వహీదాకు ఎన్టీఆర్ అవార్డు
హైదరాబాద్, న్యూస్‌టుడే:
ప్రముఖ హిందీ నటి వహీదా రెహమాన్.. 2006 సంవత్సరానికిగాను ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏప్రిల్‌లో నిర్వహించే నంది అవార్డు ప్రదానోత్సవంలోనే వహీదాకు ఈ పురస్కారాన్ని అందజేస్తామని చలనచిత్రాభివృద్ధి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకలోనే 2003, 04, 05లకుగానూ ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్న కృష్ణ, ఇళయరాజా, అంబరీష్‌లను సత్కరించనున్నారు. రూ.5లక్షల నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. హైదరాబాద్‌కు చెందిన వహీదా తెలుగులో 'జయసింహ'లో ఎన్టీఆర్ సరసన నటించారు. 'రోజులు మారాయి'లో ఆమె నర్తించిన 'ఏరువాక సాగారో..' పాట ఇప్పటికీ ఆంధ్రులకు ఇష్టమైనదే! మన భాషలో 'బంగారు కలలు', 'సింహాసనం', 'చుక్కల్లో చంద్రుడు' చిత్రాల్లోనూ ఆమె నటించారు. 'ప్యాసా', 'కాగజ్ కె పూల్', 'రేష్మా అండ్ షెహర్', 'చౌదువీ కా చాంద్', 'గైడ్', 'నీల్‌కమల్', 'రంగ్ దె బసంతి'.. లాంటి పలు చిత్రాలు వహీదాకు ఎంతో గుర్తింపును తీసుకొచ్చాయి. తిలక్, జయసుధ, ఎ.సూర్యనారాయణలతో కూడిన కమిటీ వహీదాను ఎన్టీఆర్ పురస్కారానికి ఎంపికచేసింది.
(Eenadu, 01:03:2008)
=============================
Labels: Cinema, Cinima/ Telugu
0 Comments:
Post a Comment
<< Home