ఫన్‌కర్ ఫటాఫట్
* మా ఫ్రెండొకడు నేనేమి చెప్పినా 'తొక్క'లో విషయం అని తీసిపారేస్తున్నాడు. ఎందుకంటారు?
బహుశా మీ ఫ్రెండ్‌ది అరటిపళ్ల వ్యాపారం అయి ఉంటుంది. అంచేత మీరేమాత్రం వర్రీ అవక అతని మాటల్ని తుంగలో 'తొక్కే'యండి
----------------------------
* నాకెప్పటినుంచో ఓ సందేహం. పసిపిల్లలు సహా అంతా టాటా చెబుతారే తప్ప బిర్లా అనరేమిటండీ?
మనది 'తాతల' నుంచి వచ్చిన సంప్రదాయం కదమ్మా! అందుకే అలా. అంతకుమించి ఎక్కువ ఆలోచించొద్దు.
----------------------------
* ఎఫ్‌ఎమ్ రేడియోల భవిష్యత్తు ఎలా ఉండొచ్చునంటారు?
'విను'యోగదారుల మీద ఆధారపడి ఉంటుంది.
-------------------------------
* బలానికి ఏ విటమిన్ మంచిది?'ఏ' విటమిన్ అని మాత్రం చెప్పకండి.
అన్ని విటమిన్‌లలోకి ఎం(మనీ) విటమిన్ ఆరోగ్యదాయకం. ఇతరుల నుంచి అడ్డగోలుగా వచ్చేట్టయితే చచ్చినవాడు కూడా ఎంచక్కా లేచి కూర్చుంటాడు.
---------------------------
* లాభాలు రావాలంటే మార్గం ఏమిటి?
చెబితే నాకేంటి లాభం?
----------------------
* నేను బెడ్‌వర్క్స్ చేస్తుంటాను. ఇందులోనూ పోటీ ఎక్కువైపోయింది. తట్టుకొని పైకి రావాలంటే ఏం చేయాలి.
'పరుపు' ప్రతిష్ఠలు పెంచుకోవడమే.
--------------------------
*అవసరమయినవన్నీ అప్పనంగా వస్తుంటే....
'అప్పిచ్చువాడు' పద్యం అవసరమే ఉండదు.
-------------------------
*కొంతమంది డబ్బులు లెక్కపెట్టేటప్పుడు కళ్లకద్దుకుంటారు. ఎందుకని?
తమ కళ్లను తామే నమ్మలేక
-----------------------
*మన కళ్లముందు నుంచే గుజరాత్‌కు గ్యాస్ తరలిపోతుందంటే చాలా కంగారుగా ఉంది.
ఏం కంగారుపడొద్దు. నాయకులు ఉన్నంతవరకు 'గ్యాస్'కు ఎలాంటి లోటు ఉండదు.
------------------------
*పిచ్చి తుగ్లక్ హయాంలో మాదిరిగా మళ్లీ తోలు నాణేలు వస్తే...?
ఎవరు 'తోలు తీస్తారో'నని గడగడ వణికిపోవలసి వస్తుంది.
-----------------------
*గిఫ్టు ఎందుకిస్తారు?
లిఫ్టు కోసం
---------------------
(Eenadu, 21:10:2007)
_____________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home