దేశాలు...నిజాలు
నార్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, గ్రేట్‌బ్రిటన్, చిలీ, అర్జెంటీనా... ఈ దేశాలన్నీ అంటార్కిటికాలో కొన్ని భూభాగాలు తమకు చెందినవనిప్రకటించుకున్నాయి.
ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం సూడాన్.
ఆంగ్ల అక్షరం 'ఎ'తో వెుదలయ్యే ఏ దేశం పేరైనా 'ఎ'తోనే ముగుస్తుంది... ఒక్క అఫ్గానిస్థాన్ పేరు తప్ప.
జాంజిబార్‌ను స్పైస్ ఐలండ్ అని కూడా అంటారు.
భూమ్మీద అతిపెద్ద ద్వీపం గ్రీన్‌ల్యాండ్. దాని విస్తీర్ణం 21,66,086 చ.కిమీ. జనాభా మాత్రం 56,326.
సహారా ఎడారి ప్రతి ఏడాదీ అరమైలు చొప్పున దక్షిణముఖంగా విస్తరించుకుంటూ పోతోంది.
పెరూ ఎగువభాగమే 1825లో బొలీవియా దేశంగా మారింది.
అమెరికా వెుత్తం మీద ఒకే ఒక్క రాజకోట... హొనలులూలో ఉంది.
డల్లాస్(అమెరికా) నగరాన్ని 'ద బిగ్ డి' అని పిలుస్తారు.
'లాపాజ్'... బొలీవియా నగర రాజధాని. ఎత్తు 11,800 అడుగుల పైమాటే. ప్రపంచంలో అత్యంత ఎత్త్తెన ప్రదేశంలో ఉన్న రాజధాని నగరమిది.
అంటార్కిటికా ఖండంలో సముద్రమట్టానికి దిగువన భూభాగమన్నదే లేదు.
బీజింగ్(చైనా) నగరానికే తలమానికంగా భావించే అత్యున్నత స్థాయి కట్టడాలు ఆ దేశస్థులు నిర్మించినవి కావు. ఉదాహరణకు 'ఫర్‌బిడెన్‌సిటీ'ని కట్టించింది మంగోలులు కాగా 'టెంపుల్ ఆఫ్ హెవెన్' మంచూరియన్ల ఘనత.
* ఐరోపాలో కేవలం ఒకే ఒక దేశం సరిహద్దుగా గల దేశాలు ఐదు ఉన్నాయి. పోర్చుగల్, డెన్మార్క్, శాన్ మారినో, వాటికన్ సిటీ, వెునాకో.
* అటకామా ఎడారి(చిలీ)లోని కలామా పట్టణంలో ఇంతవరకూ వర్షమన్నదే పడలేదు.
* మధ్యధరా సముద్రంలో ఉన్న అతి పెద్ద ద్వీపం సిసిలీ.
* డొమినికా, మెక్సికో, జాంబియా, కిరిబాటి, ఫిజీ, ఈజిప్ట్... ఈ ఆరు దేశాల జాతీయ జెండాలపైనా పక్షి చిహ్నాలుంటాయి.
* స్విట్జర్లాండ్ అధికారిక నామం 'కాన్‌ఫెడరేషన్ హెల్వెటికా'. హెల్వెటిక్ కాన్‌ఫెడరేషన్ అని కూడా సంబోధిస్తుంటారు. అందుకే ఆ దేశ అధికారిక వెబ్‌సైట్ల డొమైన్‌నేమ్ 'సీహెచ్' అని ఉంటుంది.
* 'డొమినికన్ రిపబ్లికన్' దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆ దేశాన్ని 'శాంటో డొమింగో' అని పిలిచేవారు.
* 'ఓ' అనే ఆంగ్ల అక్షరంతో వెుదలయ్యే రాజధానులు ప్రపంచంలో మూడు దేశాలకే ఉన్నాయి. అవి... అట్టావా(కెనడా), ఓస్లో(నార్వే), ఔగడౌగౌ(బుర్కినాఫాసో).
* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతిచిన్న రాష్ట్రం 'రోడ్ ఐలండ్'. దాని పూర్తిపేరు... రోడ్ ఐలండ్ అండ్ ప్లాంటేషన్ ప్రావిన్సెస్.
* ప్రపంచంలోనే అత్యంత మారుమూల ఉన్న ద్వీపం(రివోట్ ఐలండ్) 'ట్రిస్తాన్ డా కున్హా'. సబ్ అంటార్కిటిక్‌జోన్‌కు ఎగువన ఉందీ ద్వీపం.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగర భూభాగం కొంత యూరప్‌లోనూ మరికొంత ఆసియా ఖండంలోనూ ఉంటుంది. మధ్యలో జలసంధి ఉంటుంది. ఈ రెండు భాగాలను కలుపుతూ రెండు వంతెనలు ఉన్నాయి. వాటిని బాస్పొరస్ వంతెనలుగా వ్యవహరిస్తారు. ప్రపంచంలో మరే దేశ రాజధానికీ ఇలాంటి ప్రత్యేకత లేదు.
________________________________
Labels: Amazing
0 Comments:
Post a Comment
<< Home