సిల్లీ పాయింట్
* ఆసియా ఆడ ఏనుగుకు దంతాలుండవు. అదే ఆఫ్రికా ఏనుగుల్లో అయితే ఆడవాటికి కూడా దంతాలుంటాయి.
* ప్రస్తుత పోప్ బెనెడిక్‌్టXIV వద్ద 2 గిగాబైట్ల సామర్థ్యం గల తెల్లరంగు ఐపాడ్ ఉంది.
* భుక్తాయాసం వచ్చేటట్టు తింటే కొద్దిసేపటి దాకా వినికిడి శక్తిలో చురుకుదనం లోపిస్తుంది.
*ఇంద్రధనుస్సు ఎప్పుడూ సూర్యుడికి అభిముఖంగానే ఏర్పడుతుంది.
* సువారో కాక్టస్ అనే రక్కిస వెుక్కకు కొమ్మ రావడానికి 75 ఏళ్లు పడుతుంది.
* దిబ్బడేసిన నాసికా నాళాలు శృంగారంలో పాల్గొంటే తెరుచుకుంటాయి.
* డాక్టర్ పేరుగల వైద్యులు అమెరికాలో 23 మంది ఉన్నారు. నేమ్‌బోర్డ్‌పై వారి పేరు ఇలా ఉంటుంది... Dr.Doctor
* కిల్లర్‌వేల్ నీటి ఉపరితలానికి వచ్చినప్పుడు దాని గుండె నిమిషానికి 60 సార్లు కొట్టుకుంటుంది. అదే అడుగుభాగాన ఆ రేటు నిమిషానికి 30.
*కుడిచేతి వాటం వాళ్ల కన్నా ఎడమచేతి వాటం వారు క్రీడల్లో చురుగ్గా ఉంటారు.
* అమెరికా అధ్యక్షుల్లో గడ్డం ఉన్నవారంతా రిపబ్లికన్‌లే.
* మగమేక మూత్రంలో అవ్మోనియా అధికంగా ఉంటుంది.
* 'తనను తాను ఓ నాయకుడిగా భావించుకునే దురహంకార పూరిత దుందుడుకు పిల్లాడు' ...హిట్లర్ మూడోతరగతి చదువుతున్నప్పుడు అతని గురించి టీచర్ ఇచ్చిన రిపోర్టు ఇది.
* జిరాఫీలు దగ్గలేవు.
* చంద్రుడి దశనూ వచ్చే కాలాన్నీ బట్టి బ్లూమూన్, బ్లాక్‌మూన్, హార్వెస్ట్ మూన్, హంటర్స్‌మూన్(దీన్నే బ్లడ్‌మూన్, సాంగ్విన్‌మూన్ అని కూడా అంటారు), క్రిసెంట్‌మూన్, రైజింగ్ క్రిసెంట్‌మూన్, గిబ్బస్‌మూన్, డ్రైమూన్, వెట్‌మూన్, ఫెయిరీమూన్, న్యూమూన్, హాఫ్‌మూన్, ఫుల్‌మూన్... ఇలా దాదాపు 13కుపైగా పేర్లున్నాయి.
*పందుల శరీరనిర్మాణం దృష్ట్యా అవి తల పూర్తిగా పైకెత్తి ఆకాశాన్ని చూడటం అసాధ్యం
*ఇంగ్లండులోని గ్లూసెస్టర్‌షైర్ విమానాశ్రయ ప్రాంతాల్లో పక్షుల్ని తోలడానికి ఎయిర్‌పోర్ట్ అధికారులు అమెరికన్ రాక్ గాయని టీనాటర్నర్ పాటలు ప్రసారం చేస్తుంటారు. ఆమె గొంతులో పలికే పైస్థాయి స్వరాలే అందుకు కారణం. టీనాకు ఉత్తమ గాయనిగా మంచి పేరుంది. ఎనిమిది గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఘనతా ఉంది.
*ఈఫిల్ టవర్‌పై కొనకు ఎక్కడానికి 1665 మెట్లున్నాయి.
(Eenadu, 14:10:2007)
______________________________________________
Labels: Amazing
0 Comments:
Post a Comment
<< Home