____________________________
* నేను ఒక హోటల్ పెడుతున్నా. అందరినీ ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి?
'మా హోటల్లో భోజనం చేస్తే మీ ఇంటి వంటను మీరు మర్చిపోతారు' అని బోర్డు పెట్టండి. కనీసం అప్పుడైనా ఇంటిని మర్చిపోవచ్చు కదా అని మగరాయుళ్లు క్యూకడతారు.____________________________
(Enadu, 16:12:2007)
______________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home