My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, March 20, 2008

విలక్షణమైన విలనీ ఇక లేదు




'శివ... శివ... ఎవడా శివ? ఆఫ్ట్రాల్‌ ఓ స్టూడెంట్‌! రెండు లారీల జనాన్ని తీసుకెళ్లి నరికేయండి' - ఈ డైలాగ్‌ 90వ దశకంలో తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొంది. అంతేకాదు ఆ సంభాషణలు పలికిన నటుడి హావభావాల్నీ, నటన శైలిని చూసి ఇటు ప్రేక్షక లోకం... అటు సినీ రంగం ఓ మంచి నటుడు మనకు దొరికాడు అనుకొంది. నిజానికీ ఆ ప్రతినాయకుడికి అది తొలి చిత్రం ఏమీ కాదు. అప్పటికే మన తెలుగువారికి అతని ముఖం పరిచయమే. 'పసివాడి ప్రాణం'లో వికలాంగుడైన విలన్‌ని చూసినప్పుడే అందరూ మంచి నటుడు అన్నారు. కానీ 'శివ' తరవాతే వరుసగా సినిమాలు చేశారు. అతనే రఘువరన్‌. విలనీకి ఆయన కొత్త అర్థాన్ని చెప్పారు. భయంకరమైన మేకప్పులు, అరుపులతో సాగిపోతున్న ప్రతినాయకుల ధోరణికి అడ్డుకట్ట వేశారు. ట్రెండ్‌కి అనుగుణమైన ఆహార్యంలో కనిపిస్తూ - ఆధునిక శైలిలో మాట్లాడుతూ తేనె పూసిన కత్తిలాంటి విలన్‌గా కనిపించడం ఆయన పద్ధతి.

సంభాషణ చతురుడు: చెన్నైకి చెందిన రఘువరన్‌ 1982లో సినీ రంగ ప్రవేశం చేశారు. 'ఏళావదు మణిదన్‌' ఆయన తొలి చిత్రం. అందులో కథానాయకుడిగా నటించారు. అయితే అనూహ్యంగా ప్రతినాయకుడిగా ఎదిగారు. తెలుగులో 'మిస్టర్‌ భరత్‌' రఘువరన్‌ మొదటి సినిమా. పూర్తి గుర్తింపుని తీసుకొచ్చింది మాత్రం 'పసివాడి ప్రాణం'. పోలియో వ్యాధిగ్రస్తుడైన ప్రతినాయకుడిగా కనిపిస్తారు. అతనికీ ఓ పసివాడికీ, చిరంజీవికీ మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. రఘువరన్‌ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం రామ్‌గోపాల్‌ వర్మ 'శివ'. అందులో భవానీ పాత్రలో ఒదిగిపోయిన తీరు పలు అవకాశాల్ని తీసుకొచ్చింది. రజనీకాంత్‌తో చక్కటి స్నేహబంధం ఉంది. ఆయన హీరోగా నటించిన అనేక చిత్రాల్లో విలన్‌గా రఘువరన్‌ నటించారు. 'బాషా'లోని ఆంథోనీ పాత్ర తమిళ ప్రేక్షకుల్ని అలరించింది. ముత్తు, అరుణాచలం లాంటి సినిమాల్లో రజనీతో కలిసి నటించారు. 'ప్రేమికుడు', 'ఒకే ఒక్కడు', 'ఆజాద్‌', 'రక్షకుడు', 'మాస్‌' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆయన ప్రత్యేకతల్లో సంభాషణాచాతుర్యం ఒకటి. తన డైలాగుల్ని స్పష్టంగా వినిపించేలా పలికేవారు. మాటకీ మాటకీ మధ్య రెప్పపాటు గ్యాప్‌ ఇచ్చేవారు. ఈ పద్ధతి ప్రేక్షకులకు నచ్చింది. కేవలం విలన్‌ పాత్రలకే పరిమితం కాలేదు. కథను నడిపే కీలక పాత్రల్లో సైతం చక్కటి నటనను ప్రదర్శించారు. ఇందులో తొలుత చెప్పుకోవల్సింది 'అంజలి' చిత్రమే. మణిరత్నం రూపొందించిన ఈ సినిమాలో చిన్న పాపకు తండ్రిగా రఘువరన్‌ పలికించిన నటన అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలందుకొంది. అలాగే పవన్‌కల్యాణ్‌ తండ్రిగా 'సుస్వాగతం'లో ఆయన నటన చెప్పుకోదగ్గదే. 'రన్‌', 'నాగ', 'వాళ్లిద్దరి వయసూ పదహారే', 'ఆహా', 'చిరునామా' లాంటి చిత్రాల్లో తండ్రిగా, బావగా, అన్నగా మహిళా ప్రేక్షకుల్ని మెప్పించారు. తెలుగు ఆయన నటించిన చివరి చిత్రం 'మంజీరా'. విడుదల కావల్సి ఉంది.

ఒడిదొడుకుల జీవితం: నటి రోహిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. రఘువరన్‌ మద్యానికీ, మత్తు పదార్థాలకీ బానిస అయ్యారు. దీంతో మనస్పర్థలొచ్చి విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత రఘువరన్‌ కర్ణాటకలోని ఓ ఆశ్రమంలో చేరి చికిత్స పొందారు. తమిళంలో 'ఒరు మనిదనిన్‌ కతై' అనే బుల్లితెర ధారావాహికలో నటించారు. ఇందులో మద్యానికి బానిసైన వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఏం కోల్పోతాడో చూపించారు. ఈ కథ రఘువరన్‌ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఆయన మృతి చెందారన్న వార్త తమిళ, తెలుగు చిత్రసీమలో విషాదాన్ని నింపింది. ఆయన నివాస గృహానికొచ్చి విజయ్‌కాంత్‌, శరత్‌కుమార్‌, విజయ్‌, సుహాసిని, మణిరత్నం, అజిత్‌, రాధిక తదితరులు నివాళులర్పించారు. విడాకులు పొందినా ఆయన భార్య రోహిణి, కుమారుడు సాయిరిషి వచ్చి మృతదేహం చెంత ఉండి కన్నీరుపెట్టుకున్నారు. రఘువరన్‌ మృతికి తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. - న్యూస్‌టుడే, చెన్నై (Eenadu, 20:03:2008)
_____________________________

Chennai, March 19: Raghuvaran, one of the most versatile actors in South Indian cinema, passed away early Wednesday at a private hospital here. The 49-year-old veteran of more than 80 films was ailing for sometime and was recently treated for an abscess on the leg. He was discharged but was rushed back to the hospital early on Wednesday when he developed complications. He died shortly afterwards, family sources said.

They said his estranged actor-wife Rohini was by his bedside when Raghuvaran breathed his last. Several film stars visited his house to pay their last respects. He was cremated in the evening. A product of the Film Institute, Raghuvaran made his debut as hero in the offbeat award-winning film Ezhavadhu Manidhan directed by ace filmmaker Hariharan. The tall-lanky actor turned a character artiste and villain, making an indelible impact with his casual screen presence and voice modulation. He had acted with top stars in Tamil, Telugu and Malayalam movies. His memorable films include Samsaram Adhu Minsaram, Badsha, Anjali, Mudhalvan, Sivapadhikaran and Sila Nerangalil.

His personal life suffered some rough times. His marriage ended in divorce and son Sai Rishi, whom he deeply loved, moved away to live with mother Rohini. Personal problems kept him away from the studios and hero Sarath Kumar managed to coax him back to work. “We will badly miss him,” said Sarath after placing flowers on the body. “He was an actor with a unique style and a fine human being too,” said the president of the South Indian Film Artistes’ Association. Star-politician Vijayakanth said Raghuvaran was an ‘incredible’ actor who treated everyone with respect.

(The Deccan Chronicle, 20:03:2008)

Raghuvaran, 59, was survived by his ex-wife Rohini and 8-year-old son Sai Rishi.

=============================

Labels:

0 Comments:

Post a Comment

<< Home