1264- అందుకే అతను ప్రిన్స్
మహేష్‌బాబు... అభిమానులకు ప్రిన్స్, అమ్మాయిలకు రాజకుమారుడు, బాక్సాఫీసును మురిపించిన 'పోకిరి'. వసూళ్ల వర్షం కురిపించిన 'బిజినెస్‌మేన్'. దర్శకులకూ మహేష్ కావాలి, కథానాయికలకూ, వ్యాపార ప్రకటనలకూ అతనే కావాలి. ట్విట్టర్‌లో పలకరిస్తే అభిమానులు పొంగిపోతారు. ఇరవై సెకన్ల టీజర్‌లో కనిపిస్తే 'వన్'మోర్ అంటారు. 'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు..' అని ఎప్పుడైతే అన్నాడో తెలుగు సినిమా తెరపైన హీరోయిజం అనే పదానికి కొత్త అర్థం రాసేసుకొన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మల్టీస్టారర్ చిత్రాలకు కొత్త రూపు ఇచ్చారు మహేష్. ఇప్పుడు '1' కోసం ముస్తాబవుతున్నాడు. శుక్రవారం 'కథానాయకుల్లో మీరే నెంబర్ వన్' అంటే మహేష్ ఎలాగూ ఒప్పుకోవడం లేదు. అందుకే శుక్రవారం మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా ఆయన సినిమా పేరు '1'కి తగినట్టు.. మహేష్ కెరీర్‌లో తొలి అనుభూతులేమిటో ఒక్కసారి రివైండ్ చేసుకొందాం. మహేష్ గురించి సహ నటులు, దర్శకులు, కథానామహేష్‌బాబు తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం 'నీడ'. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు కూడా కొన్ని ఫ్రేముల్లో కనిపిస్తారంతే. ఆయనకు కనీసం డైలాగులు కూడా లేవు. తొలిసారి నాన్నతో తెర పంచుకొన్న చిత్రం 'పోరాటం'. ఈ సినిమాలో కృష్ణకు తమ్ముడిగా కనిపించారు. 'శంఖారావం', 'కొడుకు దిద్దిన కాపురం', 'ముగ్గురు కొడుకులు', 'గుఢచారి 116', 'రాజకుమారుడు', 'వంశీ' తదితర సినిమాల్లో తండ్రీకొడుకులిద్దరూ కనిపించారు. వివిధ సందర్భాల్లో చెప్పిన కబుర్లు నెమరువేసుకొందాం.
* మహేష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'కొడుకు దిద్దిన కాపురం'. ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. మహేష్ నటించిన 'బాలచంద్రుడు' దర్శకుడు కూడా కృష్ణనే.
*మహేష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'కొడుకు దిద్దిన కాపురం'. ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. మహేష్ నటించిన 'బాలచంద్రుడు' దర్శకుడు కూడా కృష్ణనే.
*మహేష్ కథానాయకుడిగా రంగప్రవేశం చేసిన చిత్రం 'రాజకుమారుడు'. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. తొలి నంది అవార్డు అందించిన చిత్రం ఇదే. ఈ సినిమాతోనే ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా నంది పురస్కారం దక్కించుకొన్నారు.
*'ఒక్కడు' చిత్రానికిగానూ తొలిసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకొన్నారు మహేష్. ఉత్తమ నటుడిగా తొలి నంది అందించిన చిత్రం మాత్రం 'నిజం'. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మహేష్‌ని ఓ కొత్త కోణంలో చూపించింది.
* నమ్రత తొలి తెలుగు చిత్రం 'వంశీ'. ఈ సినిమా చిత్రీకరణలో ఏర్పడిన స్నేహం.. వీరిద్దరి పెళ్లికి దారితీసింది. లిసారే, బిపాసాబసు (టక్కరి దొంగ), సోనాలీ బింద్రే (మురారి), అమృతారావు (అతిథి)ల తొలి తెలుగు హీరో మహేష్‌బాబు. ఇప్పుడు కృతిసనన్ (వన్) కూడా మహేష్‌తోనే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది
* కౌబోయ్ సినిమాలకు పెట్టింది పేరు కృష్ణ. ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన మహేష్‌బాబు కూడా కౌబోయ్‌గా అలరించారు. ఆయన పూర్తిస్థాయి కౌబోయ్ పాత్ర పోషించిన చిత్రం 'టక్కరి దొంగ'. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించారు.
*మహేష్ తన కెరీర్‌లో ఒకే ఒక్క కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ఆయనే శోభన్. వీరిద్దరి కలయికలో 'బాబి' వచ్చింది.
* „ాణిజ్య ప్రకటనల్లోనూ మహేష్‌బాబు దుమ్ము రేపుతున్నారు. చాలా సంస్థలకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే తొలిసారి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది థమ్స్ అప్‌కే.
*'జల్సా' సినిమాకి తొలిసారి గొంతు అరువిచ్చారు మహేష్‌బాబు. త్రివిక్రమ్‌తో ఉన్న స్నేహం వల్ల ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పారు. ఆ తరవాత 'బాద్‌షా' సినిమాకీ మాటసాయం అందించారు. సామాజిక సంస్థ 'మర్ద్' కోసం తొలిసారి ఓ పద్యం పాడారు.
* మహేష్ ట్విట్టర్లో కూడా ఉన్నారు. అప్పుడప్పుడూ ట్విట్ చేసినా ఆయన ఫాలోయర్స్ మాత్రం లక్షల్లో ఉన్నారు. గురువారం నాటికి ఆరులక్షల మూడు వేల మూడువందలు దాటేశారు. ఏ దక్షిణాది నటుడికీ ఈ స్థాయిలో ఫాలోయర్స్ లేరు.
* కథానాయికల్ని లిప్‌లాక్ చేయడంలోనూ మహేష్ ముందుంటారు. 'బాబి' (ఆర్తి అగర్వాల్), 'నాని' (అమీషాపటేల్), 'అతడు' (త్రిష), 'దూకుడు' (సమంత), 'బిజినెస్‌మేన్' (కాజల్) సినిమాల్లో కథానాయికల పెదవిని అందుకొన్నారు.
*మహేష్ నటిస్తున్న తాజా చిత్రం 'వన్' ప్రచార చిత్రాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్ మహేష్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకొంది. పది లక్షల మంది యూట్యూబ్‌లో ఈ ప్రచార చిత్రాన్ని తిలకించారు. ఈ సంఖ్యలో ఓ ప్రచార చిత్రాన్ని తిలకించడం తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ అరుదైన విషయమే. | |
* ''మహేష్‌బాబు ఓ ప్రత్యేకమైన నటుడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఇద్దరం కలసి నటించాం. సెట్లో నిజంగా నాకు తమ్ముడుగానే కనిపించేవాడు. పాత్రలోకి చాలా తొందరగా వెళ్లిపోతాడు. పనిమీద అతని నిబద్ధత నాకు బాగా నచ్చింది'' - వెంకటేష్ | |
*
''మహేష్ అందమైన కథానాయకుడు. మహేష్ నుంచి నేను కోరుకొనేది ఏమైనా ఉంటే.. అతని అందమే. చాలా సహజంగా నటిస్తాడు''. - రామ్‌చరణ్ |
|
*''మహేష్ నాకెప్పుడూ నటిస్తున్నట్టు అనిపించలేదు. సహజంగా నటిస్తాడు. అతని
వల్ల పాత్రకు సరికొత్త శక్తి వస్తుంది. తనతో రెండు సినిమాలు చేశా. 'అతడు'లో
చాలా తక్కువ మాట్లాడతాడు. అన్నీ పోగేస్తే అతని కోసం రాసిన డైలాగులు మూడు
పేజీలు మించవు. డబ్బింగ్ కూడా రెండు మూడు గంటల్లో ముగిసిపోయింది. 'ఖలేజా'
అలా కాదు. సినిమా అంతా మాట్లాడుతూనే ఉంటాడు. పాత్రల్లో వైవిధ్యం బాగా
చూపిస్తాడు'' - త్రివిక్రమ్ |
|
*''రజనీకాంత్‌కి తమిళంలో ఎంత మార్కెట్ ఉందో, తెలుగులో మహేష్‌కి అంత మార్కెట్
ఉంది. ఆయనతో నాకూ ఓ సినిమా చేయాలని వుంది. 'గుఢచారి 116', 'అల్లూరి
సీతారామరాజు', 'జేమ్స్‌బాండ్' వీటిలో ఎలాంటి కథ చేస్తే బాగుంటుందో మహేష్
అభిమానులే చెప్పాలి. దాన్ని బట్టి మహేష్ కోసం ఓ కథ రాసుకొంటా'' - రాజమౌళి |
|
* ''నేను రాసిన సంభాషణలకు మరింత బలం తీసుకొచ్చిన కథానాయకుడు మహేష్‌బాబు. పది
పైసల డైలాగ్‌ని రూపాయిగా మారుస్తారు. నటిస్తున్నట్టు నాకెప్పుడూ
అనిపించలేదు. కట్ చెప్పడం మర్చిపోయిన సందర్భాలూ ఉన్నాయి'' - పూరి జగన్నాథ్ |
|
* ''మహేష్ నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నా. 'ప్రతి సినిమానీ నీ మొదటి
సినిమాగా భావించు' అనే సలహా ఇచ్చారు. అది ఇప్పటికీ పాటిస్తున్నా. ఆయనతో
కలసి నటించాలని ప్రతీ కథానాయిక కోరుకొంటుంది. ఆ అవకాశం కెరీర్
ప్రారంభదశలోనే రెండుసార్లు నాకు దక్కడం నా అదృష్టం''. - సమంత |
|
*''సినిమా అంతా తన భుజాలపై వేసుకొని నడిపించగల నటుడు. సన్నివేశాన్ని చాలా తొందరగా అర్థం చేసుకొంటారు. రీటేక్‌లూ తక్కువే. అందుకే ఆయన పక్కన నటించేవారు ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. డైరెక్టర్ కట్ చెప్పగానే మామూలైపోతారు''-కాజల్ |
Labels: Cinima/ Telugu, Liesure/Telugu, Personality, Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home