My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, July 10, 2006

శ్రీ భగవద్గీత సూక్ష్మరూపం/The Gita In Miniature

___________________________________________________
అర్జున ఉవాచ
(question by Arjuna -soul's hunger for knowledge)
(కం.)ఏవిధి నిత్యము నినుమది
భావించుచు నున్న తెలియబడుదువు దేవా!
ఏ వస్తు రాశిలో నిను
భావింప, స్మరింప యోగివర! నాకొప్పున్.[శ్లో/17; అ/10.]

(ఆ.వె) నీవిభూతు లెవ్వి? నీ యోగమెట్టిది?
వినదలంతు నే విస్తరముగ;
అమ్రుత తుల్యములు జనార్ధనా! నీవాక్కు
లెంత వినిన మనసు త్రుప్తిపడదు.[శ్లో/18; అ/10.]
________________________________________________
శ్రీభగవానువాచ

(who Iswara is)
(తే.గీ)అవ్యయంబును నమ్రుతమైనట్టి దెద్ది
తానె ధర్మంబు శాశ్వతంబైన దెద్ది
నిశ్చలానంద రూపమై నెగడు నెద్ది
అట్టి బ్రహ్మంబునకు నేనె యాటపట్టు.[శ్లో/27; అ/14.]

(ఆ.వె)వసుధ నన్నిట సంవాసి నేను,
నాదు స్రుష్టియె మరపు జ్ఞానమును,స్మ్రుతియు,
తెలియ బడదగినది వేదములను నేనె,
వేద నిర్మాత వేదార్థ వేత్త నేనె. [శ్లో/15; అ/15.]

___________________________________
(all religions, all endeavours are pathways to God)
(తే.గీ)నన్ను భజియించువారి మానసము దెలిసి
అనుగుణంబగు ఫలముల నందజేతు;
సకల విధముల కౌంతేయ! జగతి జనులు
వర్తిలుచు నున్న వారు నా పథమునందె. [శ్లో/11; అ/4.]
_________________________________
(karma-yoga or the path of work)
(తే.గీ)అన్ని కర్మల నాకు సమర్పణంబు
చేసి, యర్జున!*అధ్యాత్మ చిత్తవ్రుత్తి
కామమును వీది మమతను కడగద్రోసి
చింతలెడ బాసి యుద్దంబుసేయుమయ్య.[శ్లో/30; అ/3.]
(*అధ్యాత్మ చిత్తవ్రుత్తి= కర్తను నేను కాననెడి వివేకముతో)

(తే.గీ)ఏమి చేయుచు నున్నను, నేమితినిన,
ఎట్టి హోమము సల్పిన, నెయ్యదిడిన,
తపమొనర్చిన కౌంతేయ! తప్పకుండ
దాని నాకు సమర్పింప దగును సుమ్ము.[శ్లో/27; అ/9.]

(తే.గీ)అట్లు సన్న్యాస యోగయుక్తాత్ముడవయి
పాప పుణ్యము లనియెడి ఫలములుగల
కర్మ బంధంబు నుండి మోక్షంబు వడసి,
శాశ్వత విముక్తి బడయంగ జాలుదీవు. [శ్లో/28; అ/9.]
_______________________________
(bhakti yoga)
(తే.గీ)ఇతర చింతలు మాని నన్నెవరు మదిని
సస్మరించుచు నుందురో సంతతంబు
అట్టి నిష్ఠాగరిష్ఠుల కవసరమగు
యోగ సంక్షేమములు జూచుచుందు నేను. [శ్లో/22; అ/9.]

(కం.)చిత్తం నాయంది వా
యత్తము గావించి బుద్ధినట్లే నాలో
హత్తించిన నాలో కురు
సత్తమ! నివసింతు వికను, సత్యము సుమ్మీ.[శ్లో/8; అ/12.]
_____________________________________
(jnana yoga)
(తే.గీ)ఎల్ల భూతములందు నన్నెవడు గాంచు,
నెవడు భూతాళి నెల్ల నాయందు గనునొ,
అతని కేను సాక్షాత్కారమగుదు, నిజము;
అటులె నాద్రుష్టి దాటి పోడాతడేని. [శ్లో/30; అ/6.]

(తే.గీ)అఖిల భూతస్థితుండ నైనట్టి నన్ను
ఏకమను భావమున భజియించు యోగి
అఖిల చర్యల వర్తిల్లు నప్పుడైన
వెలయుచుండును, నాయందు వేరుగాక. [శ్లో/31; అ/6.]

(తే.గీ)సకల జీవుల సుఖధు:ఖ సంఘటనలు
తనకె వాటిల్ల నట్లుగ దలచి యెవడు
సకల భూతము లెడలను సమత నెరపు
నట్టి యోగియె శ్రేష్ఠుడౌ నవని పార్థ![శ్లో/32; అ/6.]
_________________________________
(summary of karma, bhakti and jnana yogas)
(తే.గీ)నాకు కర్మల నర్పించి, నన్నె మదిని
పరమ గతియని నమ్మి లంపటుడుగాక
ప్రాణి కోట్లెడ వైర భావంబు లేని
నాదు భక్తుండు పాండవ! నన్ను పొందు. [శ్లో/55; అ/11.]
_____________________________________________________

(Final message of the Gita i.e that absolute surrender to God is the easiest way by which we can escape the sin and sorrow of this world)
(తే.గీ)మనము నాయందు నెలకొల్పి మహిత భక్తి
ననుభజింపు; నమస్క్రుతుల్ నాకొసంగు;
నన్నె పొందుదు వట్లీవు; నమ్ము, ఆన;
ప్రియుడ వౌట సత్యంబు దెల్పితిని నీకు. [శ్లో/65; అ/18.]

(తే.గీ)అన్ని ధర్మంబులను విడనాడి నీవు
నన్నొకని మాత్రమే శరణంబు గొనుము;
అన్ని పాపంబు లందుండి నిన్ను నేను
ముక్తునొనరింతు, దు:ఖంబు బొందవలదు. [శ్లో/66; అ/18.]

____________________________________
(Man has absolute freedom to choose his own destiny)
(తే.గీ)అతి రహస్యములందు రహస్యమైన
జ్ఞానమును బోధసేసితి; దీని నీవు
చాల సాకల్యముగ విమర్శన మొనర్చి
ఆచరించుము నీ కిష్టమైన పగిది. [శ్లో/63; అ/18.]
__________________________________________
అర్జున ఉవాచ

(response of Arjuna to the whole teaching)
(ఆ.వె)నీయను గ్రహమున నిశ్శేషముగ మోహ
మంతరించె నచ్యుతా! మదీయ
సంశయములు తొలగె; జ్ఞానము సమకూరె,
నీ ప్రబోధమట్లు నే చరింతు. [శ్లో/73; అ/18.]
_______________________________________________________________
("శ్రీమద్భగవద్గీతార్థ చంద్రిక (సరళ పద్యానువాదము)" అనువక్త- శ్రీ భట్టారం రాధాక్రుష్ణయ్య,31/60. లలితారామం,11 అడ్డ రోడ్డు, బాలాజి నగర్, నెల్లూరు-524 002)
____________________________________________________________________

Labels:

1 Comments:

Blogger cbrao said...

Meaning of the Gitasaram may be explained in simple prose also for the benefit of the readers.

9:24 am

 

Post a Comment

<< Home