My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, October 17, 2007

I never take risk while drinking

When I come from office in the evening, wife is cooking

I can hear the noise of utensils in the kitchen

I stealthily enter the house

Take out the bottle from my black cupboard

Shivaji Maharaj is looking at me from the photo frame

But still no one is aware of it

Becoz I never take a risk

I take out the glass from the rack above the old sink

Quickly enjoy one peg

Wash the glass and again keep it on the rack

Of course I also keep the bottle inside my cupboard

Shivaji Maharaj is giving a smile

I peep into the kitchen Wife is cutting potatoes

No one is aware of what I did Becoz I never take a risk

I: Any news on Iyer's daughter's marriage?

Wife: Nope, she doesn't seem to be that lucky. Still they are looking out for her

I again come out; there is a small noise of the black cupboard

But I don't make any sound while taking out the bottle

I take out the glass from the old rack above sink

Quickly enjoy one peg

Wash the bottle and keep it in the sink

Also keep the Black Glass in the cupboard

But still no one is aware of what I did

Becoz I never take a risk

I: But still I think Iyer's daughter's age is not that much

Wife: What are you saying? She is 28 yrs old... like an aged horse

I: (I forgot her age is 28) Oh Oh...

I again take out potatoes out from my black cupboard

But the cupboard's place has automatically changed

I take out the bottle from the rack and quickly enjoy one peg in the sink

Shivaji Maharaj laughs loudly

I keep the rack in the potatoes & wash Shivaji Maharaj's photo & keep it

in the black cupboard

Wife is keeping the sink on the stove

But still no one is aware of what I did

Becoz I never take a risk

I: (getting angry) you call Mr. Iyer a horse? If you say that again, I

will cut your tongue...!

Wife: Don't just blabber something, go out and sit quietly...

I take out the bottle from the potatoes

Go in the black cupboard and enjoy a peg

Wash the sink and keep it over the rack

Wife is giving a smile

Shivaji Maharaj is still cooking

But still no one is aware of what I did

Becoz I never take a risk

I: (laughing) So Iyer is marrying a horse!!

Wife: Hey go and sprinkle some water on your face...

I again go to the kitchen, and quietly sit on the rack

Stove is also on the rack

There is a small noise of bottles from the room outside

I peep and see that wife is enjoying a peg in the sink

But none of the horses are aware of what I did

Becoz Shivaji Maharaj never takes a risk

Iyer is still cooking

And I am looking at my wife from the photo and laughing Becoz I never take what???

(an email forward)
_________________________________________

రిస్క్‌
క(వి)థాపజ్జగజ్జెం
పెగ్‌-1: మందు విషయంలో మాత్రం మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, మా ఆవిడ వంట చేస్తూంటుంది.వంటింట్లోంచి వంటపాత్రల శబ్దం వినిపిస్తూంటుంది.మనం పిల్లిలా ఇంట్లో దూరతాం.చెక్క బీరువాలోంచి మందు బాటిల్‌ తీస్తాం. ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.ఎవరూ వాడని బాత్రూం అటకమీంచి గ్లాసందుకుంటాం.లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.గ్లాసు కడిగేసి అటకమీద పెట్టేస్తాం.అఫ్‌కోర్స్‌, బాటిల్‌ కూడా చెక్కబీరువాలో పెట్టేస్తాం.తాతగారు బోసినవ్వుతో చూస్తారు.వంటింట్లోకి తొంగిచూస్తాను.మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది.ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
నేను: శర్మగారమ్మాయి పెళ్ళి సంగతేమైంది?
ఆవిడ: తిన్నగా ఉంటే కదా మంచి సంబంధాలు రావడానికి?

పెగ్‌-2: మనం మళ్ళీ ఇవతలికి వస్తాం.
చెక్కబీరువా తలుపు చప్పుడు చేస్తుంది.
మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్‌ తీస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
బాటిల్‌ కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
నేను: ఏమిటోయ్‌, మన శర్మ కూతురు అప్పుడే పెళ్ళీడుకొచ్చేసిందా?
ఆవిడ: ఇంకా పెళ్ళి వయసేమిటి? అడ్డగాడిదలా ముప్ఫైయేళ్ళొస్తుంటే.
నేను: ఓ... ఐసీ!

పెగ్‌-3: మనం మళ్ళా చెక్కబీరువాలోంచి చపాతీపిండి తీస్తాం.
చెక్కబీరువాలో బాత్రూం ప్రత్యక్షం అవుతుంది.
బాటిల్‌తీసి అటకలో రెండౌన్సులు పోస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి ముడుచుకుంటాం.
తాతగారు పడీపడీ నవ్వుతుంటాడు.
అటకని పిండిమీద పెట్టేసి
తాతయ్యని కడిగేసి చెక్కబీరువాలో పెట్టేస్తాం.
వంటింట్లోకి తొంగిచూస్తాం.
మా ఆవిడ పొయ్యిమీద బాత్రూం పెడుతుంది.
ఈ బాటిల్లో సద్దు ఆ బాటిల్లో పడనివ్వం.
ఎందుకంటే, మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
నేను: ఏంటే మా శర్మగార్ని గాడిదంటావా, తోలు ఒలిచేస్తాను.
ఆవిడ: ఊరికే గొడవ చెయ్యకుండా వెళ్ళి పడుకోండి.

పెగ్‌-4: మనం పిండిలోంచి బాటిల్‌ తీస్తాం. చెక్కబీరువాలోంచి ఓ పెగ్గు కలుపుతాం.
బాత్రూం కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
మా ఆవిడ ఫొటోలోంచి నవ్వుతూ చూస్తుంటే గాంధీ వంట చేస్తుంటాడు.
ఈ శర్మ సంగతి ఆ శర్మగాడికి తెలియనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
నేను: ఇంతకీ శర్మగాడి పెళ్ళి ఆ గాడిదతో అయిందా లేదా?
ఆవిడ: నెత్తిమీద బక్కెట్‌ నీళ్ళు పోశానంటే... వెళ్ళండి బయటికి.

పెగ్‌-5: నేను మళ్ళీ కిచెన్‌లోకి వెళ్తాను.
నిశ్శబ్దంగా అటకమీద కూర్చుంటాను.
డ్రాయింగ్‌రూంలోంచి బాటిళ్ళ శబ్దం వినిపిస్తుంటుంది.
నేను లోపలికి తొంగిచూస్తే మా ఆవిడ బాత్రూంలో మందేస్తుంటుంది.
వెంటనే లటక్కున మూతేసి చటుక్కున పెగ్గు తుడుచుకుంటాం.
ఈ గాడిద చప్పుడు ఆ గాడిద చెవిలో పడనివ్వం.
అఫ్‌కోర్స్‌, తాతయ్య ఎప్పుడూ రిస్క్‌ తీసుకోడు.
శర్మ వంట చెయ్యడం పూర్తయ్యేవరకూ
మనం ఫొటోలో కూర్చుని మా ఆవిణ్ణి చూసి నవ్వుతుంటాం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
మరాఠీ మూలం: అజ్ఞాత రచయిత
అనువాదం: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
(Eenadu, 21:10:2007)

__________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home