దేవుడు...నిజమా?భ్రమా?
మతం, పవిత్ర గ్రంథాల పేరిట కొనసాగుతున్న అబద్ధాలను ప్రశ్నిస్తూ రిచర్డ్ డాకిన్స్ రాసిన పుస్తకం 'ది గాడ్ డెల్యూజన్'. 'దేవుడి భ్రమలో' పేరిట ఇన్నయ్య అనువదించిన దీనిలో దేవుడి ఉనికికి సంబంధించిన అభిప్రాయాలు, నమ్మకాలు, మతం, నీతి, వ్యాపార రీతి తదితర అంశాలను చర్చించారు. 'క్రైస్తవ మతాన్ని మేధావులైన సుప్రసిద్ధులలో అధిక సంఖ్యాకులు నమ్మరు. కాని బహిరంగంగా ఆ విషయాన్ని దాచిపెడతారు. ఆదాయాలు పోతాయని వారికి భయం' అంటారు బెట్రాండ్ రస్సెల్. మతం, విజ్ఞానంపై కేంబ్రిడ్జ్‌లో టెంపుల్టన్ సంస్థ ఓ సమావేశాన్ని నిర్వహించి ఎంపికచేసిన సైన్స్ జర్నలిస్టులకు లక్షన్నర డాలర్ల చొప్పున చెల్లించిన వైనాన్ని డాకిన్స్ తప్పుబట్టారు. ఆ సంస్థ డబ్బు శాస్త్రీయరంగాన్ని చెడగొడుతోందంటూ నిరసన వ్యక్తం చేశారు. నిరంతరం కొనసాగుతుండే ఈ చర్చనీయాంశాలపై డాకిన్స్ ఓ వెబ్‌సైట్(వ్వ్వ్.రిచర్ద్దవ్కిన్స్.నెత్)నూ నిర్వహిస్తున్నారు.
దేవుడి భ్రమలో;
రచన: రిచర్డ్ డాకిన్స్
అనువాదం: ఇన్నయ్య;
పేజీలు: 325; వెల: రూ.200/-
ప్రతులకు: అక్షర, ప్లాట్ నం.46
శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్.
- వెంకట్
(Eenadu, 21:10;2007)
___________________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home