ఫన్‌కర్ ఫటాఫట్
* ఇండియాలో ఉన్నప్పుడు అమెరికా బాగుంటుందనిపించింది. తీరా అమెరికా వెళ్లాక ఇండియాయే బాగుందనిపిస్తోంది. కారణమేమిటంటారు?
-కాళీ ప్రసాద్‌రాజు మావులేటి, న్యూహాంప్‌షైర్, అమెరికా 'ఎవర్‌గ్రీన్' కళ్లద్దాలు వాడండి. అప్పుడు ఎక్కడుంటే అక్కడంతా పచ్చగా కనబడుతుంది.
* వ్యాపారంలో 'నగ్న' సత్యాలు చెబితే ఏమవుతుంది?
-కొక్కళ్ల మురళి, బాబీనగర్, జడ్చర్ల
మీది ఏ వ్యాపారమైనా ఫర్వాలేదు గాని... బట్టల వ్యాపారమైతేనే డేంజర్ సుమా!
* నేను అర్జంటుగా ఒక స్టేజీకి రావాలంటే ఏం చేయాలి?
- వి. సుందరం, చెన్నై
మైకు రిపేరింగ్ నేర్చుకుంటే సరి. వెంటనే స్టేజీ ఎక్కేయొచ్చు.
* కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత ధరించకూడని పాత్ర ఏమిటి?
-ఆర్. విఘ్నేశ్వరరావు, హైదరాబాద్
భిక్షాపాత్ర
* బిల్లు లేని సెల్లు
- ఫసుల్ రహమాన్, నాగర్ కర్నూలు
అంతా 'ఫ్రీ'పెయిడే
*మంత్రి పదవి తొందరగా రావడానికి నాయకులు ఏం వ్యాపారం చేస్తారు?
-విశ్వనాథ లక్ష్మీశైలజ, విజయవాడ
పార్టీ ఫిరాయింపుల వ్యాపారం
* విజిలెన్స్ కమిషన్ రిపోర్టులో మీ పేరేమయినా ఉందా?
- వి.ఆర్.కె. హనుమంతరావు, రాణి, సంగారెడ్డి
ఎడాపెడా 'తినేసే' వినాయకుడి పేరే లేదు. నా పేరెలా ఉంటుంది. అయినా, ఐ.ఎ.ఎస్. అంటే ఐయాం సేఫ్ అనేవాళ్లూ ఉన్నారు తెలుసా.
* బాగుపడాలంటే కాంట్రాక్టరయితే మంచిదా? ఇంజినీరయితే మంచిదా?
- పాలగుమ్మి అనుదీప్, అలేఖ్య, నర్సాపురం
కాంట్రాక్టరయినా, ఇంజినీరయినా 'కమీషన్'ర్ అయితే కచ్చితంగా బాగుపడొచ్చు.
* మీరు ప్రతీదీ 'లైట్'గా తీసుకుంటారా?
- అబ్బూరి అంబరీష్, ఎన్‌జీఓ కాలనీ, హైదరాబాద్
తీసుకుందామనే ఉంటుంది గానీ వేయింగ్ మెషీన్ ఒప్పుకోదు కదా
* రణరంగం కన్నా నష్టదాయకమైంది;
- అయ్యగారి శ్రావణి, పావని, సనత్‌నగర్, హైదరాబాద్
రుణ రంగం
* అద్దాల వ్యాపారం బాగుండాలంటే?
-కొప్పినీడి ప్రసాద్, చింతలపల్లి
అందగత్తెల సంఖ్య పెరగాలి.
* చెట్లకు డబ్బుకాస్తే..
- డి. రామానంద్, కరీంనగర్.
అందరూ గురజాడను (ఏ)మార్చి 'చెట్టు'పట్టాల్ వేసుకుని 'కోశ'స్థులంతా నడువవలెనోయ్' అంటారు.
* అప్పు చేసి పప్పు కూడు తినడం అంటే?
-సయ్యద్ బాషా, పాత రాయచోటి
ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని చెట్టు కింద స్కూళ్లలో కంప్యూటర్లు పెట్టడం.
* పెట్టుబడి లేకుండా లాభాల పంట పండే వ్యాపారం?
- జోగిపర్తి ప్రసాద్, బుచ్చిరెడ్డిపాలెం.
ఎన్నికల్లో 'టిక్కెట్లు' ఇప్పిస్తాం రండి అని నమ్మించి డబ్బు కొట్టేయడం.
* 'చిదంబర' రహస్యం ఏమిటో?
-వాస్తు రామచంద్రారావు, నెల్లూరు
'విత్తం ప్రభూ' అనడమే!
* నాకింద వేలాది మంది పనిచేయాలంటే
-పి.వి. రమణ, తిరుపతి
ఆకాశ హర్మ్యంలో అన్నిటి కన్నా పై అంతస్తులో ఉండడమే.
(Eenadu, 30:09:2007)
______________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home