చరిత్రలో ఈ వారం
సెప్టెంబరు 10,1893:
చికాగోలో తొలి సర్వమత సమ్మేళన సభ (వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలీజియన్ కాన్ఫరెన్స్) జరిగింది. ఆ సభకు హాజరైన వివేకానందుడు 'సోదర సోదరీమణులారా...' అన్న సంబోధనతో అందరి మనసులూ గెల్చుకున్నాడు. నరేంద్రుడు ఉపన్యాసం ప్రారంభించి ఆ మాటలు అనగానే సభలో ఉన్న ఏడువేల మందీ ఉద్వేగంతో లేచినిలబడి దాదాపు మూడు నిమిషాలపాటు కరతాళధ్వనులు చేశారు.
సెప్టెంబరు 11,1906:
దక్షిణాఫ్రికాలో అహింసా ఉద్యమాన్ని సాగిస్తున్న గాంధీజీ 'సత్యాగ్రహం' అనే పేరును ఖాయం చేశారు. తొలుత దానికాయన పెట్టిన పేరు 'పాసివ్ రెసిస్టెన్స్'. అయితే ఆ మహా ఉద్యమానికి ఆంగ్లనామం ఏమిటన్న ఆలోచనతో చక్కటి పేరును సూచించిన వారికి బహుమతి ప్రకటించారు. అప్పుడు మగన్‌లాల్‌గాంధీ 'సదాగ్రహ్' అనే పేరును సూచించారు. దాన్ని గాంధీజీ 'సత్యాగ్రహ్'గా మార్చారు.
సెప్టెంబరు 13,1948:
భారతదేశంలో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉంటానని వెుండికేసిన నిజాం సంస్థానంపై పోలీసుచర్య వెుదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు. హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకొనే యత్నాలు చేసిన నిజాం ఆ ప్రయత్నాల్లో భాగంగా గుర్తింపుకోసం ఓ బృందాన్ని ఐక్యరాజ్యసమితికి కూడా పంపాడు. అత్యంత సుసంపన్నమైన హైదరాబాదు సంస్థానంపై పోలీసుచర్య విషయంలో నెహ్రూ, సర్దార్ వల్లబాయ్ పటేల్ మధ్య అభిప్రాయభేదాలుండేవి. పోలీసుచర్య వల్ల ముస్లిముల్లో తీవ్రవ్యతిరేకత వస్తుందనేది నెహ్రూ అభ్యంతరం. మౌంట్‌బాటెన్, రాజాజీ కూడా ఆయన్నే సమర్ధించారు. కానీ పటేల్ పట్టుపట్టారు. సెప్టెంబరు 13న ఆపరేషన్‌పోలో చేపట్టాలన్న పటేల్ ప్రతిపాదనకు భయపడిన నిజాం దాన్ని వాయిదా వెయ్యాల్సిందిగా రాజాజీని అభ్యర్థించారు. అందుకు రాజాజీ అంగీకరించినప్పటికీ... పోలీసు చర్య అప్పటికే వెుదలైపోయిందని పటేల్ ప్రకటించడంతో మిన్నకుండిపోయారు. ఆరోజు తెల్లవారుజామున మూడున్నరకు పోలీసుచర్య వెుదలైంది. భారతసైన్యమే ఈ చర్యను చేపట్టినప్పటికీ స్వంత భూభాగంపై సైన్యాన్ని ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందన్న ప్రశ్నలు ఉద్భవిస్తాయన్న ఆలోచనతో ప్రభుత్వం దీన్ని పోలీసుచర్యగా ప్రకటించింది.
2001, సెప్టెంబరు 11:
న్యూయార్క్ ట్రేడ్‌సెంటర్ జంటహర్మ్యాలపై అల్‌ఖైదా విమానాలతో దాడిచేసి కూల్చేసింది. అమెరికా ఆయుధాగారం పెంటగాన్‌పైనా దాడి చేసింది. ఈ దుర్ఘటనలో దాదాపు మూడువేల మంది అసువులు బాశారు. ఆ రోజు జరిగిందిదీ... అల్‌ఖైదాకు చెందిన 19మంది తీవ్రవాదులు ఆ రోజు ఉదయాన్నే నాలుగు విమానాల్ని హైజాక్‌చేసి విధ్వంసానికి తెరతీశారు. స్థానిక కాలమానం ప్రకారం వెుదటి విమానం 'ఫ్త్లెట్-11' సరిగ్గా 08:46:30 సెకన్లకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్‌టవర్‌నూ దాదాపు 16 నిమిషాల తర్వాత 09:02:59 సెకన్లకు రెండో విమానం 'ఫ్త్లెట్-175' సౌత్‌టవర్‌నూ ఢీకొన్నాయి. మూడో విమానంతో 9:37 నిమిషాలకు పెంటగాన్‌పై దాడి చేశారు. నాలుగో విమానంలో ప్రయాణికులూ సిబ్బందీ ఎదురుతిరగడంతో పరిస్థితి గందరగోళమైంది. అది పెన్సిల్వేనియా సమీపంలో పొలాల్లో కూలిపోయింది. ఒక్కో విమానంలో దాదాపు 91వేల లీటర్ల ఇంధనం ఉండడంతో ప్రమాదతీవ్రత మరింతమంది ప్రాణాలు తీసింది. వెుత్తం 2,974 మంది ఆరోజు మరణించారు. ఇంకో వ్యక్తి పేలుడు తాలూకూ ధూళిని పీల్చి చాలారోజుల తర్వాత ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయాడు. మరో 24మంది అసలు కనిపించకుండా పోయారు. ప్రమాదం కారణంగా రగులుకున్న మంటల్లో బూడిదై ఉంటారని 911కమిషన్ ఊహించింది. ఈ దాడులతో వణికిన అమెరికా ప్రభుత్వం ఆ దేశ గడ్డపై మూడురోజులపాటు అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్‌ను నిషేధించింది.
(Eenadu,09:09:2007)
----------------------------------------------
Labels: Events
0 Comments:
Post a Comment
<< Home