బాపు బొమ్మరిల్లు
బాపు బొమ్మ... ఎంత చూసినా తనివి తీరదు.బాపు బొమ్మ... దానికి పోలికా లేదు, సాటీ లేదు.బాపు బొమ్మంటే బాపు బొమ్మే.నవరసాలూ సంస్కృతీ సాంప్రదాయాలూ నిండు జవ్వని సోయగాలూ పురాణేతిహాసాలూ దేవుళ్లూ దేవతలూ... ఆయన కుంచెలో లేనివి లేవు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జందెమేల అన్నట్లు బాపు గురించి ఆయన బొమ్మల గురించి ఆంధ్రులకు పరిచయం చేయనక్కర్లేదు. అలాంటి అపురూపమైన బొమ్మలను అందరికీ అందుబాటులోకి తేవాలని సంకల్పించారు ఆయన అభిమాని దుర్గాప్రసాద్. ఎంతో శ్రమించి, కొన్నింటిని 'హరివిల్లు' పేరుతో పుస్తకంలో పొందుపరిచారు. వాటిని ఏయే సైజుల్లో అందిస్తున్నారో కూడా చివర్లో పేర్కొన్నారు. కావాల్సినవారు కొనుక్కోవచ్చు. అంతేకాదు, బొమ్మలు వేయడం నేర్చుకునేవారికోసం చిట్కాలూ ఉన్నాయి. ఇంగ్లిషులో కాకుండా తెలుగులో ఉంటే ఇంకా బాగుండేది.
హరివిల్లు
(బాపు బొమ్మలు ఫర్ ఇంటీరియర్ డెకరేషన్)
సేకరణ: గంధం కనకదుర్గాప్రసాద్
పేజీలు: 140; వెల: రూ.500/-
ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలు.
- వరలక్ష్మి
(Eenadu, 21:10:2007)
__________________________
Labels: Books, Telugu/ culture, Telugu/ culture/ books
0 Comments:
Post a Comment
<< Home