My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, September 23, 2007

చరిత్రలో ఈ వారం

సెప్టెంబరు 23
1846: ఫ్రెంచ్‌ ఖగోళశాస్త్రవేత్త అర్బెయిన్‌ జీన్‌జోసెఫ్‌ లీ వెర్రియర్‌, బ్రిటన్‌ శాస్త్రవేత్త జాన్‌కౌచ్‌ ఆడమ్స్‌ అంచనాల మేరకు ఖగోళాన్ని పరిశోధించి నెప్ట్యూన్‌ గ్రహ ఉనికిని కనుగొన్నారు. నిజానికి అంతకు రెండు దశాబ్దాల ముందర 1612 డిసెంబరు 18న ఒకసారీ 1613లో మరొకసారీ గెలీలియో గెలీలీ నెప్ట్యూన్‌ను టెలిస్కోపులో చూశాడు. కానీ దాన్ని ఆయన గ్రహం అనుకోలేదు. ఓ స్థిర నక్షత్రం అనుకుని ఊరుకొన్నాడు. తర్వాత ఆ విషయం మరుగున పడిపోయింది. 1843లో జాన్‌కౌచ్‌ ఆడమ్స్‌ దీనిపై పరిశోధన చేసి వేరేగ్రహానికి(అదే నెప్ట్యూన్‌) సంబంధించిన కక్ష్యను యురేనస్‌ ఖాతాలో వేశారని వివరించాడు. అయితే, తన వాదనను బలపరిచే ఆధారాలు చూపించలేక మిన్నకుండిపోయాడు. 1846లో లీ వెర్రియర్‌ అదే విషయాన్ని కనుగొన్నాడు. అయితే బౌచర్‌లా ఊరుకోక బెర్లిన్‌ అబ్జర్వేటరీ డైరెక్టర్‌ గాట్‌ఫ్రైడ్‌ గల్లె సాయం అర్థించాడు. గల్లె తన వేధశాలలో టెలిస్కోపు ద్వారా సెప్టెంబరు 23న నెప్ట్యూన్‌ గ్రహాన్ని చూసి దాని ఉనికిని నిర్ధరించాడు. వెుదట్లో దాన్ని లీ వెర్రియర్‌ ప్లానెట్‌ అని పిలిచారు. జానుస్‌, హెర్షెల్‌, జార్జియన్‌ వంటి శాస్త్రవేత్తల పేర్లను పరిశీలించారు. కానీ దాన్ని కనుగొన్న వెర్రియర్‌ సూచన ప్రకారం రోమన్‌ సముద్రదేవత నెప్ట్యూన్‌ అనే పేరునే చివరకు ఖాయం చేశారు.

సెప్టెంబరు 24

622: మక్కా నుంచి బయలుదేరిన మహమ్మద్‌ ప్రవక్త యాత్ర(హిజ్రా) మదీనాకు చేరుకోవడంతో ముగిసింది.

సెప్టెంబరు 28

1838: వెుఘల్‌సామ్రాజ్యపు ఆఖరు చక్రవర్తి రెండో బహదూర్‌షా జఫర్‌ సింహాసనాన్ని అధిష్టించాడు. అప్పటికి ఆయనకు అరవైరెండు ఏళ్లు. 1857 సెప్టెంబరు 14 దాకా అధికారంలో ఉన్న బహదూర్‌ను సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో నిర్బంధించారు. ఆయన ఇద్దరు కొడుకుల్నీ మనవణ్నీ కళ్లెదుటే నరికి చంపారు. అనంతరం ద్వీపాంతరవాసం పేరిట ఆయన్ను రంగూన్‌(బర్మా)కు తరలించారు. జీవితాంతం అక్కడే ఉన్న బహదూర్‌షా చివరికి ఆ గడ్డపైనే కన్నుమూశాడు. అలా 1526లో బాబరుతో వెుదలై మూడుశతాబ్దాల పైబడి సాగిన వెుఘలుల పాలన బహదూర్‌షాతో అంతమైంది.

సెప్టెంబరు 29

1981: తమ నాయకుడు సంత్‌ భింద్రన్‌వాలేను విడుదల చేయడంతోపాటు, 5లక్షల అమెరికన్‌ డాలర్లు ఇవ్వాలనే డిమాండ్లతో ఆరుగురు ఖలిస్తాన్‌ తీవ్రవాదులు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేశారు. అందులో 111మంది ప్రయాణికులు, ఆరుగురు విమానసిబ్బంది ఉన్నారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ వైపు వెళ్తున్న ఆ బోయింగ్‌737 విమానాన్ని లాహోర్‌కు దారిమళ్లించారు. హైజాక్‌కు వారు ఉపయోగించిన ఆయుధాలు డాగర్లు. అయితే అక్కడ పాకిస్థానీ కమాండోలు పారిశుధ్యకార్మికులుగా విమానంలోకి వెళ్లి హైజాకర్లను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు.
(Eenadu, 23:09:2007)
_____________________________

Labels:

2 Comments:

Anonymous Anonymous said...

It's copy and boring, please copy and post after it become old. By the way Sep 28 Fig not releated it!!!

4:42 am

 
Blogger C. Narayana Rao said...

Thank you, not only for your visiting my blog, but also for posting a comment on the entry here.

In the description under the heading, I have mentioned that this blog of mine is used as my 'scrapbook'. Previously,I used collect the paper as cuttings/ clippings of any news/information that used to amuse me.Now I simply store it in my blog and avoid paper clutter at home.

The Eenadu newspaper on net doesn't archive news beyond 90 days.Certain articles such as "చరిత్రలో ఈ వారం" is difficult to retrieve from these archives beyond one week. Hence this hurry to post it immediately.

On Sep 28, 1838, last Moghal emperor Bahadur Shaw jaffar ascended the throne. I don't find any discrepancy in that entry.

10:06 am

 

Post a Comment

<< Home